తాప్సీ గోల్ ఇప్పుడు ఒకటే. హాకీ స్టిక్‌తో బాల్‌ని గోల్‌పోస్ట్‌లోకి కొట్టడమే. అందుకే హాకీ ఆట గురించి ఆమె ఫుల్‌గా తెలుసుకున్నారు. ఇక చెప్పేదేముంది? హాకీ గేమ్ కిట్‌తో గ్రౌండ్‌లో దిగిపోయారు. వెంటనే ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. తాప్సీ ఎంతో ప్రొఫెషనల్ హాకీ ప్లేయర్‌లా ప్రాక్టీస్ చేస్తున్నారట. ఆమె కాన్‌సన్‌ట్రేషన్ చూస్తుంటే షాట్ గురి తప్పదేమో అన్నట్లు ఉందట. ఇదంతా ఓ సినిమా కోసమేనండోయ్. ఇండియన్ హాకీ టీమ్ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ బయోపిక్‌ను షాద్ అలీ తెరకెక్కిస్తున్నారు.
‘జూమ్ బరాబర్ జూమ్, కిల్ దిల్, ఓకే జాను’ వంటి హిందీ చిత్రాలను తెరకెక్కించా రాయన. ఈ సినిమాలో దిల్జిత్ దేశాంగ్, తాప్సీ లీడ్ రోల్స్ చేస్తున్నారు. సందీప్ పంజాబీ కాబట్టి, కీలక సన్నివేశాలను అక్కడ తీయడానికి ప్లాన్ చేశారు. ‘‘నా లైఫ్‌లో స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ పార్ట్. ఇండియాలో నా ఫేవరెట్ ప్లేస్ పంజాబ్. అక్కడ జరగబోయే ఈ సినిమా షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదరు చూస్తున్నాను. ఆల్రెడీ కొన్ని హాకీ సెషన్స్‌ను కంప్లీట్ చేశాను. ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు తాప్సీ.
Comments
Please login to add a commentAdd a comment