Hockey player
-
అంతర్జాతీయ హాకీకి వందన గుడ్‌బై
న్యూఢిల్లీ: భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళా హాకీ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన వందన కటారియా అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఉత్తరాఖండ్‌కు చెందిన 32 ఏళ్ల వందన భారత్ తరఫున 320 మ్యాచ్‌లు ఆడి 158 గోల్స్ సాధించింది. తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో వందన పలుమార్లు భారత విజయాల్లో ముఖ్యపాత్ర పోషించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో... 2016 రియో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ భారత జట్టులో వందన సభ్యురాలిగా ఉంది. ‘బరువెక్కిన హృదయంతో నేను అంతర్జాతీయ హాకీ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటిస్తున్నా. నాలో ఇంకా ఆడే సత్తా లేదనిగానీ, నాలో ఆడాలనే కోరిక తగ్గిపోయిందనిగానీ వీడ్కోలు నిర్ణయం తీసుకోలేదు. కెరీర్‌పరంగా ఉన్నతస్థితిలో ఉన్నపుడే అంతర్జాతీయస్థాయిలో ఆటకు గుడ్‌బై పలకాలని భావించా. అయితే హాకీ ఇండియా లీగ్‌లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ క్లబ్ జట్టుకు ఆడతా. నేనీ స్థాయికి చేరుకోవడానికి వెన్నంటే నిలిచి ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు’ అని వందన వ్యాఖ్యానించింది. 2009లో భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన వందన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ‘హ్యాట్రిక్’ సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి భారతీయ హాకీ క్రీడాకారిణిగా ఘనత వహించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 2021లో ‘అర్జున అవార్డు’... 2022లో ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న వందన వరుసగా మూడు (2014లో కాంస్యం, 2018లో రజతం, 2022లో కాంస్యం) ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. -
CM YS Jagan: సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు, రజని
సాక్షి, అమరావతి: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజనీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన సింధు బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2022లో తాను గెలిచిన బంగారు పతకాన్ని చూపించారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన విజయాల పట్ల పీవీ సింధు, రజనీని సీఎం జగన్ అభినందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన రాష్ట్రానికిచెందిన సుప్రసిద్ధ అంతర్జాతీయ క్రీడాకారులు, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, హాకీ క్రీడాకారిణి రజని. కామన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన ఘనవిజయాలపట్ల అభినందనలు తెలియజేసిన సీఎం. @Pvsindhu1 #Andhrapradesh pic.twitter.com/ZH1Q4ot7Rx — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 25, 2022 -
అయ్యో భగవంతుడా.. సాయం అందేలోపు.. ఆగిన శ్వాస
సాక్షి, చెన్నై: ప్రభుత్వ పరంగా సాయం అందేలోపు..ఓ క్రీడాకారుడి శ్వాస ఆగింది. వివరాలు.. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని మండవర్ మంగళం గ్రామానికి చెందిన దురై పాండియన్, మల్లిక దంపతులకు మురుగేషన్, దినేష్ కుమారులు. గతంలో అనారోగ్యంతో దురై పాండియన్ మరణించాడు. అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమలో పనిచేసి పిల్లలను మల్లిక పోషించింది. పెద్దవాడైన మురుగేషన్ (20) తమిళనాడు రాష్ట్ర సబ్ జూనియర్ హాకీ టీం జట్టులో రాణించాడు. ఇటీవల మురుగేషన్ ఆర్మీలో చేరాలనుకున్నాడు. అయితే ఆర్మీ ఎంపిక సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతడి రెండు కిడ్నీలు దెబ్బతిని ఉన్నట్లు గుర్తించారు. దీంతో తల్లి మల్లిక కుమారుడికి అప్పు చేసి చికిత్స అందించింది. ప్రస్తుతం తిరునల్వేలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంలో రెండుసార్లు డయాలసిస్ చేసుకుంటూ వచ్చిన మురుగేషన్‌ను ఆదుకుని ఆధునిక వైద్యం అందించాలని ప్రభుత్వానికి కుటుంబీకులు, సహచర క్రీడాకారులు విజ్ఞప్తి చేశారు. అయితే సాయం అందేలోపు మురుగేషన్ మంగళవారం రాత్రి నిద్రలోనే మరణించాడు. బుధవారం తనయుడు ఇక లేరన్న సమాచారంతో మల్లిక శోక సంద్రంలో మునిగిపోయింది. కాగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: రేవంత్‌రెడ్డికి సాయంత్రం వరకు గడువిస్తున్నా: మల్లారెడ్డి -
హ్యాట్రిక్ ‘వందన కథ చెపుతుందిదే..బేటీ ఖేల్నేదో!
