
హాకీ జట్టు గోల్‌కీపర్ శ్రీజేష్‌కు పురస్కారం
భారత పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్, వైస్ కెప్టెన్ పీఆర్ శ్రీజేష్‌కు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘లెఫ్టినెంట్ కల్నల్ జీవీ రాజా అవార్డు’ దక్కింది. త్రివేండ్రంలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చేతుల మీదుగా శ్రీజేష్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ అవార్డు కింద శ్రీజేష్‌కు రూ. 3 లక్షల నగదు అందజేశారు.