Intellectual Property Right
-
లక్ష పేటెంట్లు మంజూరు.. అధికంగా ఎందులో తెలుసా..
గతేడాదిలో సుమారు లక్ష పేటెంట్లను మంజూరు చేసినట్లు భారతీయ పేటెంట్ కార్యాలయం తెలిపింది. ప్రధానంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) రిజిస్ట్రేషన్లలో చెప్పుకోదగ్గ పెరుగుదల ఉందని, గత ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయని పేర్కొంది. ఈమేరకు తాజాగా వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో ప్రతి 6 నిమిషాలకు ఒక టెక్నాలజీ ఐపీ రైట్స్కోసం నమోదవుతున్నట్లు ప్రకటనలో పాలిపారు. 2022-23లో అత్యధికంగా 90,300 పేటెంట్ దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (15-మార్చి-2023 నుంచి 14-మార్చి 2024 వరకు) లక్షకు పైగా పేటెంట్లను మంజూరు చేశారు. ప్రతిరోజు 250 పేటెంట్లు మంజూరు చేసినట్లు తెలిసింది. 2013–14లో కేవలం 6 వేల పేటెంట్లు మాత్రమే ఇష్యూ అయినట్లు ప్రకటనలో తెలిపారు. ఇదీ చదవండి: 2003-07 నాటి వృద్ధిరేటు దిశగా భారత జీడీపీ ఈ సంఖ్య లక్షకు పెరగడం పట్ల వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది. విభిన్న అంశాలపై పరిశోధనలు చేస్తున్న ఆచార్యులు, సృజనాత్మకమైన ఆలోచనలతో కొత్త పరికరాలు, యంత్రాలను కనిపెడుతున్న వారు పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంటారు. -
బ్రిటీష్ వారి లీ కూపర్ బ్రాండ్.. ఇప్పుడీ భారతీయ కంపెనీ సొంతం..
Iconix Lifestyle India: బ్రిటిష్ బ్రాండ్ లీ కూపర్ మేధోసంపత్తి హక్కులను భారత్‌లో ఐకానిక్స్ లైఫ్‌స్టైల్ ఇండియా దక్కించుకుంది. లీ కూపర్ ఉత్పత్తుల పంపిణీని విస్తృతం చేయడంతోపాటు బ్రాండ్ స్థానాన్ని మరింత పదిలపరిచేందుకు ఐకానిక్స్కు ఈ డీల్ దోహదం చేయనుంది. రిలయన్స్, ఐకానిక్స్ బ్రాండ్ సంయుక్తంగా ఐకానిక్స్ లైఫ్‌స్టైల్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. 1908 నుంచి స్వాతంత్రానికి పూర్వమే బ్రిటీష్ కంపెనీగా లీ కూపర్ బ్రాండ్ ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ బ్రాండ్ నుంచి వచ్చిన డెనిమ్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. 126 దేశాల్లో ఈ కంపెనీ విస్తరించింది. లేడీస్, జంట్స్, చిల్ట్రన్ ఇలా అన్ని కేటగిరిల్లో తమ ఉత్పత్తులను లీ కూపర్ అందుబాటులో ఉంచింది. తాజాగా ఈ కంపెనీకి చెందిన మేథో హక్కులను ముఖేశ్ అంబానీ ఆధీనంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ (ఆర్బీఎల్) సొంతం చేసుకుంది. దీంతో లీ కూపర్ బ్రాండ్ మరింతగా భారతీయులకు చేరువ కానుంది. గతంలో గతంలో టాటా గ్రూపు ల్యాండ్‌రోవర్, జాగ్వార్ వంటి విదేశీ కంపెనీనలు చేజిక్కించుకుని సంచలనం సృష్టించింది. తాజాగా రిలయన్స్ సంస్థ సైతం అంతర్జాతీయ బ్రాండ్లను సొంతం చేసుకునే పనిలో ఉంది. -
పాఠ్యాంశంగా మేధో సంపత్తి హక్కులు
న్యూఢిల్లీ: మేధోసంపత్తి హక్కులకు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక సబ్జెక్టును చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం కింద అందుబాటులోకి తీసుకురావాలని వర్సిటీలను యూజీసీ కోరింది. ఈ మేరకు యూజీసీ కార్యదర్శి జస్పాల్ ఎస్. సంధు వర్సిటీలకు లేఖ రాశారు. మానవ మేధస్సుకు సంబంధించిన సరికొత్త ఆవిష్కరణలు, పేర్లు, ఫొటోలు, కళాకృతులు, సాహిత్యం, పారిశ్రామిక రంగ సంబంధిత పరికరాలు మేధోసంపతి హక్కుల కిందకు వస్తాయని లేఖలో పేర్కొన్నారు.