మూడు నెలల క్రితం హాకీ ప్లేయర్ వందనా కటారియా తండ్రి మరణించాడు. చివరి చూపులకు నోచుకోలేని దూరంలో ఒలింపిక్స్ ట్రయినింగ్లో ఉంది వందన. ‘అన్నీ వదిలేసి నాన్న కోసం ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తా’ అని ఏడ్చింది వందన. కాని దేశం కోసం ఆగిపోయింది. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ‘తక్కువ కులం’ అమ్మాయి ఇంత ఎదగడం ఇష్టం లేని ‘అగ్రవర్ణ కుర్రాళ్లు’ ఆమె ఇంటి ముందు హంగామా సృష్టించారు. కాని విజేత ఎప్పుడూ విజేతే. దేశమే ఆమె కులం. అందుకే నేడు ఆమెను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘బేటీ బచావో’ కాంపెయిన్‌కి అంబాసిడర్‌ని చేసింది. కొందరు పూలదండలు పొందుతారు. మరి కొందరు రాళ్లనూ పూలు చేసుకుంటారు. ఉత్తరాఖండ్ సి.ఎం. పుష్కర్ సింగ్ ధమి ఆదివారం (ఆగస్టు 8) వందనా కటారియాను తమ రాష్ట్ర ‘బేటీ బచావో’ కాంపెయిన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటన చేశారు. వందనా కటారియా హరిద్వార్ జిల్లాలోని రోష్నాబాద్‌లో పుట్టి పెరిగింది. భారతీయ మహిళా హాకీలో కీలకమైన ఫార్వర్డ్ ప్లేయర్. టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ చేసి, అలాంటి రికార్డు సాధించిన తొలి మహిళా ప్లేయర్‌గా ఆమె చేసిన అద్భుత ప్రయాణం ఈ ఊరి నుంచే మొదలైంది. నిజానికి వందనను ‘బేటీ బచావో’ కాంపెయిన్తోపాటు ‘బేటీ ఖేల్నేదో’ (అమ్మాయిలను ఆడనివ్వండి) క్యాంపెయిన్‌కి కూడా అంబాసిడర్ ని చేయాలి. ఎందుకంటే కుటుంబం, ఊరు కూడా ఆమె ఆటకు అభ్యంతరాలు చెప్పాయి. చెట్ల కొమ్మలతో బి.హెచ్.ఇ.ఎల్లో టెక్నిషియన్‌గా పని చేసే నహర్ సింగ్ తొమ్మిది మంది సంతానంలో ఒకమ్మాయి వందన. ఆమె అక్క, చెల్లి.. ముగ్గురూ కలిసి చెట్ల కొమ్మలతో హాకీ ఆడేవారు. అక్క, చెల్లి జిల్లాస్థాయిలోనే ఉండిపోతే వందనా ఒలింపిక్స్ దాకా ఎదిగింది. కాని వీళ్లు ముగ్గురూ క్రీడల్లోకి వెళతామంటే వాళ్ల నానమ్మ ఒప్పుకోలేదు. అన్నయ్యలు కూడా ఒప్పుకోలేదు. మిగిలిన చెల్లెళ్లు ఆటలో ఆగిపోయినా వందనా మీరట్ కు వెళ్లి అక్కడి స్పోర్ట్స్ స్కూల్‌కు జాయిన్ అవుదామని నిశ్చయించుకున్నప్పుడు అన్నయ్యలు ఎక్కడ చదివిస్తాం అని పెదవి విరిచారు. పైగా ఊరి వాళ్లు ఎందుకు ఆడపిల్లలకు ఆటలు అని ఎప్పుడూ వందన తండ్రికి సుద్దులు చెప్పేవారే. కాని తండ్రి ఆమె ప్రతిభను గౌరవించాడు. సపోర్ట్ చేశాడు. నువ్వు ఒకరోజు దేశానికి పేరు తేవాలి... మన ఊరికి పేరు తేవాలి అనేవాడు. దురదృష్టవశాత్తు మూడు నెలల క్రితమే ఆయన చనిపోయాడు. అప్పుడు వందన ట్రయినింగ్ క్యాంప్‌లో ఉంది. రావడం సులువు కాదు. రాకుండా ఉండలేదు. ‘నాన్న కోసం వచ్చేస్తాను అన్నయ్యా... ఆయన్ను చివరి చూపు చూడాలని ఉంది’ అని ఏడ్చింది వందన. ‘వద్దమ్మా... ఇక్కడి పనులు మేము చూసుకుంటాం. నాన్నకు నువ్వు మెడల్ తీసుకురావడమే అసలైన నివాళి’ అని అన్నయ్య చెప్పాడు. ఆమె ఆగిపోయింది. ఒలింపిక్స్‌లో ఆడింది. ఒకే మ్యాచ్‌లో మూడు గోల్స్ కొట్టింది. అది ఆమె ఘనత. ఎదగకూడదా? పాలేరు కొడుకు పాలేరు కావాలి... పని మనిషి కూతురు పని మనిషి కావాలి అనే భావజాలం మన దేశంలో కొందరిలో ఉంది. ఒక కులం వాళ్లు ఇంతలోనే ఉండాలి ఒక కులం వాళ్లు రాజ్యాలు ఏలాలి అనుకునే సంకుచిత మనస్తత్వం ఉందనేది వాస్తవం. వందన సొంత ఊరు రోష్నాబాద్‌లో ఉంది. చిన్న గల్లీలో ఉంటుంది వందన ఇల్లు. వందన ఎదగడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడటం, పేరు రావడం ఆ ఊరిలోని అగ్రవర్ణాలకు చెందిన కొందరు కుర్రాళ్లకు నచ్చలేదు. వందన సోదరుడు ‘మమ్మల్ని చాలా రోజులుగా ఇబ్బంది పెడుతున్నారు. మా ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ల బాధ పడలేక సిసి కెమెరాలు బిగించాం’ అన్నాడు. అవమానించాలని చూసిన రోజు భారత మహిళా హాకీ జట్టు ఒలింపిక్స్ సెమి ఫైనల్స్‌కు వెళ్లి దేశమంతా గొప్ప ప్రశంసలు పొందింది. అర్జెంటీనాతో మేచ్ గెలిస్తే ఫైనల్స్‌లోకి వెళ్లేది. నిజానికి వందనా హాకీ స్టార్ అయ్యాక ఊళ్లో ఎంతో మార్పు వచ్చింది. చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. అగ్రవర్ణాల వారు కూడా వందనను ఎంతో మెచ్చుకున్నారు. ఊళ్లో వందన కుటుంబానికి ఎంతో గౌరవం కూడా పెరిగింది. కాని అదే సమయంలో కొందరు కుర్రాళ్లు మాత్రం భరించలేకపోయారు. అర్జెంటీనాతో మ్యాచ్ ఓడిన రోజు మ్యాచ్ అయిన వెంటనే వారు వందన ఇంటి ముందుకు వచ్చి టపాకాయలు కాల్చారు. ‘ఇలాంటి వాళ్లు (తక్కువ వర్ణాల వాళ్లు) టీమ్‌లో ఉండటం వల్లే ఇండియా ఓడిపోయింది’ అనే అర్థంలో కామెంట్లు చేశారు. చాలా అవమానించే ప్రయత్నం చేశారు. వందన కుటుంబం ఆ దాడికి దిగ్భ్రాంతి చెందింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశమంతా దీనిపై నిరసనలు జరిగాయి. ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రభుత్వమే అడ్డుగా నిలబడి.. దేశం కోసం ఆడిన వందన ఇలాంటి దాడి ఎదుర్కొనడం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా సహించలేకపోయింది. వెంటనే ఆ రాష్ట్ర క్రీడల మంత్రి రంగంలో దిగి వందన కుటుంబానికి ధైర్యం చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆమెను తమ మహిళా, శిశు సంక్షేమ శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. తమ రాష్ట్రానికి చెందిన గొప్ప క్రీడాకారిణిగా ఆమెను గౌరవిస్తున్నామని తెలిపారు. మన దేశంలో అమ్మాయిలు క్రీడల్లో రాణించాలంటే అదీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి నుంచి రాణించాలనంటే ముందు ‘అమ్మాయి’ అనే అడ్డంకిని దాటాలి, తర్వాత ‘వనరులు’ అనే అడ్డంకిని దాటాలి, తర్వాత వెనుకబడిన వర్గాల నుంచి అయినట్టయితే ‘సామాజిక వివక్ష’నూ దాటాలి. ఇన్ని అడ్డంకులను దాటి, దాటుతూ కూడా వందన సమున్నతంగా నిలబడింది. వందన ఉదంతం ఇలాంటి నేపథ్యం ఉన్నవాళ్లకు క్రీడల్లో ఎన్ని అడ్డంకులు ఉంటాయో తెలియజేస్తోంది. ఇలాంటి నేపథ్యం ఉన్నా ఈ దేశంలో విజయం సాధించేందుకు సకల అవకాశాలు ఉన్నాయని కూడా తెలియచేస్తోంది. మనం చూడాల్సింది ఈ రెండో కోణాన్నే. వందనా కటారియా -
కొత్త డైరెక్టర్‌తో వైష్ణవ్ సినిమా: రోల్ ఏంటంటే?
హీరో వైష్ణవ్ తేజ్ హాకీ స్టిక్ పట్టుకుని బరిలో దిగనున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారట. ఇదంతా వైష్ణవ్ హీరోగా నటించనున్న తర్వాతి చిత్రం కోసమే అనే సంగతి అర్థమై ఉంటుంది. తొలి సినిమా ‘ఉప్పెన’తో ఘన విజయం అందుకున్న వైష్ణవ్ తేజ్ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా, అన్నపూర్ణ స్టూడియోస్‌పై హీరో నాగార్జున నిర్మాతగా మరో సినిమా చేయనున్నారాయన. నాగార్జున నిర్మించే చిత్రం క్రీడల నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. పృథ్వీ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమా హాకీ నేపథ్యంలో రూపొందనుందట. ఇందులో వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ పాత్ర చేయనున్నారని టాక్. అసలు సిసలైన హాకీ ప్లేయర్‌గా ఒదిగిపోవడానికి వైష్ణవ్ కసరత్తులు మొదలుపెట్టారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్ వార్త. -
మన్దీప్ సింగ్ ఆసుపత్రికి తరలింపు
న్యూఢిల్లీ: ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన భారత హాకీ ప్లేయర్ మన్దీప్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. సోమవారం రాత్రి మన్దీప్ రక్తంలో ఆక్సిజన్ స్థాయి సా«ధారణం కంటే తక్కువకు పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 20 నుంచి బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో జాతీయ హాకీ శిక్షణ శిబిరం జరగాల్సి ఉండటంతో... ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించారు. అందులో మన్‌దీప్‌తో పాటు సారథి మన్‌ప్రీత్ సింగ్, డిఫెండర్ సురేంద్ర కుమార్, జస్కరన్ సింగ్, వరుణ్ కుమార్, గోల్ కీపర్ కృషన్ బహదూర్ పాఠక్‌లకు కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో వారికి అక్కడే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. రోజువారీ చెకప్‌లో భాగంగా... సోమవారం రాత్రి వైద్యులు వీరిని పరీక్షించగా మన్దీప్ రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయినట్లు తేలింది. దాంతో వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. -
‘అడ్డుగోడ’కు అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని యెనుమలవారిపల్లి గ్రామం... యెర్రవారిపాలెం మండల పరిధిలోని ఈ గ్రామంలో ఉండేది 30 కుటుంబాలే. అలాంటి చోటు నుంచి వచ్చిన ఒక అమ్మాయి జాతీయ క్రీడలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ప్రాంతీయ అసమానతలు, ముఖ్యంగా ఉత్తరాది ఆధిపత్యం చాలా ఎక్కువగా కనిపించే హాకీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ఆట ఒక్కటే సరిపోదు. అంకితభావం, పట్టుదల, పోరాటపటిమ, దృఢసంకల్పం కావాలి. ఇవన్నీ కలబోసిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇటిమరపు రజని దశాబ్దకాలంగా గోల్‌కీపర్‌గా భారత జట్టులో కొనసాగుతోంది. ఇప్పటికే ఒకసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న రజని ... మరో ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతోంది. వేగంగా దూసుకుపోయి... సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన రజని పాఠశాలస్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో హాకీ స్టిక్ చేతబట్టింది. ఆ తర్వాత విశేషంగా రాణిస్తూ పోయింది. గోల్‌కీపర్‌గా తొలి అవకాశం లభించగా... అదే పొజిషన్లో తన ఆటను మెరుగుపర్చుకుంటూ సత్తా చాటింది. ఫలితంగా అండర్–14 రాష్ట్ర స్థాయిలో మొదలైన ప్రయాణం భారత సీనియర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించే వరకు సాగింది. జోనల్ ప్రదర్శన తర్వాత తొలిసారి 2009లో రజని భారత జట్టులోకి ఎంపికై ంది. అదే ఏడాది న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి భారత టీమ్ జెర్సీలో గోల్‌పోస్ట్ ముందు రక్షణగా, సగర్వంగా నిలబడింది. ఇది ఆమె కెరీర్లో మధుర క్షణంగా నిలిచింది. మరో ఒలింపిక్స్ కోసం... ఇటీవలే 30 ఏళ్లు పూర్తి చేసుకున్న రజని తన అంతర్జాతీయ కెరీర్లో భారత్ తరఫున 91 మ్యాచ్‌లు ఆడింది. పలు చిరస్మరణీయ విజయాల్లో ఆమె భాగంగా నిలిచింది. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018 ఆసియా క్రీడల్లో రజతం సాధించిన జట్లలో ఆమె సభ్యురాలు. భారత జట్టు తొలిసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు, ఏడాది ముందుగా 2015లో రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినప్పుడు కూడా గోల్‌కీపర్‌గా రజని కీలకపాత్ర పోషించింది. రియోలో జరిగిన 2016 ఒలింపిక్స్‌లో రజని భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించి ఆడిన మన భారత మహిళల జట్టులో తానూ ఉండటం ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకమని ఆమె చెబుతుంది. ఇప్పుడు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత జట్టులోనూ ఆమె కూడా ఉంది. దాని సన్నాహాలు కొనసాగుతుండగానే కరోనా కారణంగా అంతా మారిపోయింది. వచ్చే ఏడాదికి వాయిదా పడిన ఒలింపిక్స్‌లో భారత్ మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని, తాను కూడా చక్కటి ప్రదర్శన కనబర్చాలని రజని కోరుకుంటోంది. శిక్షణకు బ్రేక్... ‘ఫిబ్రవరి 16న బెంగళూరు ‘సాయ్’ సెంటర్లో భారత జట్టుకు ఒలింపిక్స్ శిబిరం ప్రారంభమైంది. నెల రోజులకు పైగా అంతా బాగానే సాగింది. కోచ్ జోయెర్డ్ మరీన్ కొత్త పద్ధతుల్లో చక్కటి శిక్షణ అందిస్తూ వచ్చారు. ఆ తర్వాత కరోనా కారణంగా క్రీడా కార్యకలాపాలను నిలిపివేశారు. దాంతో సుమారు రెండు నెలల కేవలం ఫిట్నెస్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్‌కే ప్లేయర్లు పరిమితమయ్యారు. సడలింపుల తర్వాత ఆటగాళ్ళంతా ఇంటిపై బెంగ పెట్టుకోవడంతో హాకీ ఇండియా శిక్షణకు విరామం ఇచ్చింది. నెల రోజుల పాటు కుటుంబసభ్యులతో గడిపేందుకు అవకాశం ఇచ్చారు. క్రీడాకారిణులు కొత్త ఉత్సాహంతో తిరిగి రావాలని ఫెడరేషన్ కోరుకుంటోంది. అంతా తిరిగొచ్చాక మళ్లీ శిక్షణ మొదలవుతుంది. షెడ్యూల్ ప్రకారం మరో నాలుగు నెలల పాటు ఎలాంటి అంతర్జాతీయ టోర్నీలు లేవు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఉన్నా... ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేది సందేహమే. అదొక్కటి చాలు... పదకొండేళ్లుగా భారత్‌కు ఆడుతున్నా నాకు ఇప్పటి వరకు ప్రభుత్వంలోగానీ, ప్రభుత్వరంగ సంస్థలో గానీ ఉద్యోగం లభించలేదు. ఏ క్రీడాంశంలోనైనా ఇన్ని సంవత్సరాలు జాతీయ జట్టుకు ఆడిన వారికి ఏదో ఒక ఉద్యోగం లభించడం సహజం. కానీ దురదృష్టవశాత్తూ నాకు అలాంటి అవకాశం దక్కలేదు. నా జట్టులోని సహచరులు అందరికీ వారి వారి రాష్ట్రాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్‌గా తగిన గుర్తింపు, హోదా ఉన్నాయి. నేను మాత్రం ఇంకా ఇబ్బంది పడుతున్నాను. ఎన్నో అడ్డంకులను అధిగమించి భారత హాకీకి ప్రాతినిధ్యం వహించా. ఇప్పటికైనా నేను స్థిరపడేందుకు తగిన ప్రోత్సాహం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నా. –ఇటిమరపు రజని, భారత హాకీ గోల్‌కీపర్ -
బుల్లెట్ దిగినా... స్టిక్ వదల్లేదు
హాకీలో అనూహ్యంగా దూసుకొచ్చిన సందీప్ సింగ్ ఆటపై ధ్యాసతోనే పయనిస్తున్నాడు. హాకీలో మెరుపులు మెరిపిస్తున్న పిన్న వయస్కుడిగా ఘనత కూడా వహించాడు. అతనికి హాకీ స్టిక్ ప్రాణమైంది. ఆటే లోకమైంది. కానీ అంతలోనే ప్రాణం మీదికి తెచ్చింది. తుపాకీ మిస్‌ఫైర్‌తో బుల్లెట్ సందీప్ వెన్నులోకి దిగింది. ఆట కాదు కదా నడకే కష్టమన్నారు. మంచమే దిక్కన్నారు. అదేంటో మంచం దిగాడు. మైదానంలోకీ అడుగు పెట్టాడు. నడక కాదు మైదానంలో గోల్స్ కోసం పరుగు పెట్టాడు. అంతం కావాల్సిన కెరీర్‌ను సందీప్ సంచలనంగా మలచుకున్నాడు. భారత హాకీలో డ్రాగ్ ఫ్లికర్ మెరికగా, పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్‌గా ఎదిగిన సందీప్ నిజానికి తనంతట తానుగా హాకీకి ఆకర్షితుడు కాలేదు. సోదరుడు బిక్రమ్‌జీత్ సింగ్ వద్ద ఉండే హాకీ కిట్, బూట్లు చూసి అసూయతోనే ఇటువైపు మళ్లాడు. దాంతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా సందీప్ సింగ్ హాకీ స్టిక్ పట్టేలా చేసింది. ఈ విషయాన్ని అతని తల్లి దల్జీత్ కౌర్ ఓ సందర్భంలో చెప్పింది! అమ్మా... నాకు కిట్లు, బూట్లు కావాలని సందీప్ అడిగితే... ఆడితేనే నీకూ కొనిస్తామని ఆమె బదులిచ్చింది. అలా మొదట కిట్ చేతికి అందుకున్నాడు. మెల్లిగా మైదానం బాట పట్టాడు. వెంటనే యూత్ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఆ వెంటే జూనియర్... తర్వాత భారత సీనియర్ జట్టుకు అమాంతం ఎదిగిపోయాడు. అచిరకాలంలోనే తన చురుకుదనం, అంకితభావంతో ఆటలో ఒదిగిపోయాడు. ఇదంతా కూడా రెండు, మూడేళ్లలోనే జరిగిపోవడం విశేషం. 2003లో టీమ్ జెర్సీ... హాకీలో ఓనమాలు నేర్చుకున్నంత సులభంగా గోల్స్ చేయడం కూడా నేర్చుకోవడంతో టీనేజ్లోనే సందీప్ సెలక్టర్ల కంటబడ్డాడు. అలా 2003లో 17 ఏళ్ల సందీప్ సింగ్ భారత జూనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. కరాచీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో అతని దూకుడు హాకీ వర్గాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఏకంగా డజను (12) గోల్స్ చేసిన ఈ పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ భారత్‌కు తొలి జూనియర్ ప్రపంచకప్ విజయాన్ని రుచి చూపించాడు. వెంటనే సీనియర్ సెలక్షన్ కమిటీ ఆలస్యం చేయకుండా ఈ హరియాణా కుర్రాడిని జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. అలా 18 ఏళ్ల వయసులో 2004లో సుల్తాన్ అజ్లాన్ షా కప్, అదే ఏడాది ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ఆడటం ద్వారా సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పిన్న వయస్కుడిగా ఘనతకెక్కాడు. బుల్లెట్ మంచాన పడేసినా... నిండా 20 ఏళ్లకు ముందే భారత హాకీ జట్టులో కీలక ఆటగాడయ్యాడు సందీప్. ఇక ఈ ఆరడుగుల బుల్లెట్ కెరీర్ నల్లేరుమీద నడకలా సాగిపోతుందనుకుంటే అనుకోని ఉపద్రవం మిస్‌ఫైర్ రూపంలో ప్రాణంమీదికి తెచ్చింది. 2006 ప్రపంచకప్ (జర్మనీ)కు సన్నద్ధమవుతున్న తరుణంలో ఓ ‘బుల్లెట్’ అతని వెన్నులోకి దూసుకెళ్లింది. జట్టుతో కలిసేందుకు సహచరుడు రాజ్‌పాల్‌తో కలిసి రైలులో వెళుతుండగా... రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీస్ అధికారి పొరపాటు వల్ల అతని రైఫిల్ మిస్‌ఫైర్ అయ్యింది. అదికాస్తా సందీప్ దిగువ వెన్నెముకను చిదిమేసింది. దీంతో అతని తొలి ప్రపంచకప్ కలతో పాటు కెరీర్, జీవితం అన్ని మూలనపడ్డాయి. ఊపిరే కష్టమంటే... చివరకు కొన్ని రోజులు కోమాలో, ఇంకొన్ని రోజులు పక్షవాతానికి గురైన అతన్ని డాక్టర్లు నడవలేడని తేల్చేశారు. పట్టుదలతో... ప్రాణాపాయమైతే తప్పింది కానీ...ఊపిరి ఉన్నంతవరకు మంచమే దిక్కని డాక్టర్లు చెప్పారు. దీంతో జర్మనీలో మైదానంలో ప్రత్యర్థులతో తలపడాల్సిన సందీప్... ఇంట్లో మంచంపై ఒంటరితనంతో పోరాడాల్సి వచ్చింది. ప్రతికూల ఆలోచనలతో తల్లడిల్లిపోయేవాడు. కానీ అతనిలోని నేర్పరితనం... ఆటలో అలవడిన సుగుణం... వేగంగా ఎదిగేలా చేసిన వైనం... ఇవన్నీ అతని గాయన్ని మాన్పించాయి. మళ్లీ ఆడాలన్న పట్టుదల తిరిగి హాకీ స్టిక్‌ను పట్టించింది. రెండంటే రెండేళ్లలోనే మైదానంలోకి దిగేలా చేసింది. ఒలింపిక్స్‌కు నడిపించాడు... ఇక సందీప్ నడవలేడన్న డాక్టర్లే ఆశ్చర్యపోయేలా అతను భారత జట్టునే ఒలింపిక్స్‌కు నడిపించాడు. ఇలా అతని ఆట, ఒలింపిక్స్ బాట సంచలనంగా మారిపోయింది. 2008లో అజ్లాన్ షా కప్‌లో ఆడాడు. ఆడటమే కాదు తొమ్మిది గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో 12 ఏళ్ల తర్వాత భారత్‌ను విజేతగా నిలిపిన ఘనత కచ్చితంగా సందీప్‌దే. భారత కెప్టెన్‌గా పలు టోర్నీల్లో విజయవంతమైన ఈ డ్రాగ్‌ఫ్లికర్... భారత్‌ను 2012 లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేలా కీలకమైన గోల్స్ చేశాడు. ఈ మెగా టోర్నీ కోసం ఫ్రాన్స్‌తో జరిగిన ఆఖరి క్వాలిఫయర్ పోరులో భారత్ 9–1తో ఏకపక్ష విజయం సాధించింది. ఇందులో సందీప్ సింగ్ ఏకంగా ఐదు గోల్స్ చేయడం గమనార్హం. కెరీర్ మొత్తంలో వందకంటే ఎక్కువ గోల్స్ చేసిన సందీప్ 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత హాకీ ఇండియా లీగ్‌లో ముంబై మెజీషియన్స్, పంజాబ్ వారియర్స్, రాంచీ రేస్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సందీప్ సింగ్ కెరీర్‌పై 2018లో బాలీవుడ్లో ‘సూర్మా’ పేరుతో సినిమా కూడా నిర్మించారు. హరియాణా పోలీసు విభాగంలో ఐదేళ్లపాటు డీఎస్పీగా పనిచేసిన 34 ఏళ్ల సందీప్ గతేడాది రాజకీయాల్లోకి వచ్చాడు. బీజేపీ తరఫున హరియాణాలోని పెహోవా నియోజకవర్గం నుంచి పోటీచేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. అనంతరం రాష్ట్ర మంత్రి వర్గంలో క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. -
దివికేగిన దిగ్గజం
చండీగఢ్: ప్రపంచ హాకీ పుటలకెక్కిన భారత హాకీ మాంత్రికుడు, దివంగత దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌తో సరితూగే గోల్స్ వేటగాడు బల్బీర్ సింగ్ సీనియర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 96 ఏళ్లు. వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో సోమవారం ఉదయం బల్బీర్ సింగ్ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 8న తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన్ని మొహాలీలోని ఫోర్టిస్ హాస్పిటల్లో చేర్పించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తుండగా... సోమవారం ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారని హాస్పిటల్ డైరెక్టర్ అభిజిత్ సింగ్ వెల్లడించారు. చికిత్స పొందుతుండగానే ఈ నెల 18న న్యుమోనియా, జ్వరం, శ్వాసనాళ సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో పాటు మెదడులోని రక్తనాళాలు గడ్డకట్టడంతో సెమీ కోమా స్థితికి వచ్చారు. వృద్ధాప్యభారం వల్ల చికిత్సకు ఆయన శరీరం సహకరించకపోవడంతో తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. బల్బీర్కు ఒక కుమార్తె సుశ్బీర్, ముగ్గురు కుమారులు కన్వల్బీర్, కరణ్‌బీర్, గుర్బీర్ సింగ్‌లున్నారు. కొడుకులంతా కెనడాలో స్థిరపడగా... కుమార్తె, మనవడు కబీర్‌తో కలిసి ఆయన మొహాలీలో ఉన్నారు. అంపశయ్యపై పోరాడుతూనే... అలనాడు మైదానంలో దేశాన్ని గెలిపించేందుకు ప్రత్యర్థులతో వీరోచితంగా పోరాడిన బల్బీర్ సింగ్ గత 18 రోజులుగా ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడారు. చికిత్సలో ఉండగానే మూడుసార్లు గుండెపోటుకు గురైనా తట్టుకున్న ఆయన చివరకు మెదడు రక్తనాళాలు గడ్డకట్టడంతో అచేతన స్థితిలోకి వెళ్లిపోయారు. ఇక సోమవారం తెల్లవారగానే పోరాటం ముగించారు. గత రెండేళ్లుగా తరచూ ఆయన తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. పలుమార్లు ఐసీయూలో చికిత్స పొందాక ఇంటికెళ్లేవారు. కానీ ఈసారి మాత్రం దివికేగారు. కోవిడ్–19 నేపథ్యంలో ప్రస్తుత నిబంధనల ప్రకారం బల్బీర్కు వైరస్ పరీక్ష చేయగా... నెగెటివ్ రిపోర్టు వచ్చింది. విజయవంతమైన బల్బీర్ కెరీర్లో గోల్స్, రికార్డులే కాదు అవార్డులూ ఉన్నాయి. అధికారిక లాంఛనాలతో... భారత హకీలో మరో ‘బంగారు’కొండ అయిన బల్బీర్ సింగ్ సీనియర్‌కు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. పోలీసు ఉన్నతాధికారుల తుపాకులతో గౌరవ వందనం సమర్పించగా... బల్బీర్ మనవడు కబీర్ దహన సంస్కారాలు నిర్వహించాడు. ఇదంతా ఎలక్ట్రిక్ దహన కార్యక్రమంతో ముగించారు. కుమారులు ముగ్గురు కెనడాలోనే ఉండటంతో ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇక్కడికి చేరుకునే అవకాశం లేకపోవడంతో అంత్యక్రియలకు వెంటనే ఏర్పాట్లు చేశారు. ఆ రాష్ట్ర క్రీడల మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి మొహాలీ హాకీ స్టేడియానికి బల్బీర్ సింగ్ పేరు పెడతామని ప్రకటించారు. చిరకాలం గుర్తుంటారు... దిగ్గజ హాకీ ప్లేయర్ బల్బీర్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్స్ సర్దార్ సింగ్, వీరేన్ రస్కినా, శ్రీజేష్ తదితరులు కూడా బల్బీర్కు నివాళులు అర్పించారు. ఎవరేమన్నారంటే... అద్భుతమైన ఆటతీరుతో బల్బీర్ సింగ్ చిరకాలం గుర్తుంటారు. తన ఆటతో ఆయన దేశానికి ఎన్నో విజయాలు అందించారు. ప్లేయర్‌గానే కాకుండా కోచ్‌గా కూడా ఆయన అద్భుతాలు చేశారు. –ప్రధాని నరేంద్ర మోదీ బల్బీర్ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాలు సాధించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. –కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడల మంత్రి బల్బీర్ సింగ్ ఇక లేరు అన్న వార్త విని చాలా బాధపడ్డాను. ఆయనలాంటి క్రీడాకారులు అరుదుగా ఉంటారు. నేటితరం క్రీడాకారులందరికీ ఆయన ఆదర్శం. –అభినవ్ బింద్రా, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం బల్బీర్ సింగ్ సొంతం. హాకీపట్ల ఆయనకున్న అభిమానం వెలకట్టలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మాతో ఉంటాయి. –నరీందర్ బత్రా, అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు బల్బీర్ సింగ్ తన ఆటతో హాకీ క్రీడకే ఎంతో వన్నె తెచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. –సచిన్ టెండూల్కర్, క్రికెట్ దిగ్గజం బల్బీర్ సింగ్ నాతోపాటు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. –సర్దార్ సింగ్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ -
ఒకే నగరంలో ఉన్నా...
బెంగళూరు: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ అనుకోని విరామ సమయంలో సాధారణ ప్రజలే ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంటే.. నిరంతరం ప్రయాణాలు, రోజంతా ప్రాక్టీస్, మ్యాచ్‌లు అంటూ బిజీగా గడిపే క్రీడాకారుల సంగతి చెప్పక్కర్లేదు. కుటుంబంతో సరదాగా గడిపే సమయం దొరికితే ఆటగాళ్లు ప్రపంచాన్ని, వారి ప్రాణమైన ఆటనే మర్చిపోతారు. కానీ భారత హాకీ ప్లేయర్ ఎస్వీ సునీల్ ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. తన భార్య, గారాల కూతురు తనకు సమీపంలోనే నివసిస్తున్నా కుటుంబానికి దూరంగా జట్టుతో ఉంటున్నాడు. ప్రస్తుతం సునీల్ బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో ప్రాక్టీస్ చేస్తుండగా... అతని భార్య నిషా, ఏడాదిన్నర వయస్సున్న కూతురు శాన్విత ‘సాయ్’ సెంటర్‌కు కేవలం 20 కి.మీ దూరంలోనే ఉంటున్నారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో కుటుంబం క్షేమం కోసమే తాను దూరంగా ఉంటున్నానని సునీల్ పేర్కొన్నాడు. తన భార్య నిషా కూడా అతని నిర్ణయంతో ఏకీభవించిందని చెప్పాడు. ‘నేను నా భార్య, బిడ్డను చాలా మిస్ అవుతున్నా. కానీ మనం ఈ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి. ఇందులోని సానుకూల కోణాన్నే మనం చూడాలి’ అని సునీల్ పేర్కొన్నాడు. -
టీచర్ చేతి స్టిక్ ప్లేయర్‌ని చేసింది
తల్లికి ఊహ తెలియక ముందే ఆమె మాతమ్మ (దేవదాసీ) అయింది. తనకు ఊహ తెలిసే వయసుకు నాన్నెవరో తెలియదు. ఫలానా వ్యక్తి మీ నాన్న అని కుమార్తెకు చెప్పే పరిస్థితి ఆ అమ్మకు లేదు. ఈ సమాజంలో తనేమిటో, తన కుటుంబం ఏమిటో కూడా ఎరుగదు. అమ్మలోనే అమ్మానాన్నను చూసుకుంది. ఆరో తరగతిలో ఉండగా టీచర్ చేతిలో ఓ ‘కర్ర’ను చూసి అదేమిటని అడిగింది. ‘‘హాకీ స్టిక్ అమ్మా!’’ అని టీచర్ చెప్పింది. ‘‘నేనూ ఆ స్టిక్‌తో ఆడతాను’’ ముందుకొచ్చింది. ఆ టీచర్ సరేనంది. అలా పదేళ్ల వ్యవధిలోనే ఆ మాతమ్మ కూతురు జిల్లా, రాష్ట్ర స్థాయిల నుంచి జాతీయ స్థాయి హాకీ ప్లేయర్ అయింది! చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన దేవదాసీ కొండా రేణుక కుమార్తె పద్దెనిమిదేళ్ల సుశీల అసామాన్య విజయగాథ ఇది. అన్ని అవకాశాలూ ఉన్నా క్రీడల్లో రాణించలేని వారెందరో ఉన్నారు. ఏ ఆసరా లేని సుశీల.. తన తల్లి కళ్లలో ఆనందాన్ని నింపాలన్న ఏకైక లక్ష్యంతో హాకీలో జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించి అమ్మ చెప్పినట్టు ఊరుకి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొస్తానని ధీమాగా చెబుతోంది. తోటి జోగినీ, దేవదాసీ, మాతమ్మల కుటుంబాల్లో స్ఫూర్తి నింపుతోంది. చంద్రయానం చేస్తున్న ఈ రోజుల్లోనూ దేవదాసీ దురాచారం ఇకపై కొనసాగడానికి వీల్లేదని సుశీల అంటోంది. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనపై ఇటీవల విజయవాడలో నిర్వహించిన సదస్సుకు మాతమ్మ రేణుక వెంట వచ్చిన కుమార్తె సుశీలతో ‘సాక్షి’ ముచ్చటించింది. అమ్మ జీతం ఆరువేలు ‘‘నాకు అన్న, తమ్ముడు, చెల్లి ఉన్నారు. నాన్న ఎవరో? ఎలా ఉంటారో తెలియదు. నాన్నెవరమ్మా? అని అడిగితే అమ్మ మౌనం దాల్చేది. కొన్నాళ్లకు తెలిసింది.. అమ్మ ‘మాతంగి’ అని.. మాకు నాన్న ఉండరని. అమ్మ రుయా ఆస్పత్రిలో కాంట్రాక్టు స్వీపర్. అమ్మకు వచ్చే నెల జీతం ఆరు వేలూ కుటుంబ పోషణకు చాలక పాచి పనులు కూడా చేసి ఇల్లు నడుపుతోంది. మేమూ నీకు సాయపడతామంటే.. ‘వద్దు.. మీరు బాగా చదువుకుని ప్రయోజకులవ్వండి. నాకంతే చాలు’ అంటుంది. మమ్మల్ని చదివించడానికే తను కష్టపడుతోంది. చిన్నప్పట్నుంచి నాకు ఆటలంటే చాలా ఇష్టం. రన్నింగ్, జూడో, త్రోబాల్, వాలీబాల్, రెజ్లింగ్, షటిల్, బాల్‌బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ వంటి క్రీడల్లో నాకు మంచి పేరొచ్చింది. నేను ఆరో తరగతిలో ఉండగా మా పీఈటీ ప్రసన్న మేడం చేతిలో ఉన్న కర్రను చూసి అదేమిటి టీచర్? అని అడిగా. దీన్ని హాకీ స్టిక్ అంటారని చెప్పారామె. ఈ ఆట ఆడాలని ఉంది టీచర్.. అని చెప్పడంతో ఆమె నన్ను ప్రోత్సహించారు. మిగిలిన ఆటలకంటే హాకీపై ఆసక్తి పెంచుకున్నాను. ఎనిమిదో తరగతిలో మదనపల్లెలో జరిగిన జిల్లా స్థాయి హాకీ టోర్నమెంట్లో ప్రతిభ చూపడంతో (అండర్–17) నేషనల్స్‌కు ఎంపికయ్యాను. ఇలా ఇప్పటిదాకా 23 జిల్లా స్థాయి, 5 రాష్ట్రస్థాయి, అండర్ – 17, అండర్ 19 కేటగిరీల్లో జూనియర్, సీనియర్స్ విభాగాల్లో గుజరాత్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 5 జాతీయ స్థాయి టోర్నమెంట్లు ఆడాను. దాతల సాయంతోనే..! అమ్మ సంపాదన కుటుంబ పోషణకే సరిపోదు. మరి నాకు హాకీ టోర్నమెంట్లకయ్యే ఖర్చు ఎక్కడ నుంచి వస్తుంది? ఒకసారి నేషనల్స్‌కు వెళ్లాలంటే కనీసం రూ.5–6 వేలయినా ఖర్చవుతుంది. మా కుటుంబ పరిస్థితిని చూసి మా కోచ్ లక్ష్మీ కరుణ, ప్రసన్న టీచర్, రమణ సార్ వంటి వారితో పాటు మా గ్రామస్తులు ఆర్థికంగా చేయూత నిస్తున్నారు. దాంతోనే నేషనల్స్‌కు వెళ్తున్నాను. పట్టుదలతో విజయం సాధించుకుని వస్తున్నాను. హాకీలో నేను రాణించడం వెనక అమ్మ ప్రోత్సాహం చాలా ఉంది. ఆటలో చిన్న చిన్న దెబ్బలు తగిలినా పట్టించుకోకుండా ముందుకుకెళ్లమ్మా! అని ప్రోత్సహిస్తుంది. హాకీలో బాగా రాణించి ఊరుకి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. నాకు అమ్మా, నాన్నా అమ్మే. అన్న దినేష్ డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేరవుతున్నాడు. తమ్ముడు వెంకటేష్ కబడ్డీ (జిల్లా స్థాయి)లో ప్లేయర్. చెల్లి భూమిక కూడా హాకీ (రాష్ట్ర స్థాయి)తో పాటు ఇతర క్రీడల్లోనూ రాణిస్తోంది. ఇలా అమ్మ నాతో పాటు మిగిలిన పిల్లలనూ ఆటల్లోను, చదువులోనూ పేరు తెచ్చుకోవాలి చెబుతుంటుంది. అమ్మ సపోర్టు మాపై చాలా ప్రభావం చూపుతోంది. చంద్రయాన్‌కు చేరుకుంటున్న ఈ రోజుల్లో దేవదాసీ వ్యవస్థను ఇంకా కొనసాగించడం తగదు. మా దుస్థితి పిల్లలకు రాకూడదు నాకు ఊహ తెలియకముందే నన్ను మాతమ్మ (దేవదాసీ)ను చేసేశారు. పన్నెండేళ్ల వయసొచ్చే సరికి నన్ను మాతమ్మను చేసినట్టు తెలిసింది. నలుగురు పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తున్నా. పెద్ద కూతురు సుశీల హాకీలో రాణిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నందుకు గర్వంగా ఉంది. రెండో కూతురూ హాకీతో పాటు ఇంకొన్ని ఆటలు ఆడుతోంది. చిన్నోడు కబడ్డీ బాగా ఆడతాడు. నా బతుకు ఎలా ఉన్నా మా పిల్లలకు నాలాంటి దుస్థితి రాకూడదు. ఈ దుర్వ్యవస్థ ఇకపై కొనసాగకూడదు.– కొండా రేణుక (మాతమ్మ) ఇల్లు ఉంటే బాగుంటుంది నెలకు రూ.400 చెల్లించి మా ఊళ్లో చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నాం. గత ఏడాది అప్పటి ముఖ్యమంత్రి సంక్రాంతి సంబరాలకు నారావారిపల్లె వచ్చినప్పుడు వెళ్లి కలిశాను. సొంత ఇల్లు మంజూరు చేయమని, హాకీ మెటీరియల్ ఇప్పించమని కోరాను. మరోసారి వచ్చి కలవాలని చెప్పి పంపేశారు. ఇప్పటిదాకా ప్రభుత్వాల నుంచి నాకు ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు. ఏ సపోర్టు లేదు. కొత్త సీఎం జగనన్న మనసున్న వాడని అంటున్నారు. ఆయన ఆదుకుంటారన్న నమ్మకం ఉంది’’ అని చేతులు జోడించింది సుశీల.– బొల్లం కోటేశ్వరరావు,సాక్షి, అమరావతి బ్యూరో -
భవిష్యత్ హాకీ స్టార్ జ్యోతిరెడ్డి
హైదరాబాద్: జాతీయ క్రీడ హాకీలో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి ఈదుల జ్యోతిరెడ్డి అదరగొడుతోంది. ఆటతో పాటు చదువుల్లోనూ సత్తా చాటుతూ తన ప్రతిభను కనబరుస్తోంది. ఈదుల శివనాగిరెడ్డి, వెంకటలక్ష్మీ దంపతుల కుమార్తె జ్యోతిరెడ్డి చిన్నతనం నుంచే అన్ని రకాల ఆటల్లో ఉత్సాహంతో పాల్గొనేది. ఊహ తెలిసిన నాటి నుంచి హాకీపై మక్కువ పెంచుకున్న ఆమెను కోచ్ రాంబాబు ప్రోత్సహించారు. కోచ్‌తో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో జ్యోతి జాతీయస్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. హాకీలో ఆమె ప్రతిభను గుర్తించిన భోపాల్ ‘సాయ్’ ప్రతినిధులు ఆమెను భారత స్పోర్ట్స్ అథారిటీ సెంటర్లో చేర్చుకొని మెరుగైన శిక్షణను అందిస్తున్నారు. హాకీలో ఎదిగిన తీరు... జ్యోతి తల్లిదండ్రులు మూడు దశాబ్దాల క్రితమే కడప నుంచి ఇక్కడికి వలస వచ్చారు. గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని జీపీఆర్ఏ క్వార్టర్స్‌లో స్థిరపడ్డారు. ఇక్కడే జన్మించిన జ్యోతి పాఠశాల స్థాయి నుంచి హాకీలో రాణించింది. 2012 నుంచి 2014 వరకు రంగారెడ్డి జిల్లా హాకీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమె రాష్ట్ర స్థాయిలో ఎన్నో విజయాలను అందించింది. 2015లో రాంచీలో జరిగిన జాతీయ స్థాయి హాకీ టోర్నీలో జ్యోతి తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. 2016లో భోపాల్ ‘సాయ్’ సెంటర్‌కు ఎంపికైన ఆమె ఇప్పటికీ అక్కడే ఉంటూ మెరుగైన శిక్షణను పొందుతోంది. ఇక్కడ శిక్షణ పొందుతోన్న సమయంలోనే సబ్ జూనియర్ స్థాయిలో ‘ఉత్తమ ప్లేయర్’ అవార్డును అందుకుంది. తర్వాత పలు జాతీయ స్థాయి టోర్నీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె... 2018 భోపాల్‌లో జరిగిన ఆలిండియా రాజమాత సింధియా గోల్డ్ కప్‌లో సెమీస్‌కు చేరిన జట్టులో సభ్యురాలు కూడా. ఈ ఏడాది జనవరిలో కేరళ వేదికగా జరిగిన జూనియర్ నేషనల్ హాకీ టోర్నీలో పాల్గొన్న జ్యోతి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. చదువుల్లోనూ మేటి... ఓ వైపు హాకీలో రాణిస్తున్న జ్యోతిరెడ్డి చదువుల్లోనూ గొప్ప ప్రతిభ కనబరుస్తోంది. గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్‌లోని కేంద్రీయ విద్యాలయలో పదో తరగతి వరకు చదివిన ఆమె 9.8 జీపీఏ సాధించడం విశేషం. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ జ్యోతి సత్తా చాటింది. గచ్చిబౌలి డివిజన్ మధురానగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన జ్యోతి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 891 మార్కులు సాధించి ఔరా అనిపించింది. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రత్యేక చొరవతోనే తాను చదువుల్లో రాణిస్తున్నానని జ్యోతి పేర్కొంది. భారత హాకీ జట్టుకు ఆడటమే లక్ష్యం... ‘చిన్నప్పటి నుంచి హాకీని శ్రద్ధగా నేర్చుకున్నాను. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగాను. ప్రస్తుతం నా లక్ష్యం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం. భోపాల్‌లోని ‘సాయ్’లో చేరడంతో ఆటలో నాణ్యత పెరిగింది. కోచ్ రాంబాబు కారణంగానే ఈ స్థాయికి రాగలిగాను. కేవీ ఉపాధ్యాయులు, రాయదుర్గం జూనియర్ కాలేజి లెక్చరర్ల ప్రోత్సాహంతో చదువులోనే రాణించగలుగుతున్నా. నచ్చిన క్రీడను ఎంపిక చేసుకుంటే ఆటతో పాటు చదువుల్లోనూ రాణించగలం’. –జ్యోతిరెడ్డి, హాకీ క్రీడాకారిణి -
హాకీలో దుమ్మురేపిన క్రికెటర్
డబ్లిన్ : మహిళల హాకీ ప్రపంచకప్‌లో ఐర్లాండ్ మహిళా క్రికెటర్ ఎలినా టైస్ అదరగొట్టింది. ఫైనల్లో నెదర్లాండ్ చేతిలో ఐర్లాండ్ ఓడినప్పటికీ ఆ మహిళా క్రికెటర్ తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది. ఇటీవల ముగిసిన ఈ టోర్నీలో రజతం సాధించి ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. అయితే ఎలినా టైస్లా రెండు క్రీడల్లో రాణించే మహిళా క్రికెటర్లు ఉన్నప్పటికి ఆమె ప్రత్యేకం. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, న్యూజిలాండ్ కెప్టెన్ సుజీ బేట్స్(బాస్కెట్ బాల్), ఆల్‌రౌండర్ సోఫీ డివిన్ (హాకీ)లు తమ దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. లెగ్‌స్పిన్నర్ కమ్ బ్యాట్స్‌మన్ అయిన ఎలినా మాత్రం వీరందరికీ భిన్నంగా 13 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి మూడో పిన్నవయస్కురాలిగా రికార్డు నమోదు చేసింది. అనూహ్యంగా ఎలీనా డచ్‌పై తన అరంగేట్ర మ్యాచ్ ఆడింది. ఇక 18 ఏళ్ల వయసులో ఐర్లాండ్ సీనియర్ హాకీ జట్టులో చోటు సంపాదించిన ఎలినా.. రెండళ్లకే ప్రపంచకప్ టోర్నీలో పాల్గొని రజత పతాక విజేతగా నిలిచింది. హాంప్‌షైర్‌లో జన్మించిన ఎలినా.. తన నాలుగేళ్ల వయసులోనే వారి కుటుంబం అమెరికాలోని ఇండియానాపొలిస్‌కు వలస వచ్చింది. అక్కడ తొలుత బేస్‌బాల్ క్రీడను ఎంచుకుంది. అయితే మరోసారి వారి కుటుంబం అక్కడి నుంచి వియన్నాకు తరలిరావడంతో ఆమె అడుగులు క్రికెట్‌వైపు పడ్డాయి. అనంతరం ఆమె ఆస్ట్రేలియా క్రికెట్ క్లబ్ తరపున ఆడింది. స్కూల్ క్రికెట్ ఆడుతున్న తరుణంలో వారి కుటుంబం తిరిగి ఐర్లాండ్ చేరింది. సరిగ్గా అప్పుడే ఆమె హాకీని కూడా ఆడటం ప్రారంభించింది. సోదరులు.. ఆటగాళ్లే.. ఇక ఆమె చిన్నతనంలో క్రికెట్, హాకీలు కాకుండా ఫుట్‌బాల్, రగ్భీలను ఆడేది. తన కుటుంబంలో చిన్నదైన ఎలినా.. సోదరులు సైతం క్రీడాకారులే కావడం విశేషం. ఒక సోదరుడు వికెట్ కీపర్ కాగా.. మరొకరు రగ్భీ ఆటగాడు. పిన్న వయసులో అదరగొట్టిన ఎలినా టైస్పై ఐర్లాండ్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రజత పతకంతో తిరిగి వచ్చిన ఐర్లాండ్ జట్టుకు ఘనస్వాగతం పలకగా.. రెండు క్రీడల్లో రాణిస్తున్న ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. చదవండి: భారత మహిళల కల చెదిరె... -
పంద్రాగస్టుకి గోల్డ్
మెడల్ కాదు. ఒలింపిక్స్ వేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహిస్తే చాలనుకునే ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే... ఒలింపిక్స్‌లో వివిధ దేశాల తరపున అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటారు. అలా 1948లో ఇంగ్లాండ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఇండియన్ హాకీ టీమ్ ఫస్ట్ గోల్డ్ మెడల్ కొట్టింది. పతకం నెగ్గిన సంతోషంతో దేశ పతాకం రెపరెపలాడింది. ఈ మధురమైన సంఘటనల ఆధారంగా హిందీలో రూపొందిన సినిమా ‘గోల్డ్’. ఇండియన్ హాకీ టీమ్ ప్లేయర్ బల్బీర్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించారు. రీమా ఖగ్తీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మౌనీ రాయ్, కునాల్ కపూర్, అమిత్, వినీత్ కీలక పాత్రలు చేశారు. గతేడాది డిసెంబర్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా చిత్రబృందం తెలిపింది. అంటే.. పంద్రాగస్టుకి ‘గోల్డ్’ అన్నమాట. గతేడాది ఇండిపెండెన్స్ వీక్‌లో ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్షయ్ ఈసారి ‘గోల్డ్’ సినిమాతో థియేటర్స్‌లోకి రానుండటం విశేషం. -
ఆట మధ్యలోనూ అమ్మతనం చాటింది..
అల్బర్టా : ఎనిమిది వారాల కిందట పాపకు జన్మనిచ్చిన కెనడా హాకీ క్రీడాకారిణి సారా స్మల్కు ఓ సమస్య ఎదురైంది. ఇటీవల ఓ హాకీ మ్యాచ్‌లో పాల్గొన్న ఆమె తనతోపాటు పాలిచ్చే బ్రెస్ట్ పంప్ తీసుకెళ్లడం మరచిపోయింది. విరామ సమయంలో డ్రెసింగ్ రూమ్‌కి వచ్చిన ఆమె తన చిన్ని పాప పాలకోసం ఏడవటం చూసి క్షణం కూడా ఆలోచించకుండా టీషర్ట్ తీసివేసి బిడ్డకు స్తన్యమిచ్చారు. తల్లిప్రేమను చాటుతూ ఆట మధ్యలో ఆమె పాలిస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన బిడ్డకు పాలిస్తున్న సందర్భంగా తీసిన ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఆమె.. ‘ఓ తల్లిగా చాలా గర్వపడుతున్నాను. నా బిడ్డ అవసరాలు తీర్చడంతో నాకు ఏదో సాధించాననే ఆనందం కలిగింది. మీరు కూడా మీకు నచ్చిన పనిచేయండి. బయటివారి గురించి ఆలోచించకుండా మీ పిల్లలకు స్తన్యమివ్వండి. మీ పిల్లలకు మరింత చేరువ అవ్వండి’ అని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లోనే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది ఆమె చూపిన మాతృప్రేమను అభినందిస్తున్నారు. కొంతమంది వికృతమైన కామెంట్లు కూడా పెడుతున్నారు. తల్లి కావడమే మహిళకు జీవితంలో అత్యంత సంతోషకరమైన సందర్భం. బిడ్డ కోసం నవమాసాలు మోసి ఎన్ని సమస్యలు ఎదురయినా తట్టుకునే మహిళలు, తమ పిల్లలు పాలకోసం అలమటిస్తే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించరు. వారు ఎక్కడున్నా పిల్లల ఆకలి తీర్చేందుకు ప్రయత్నిస్తారు. ఇదే అంశంపై అవగాహన కల్పించేందుకు కేరళకు చెందిన ఓ హీరోయిన్ బిడ్డకు పాలిస్తూ ఫొటోషూట్ చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు స్తన్యమివ్వడం నేరం కాదు. బిడ్డ ఏడ్వగానే ఆ బుజ్జీ కడుపును నింపాల్సిన బాధ్యత తల్లిపై ఉంటుంది. ