మేధోసంపత్తి హక్కులకు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక సబ్జెక్టును చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం కింద అందుబాటులోకి తీసుకురావాలని వర్సిటీలను యూజీసీ కోరింది.
న్యూఢిల్లీ: మేధోసంపత్తి హక్కులకు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక సబ్జెక్టును చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం కింద అందుబాటులోకి తీసుకురావాలని వర్సిటీలను యూజీసీ కోరింది. ఈ మేరకు యూజీసీ కార్యదర్శి జస్పాల్ ఎస్. సంధు వర్సిటీలకు లేఖ రాశారు.
మానవ మేధస్సుకు సంబంధించిన సరికొత్త ఆవిష్కరణలు, పేర్లు, ఫొటోలు, కళాకృతులు, సాహిత్యం, పారిశ్రామిక రంగ సంబంధిత పరికరాలు మేధోసంపతి హక్కుల కిందకు వస్తాయని లేఖలో పేర్కొన్నారు.