బై బై.. సెర్బియా | Taapsee Pannu to shoot final schedule of SOORMA in Serbia | Sakshi
Sakshi News home page

బై బై.. సెర్బియా

Published Mon, Dec 25 2017 12:24 AM | Last Updated on Mon, Dec 25 2017 12:24 AM

Taapsee Pannu to shoot final schedule of SOORMA in Serbia - Sakshi

సొంత గడ్డపై మ్యాచ్‌లు కంప్లీట్‌ అయ్యాయి. ఇక విదేశీ గడ్డపై సత్తా చాటేందుకు వెళ్లారు హీరోయిన్‌ తాప్సీ. ఇంతకీ...తాప్సీ ప్రజెంట్‌ ఏ గేమ్‌ ప్లేయర్‌ అంటే..‘హాకీ’ అని ఇట్టే ఊహించే ఉంటారు. బీ టౌన్‌ డైరెక్టర్‌ షాద్‌ అలీ దర్శకత్వంలో హాకీ ప్లేయర్‌ సందీప్‌ సింగ్‌ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సూర్మ’.  సందీప్‌ రోల్‌ను హిందీ యాక్టర్‌ దిల్జీత్‌సింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా తాప్సీ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్‌ సీన్స్‌ను చత్తీస్‌ఘడ్‌లో చిత్రీకరించారు.

నిన్నటి వరకు సెర్బియాలో ఒక షెడ్యూల్‌ను చిత్రీకరించారు.  అక్కడ కీలకమైన సీన్స్‌లో పాల్గొన్నారు తాప్సీ. ఈ సినిమాను జూన్‌ 29న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. అంతేకాదండోయ్‌.. మరో ఇంట్రెస్టింగ్‌ విషయం ఏంటంటే... తాప్సీ త్వరలోనే ముంబైలో ఓ ఇల్లు కొనాలనుకుంటు న్నారని, సమ్మర్‌లో గృహప్రవేశం చేయాల నుకుంటున్నారని బాలీవుడ్‌ టాక్‌. మరి.. తాప్సీ కొత్త ఇంటి అడ్రెస్‌ ఎక్కడ? అంటే.. ఆశ..దోశ.. అప్పడం.. వడ.. చెప్పేస్తారేంటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement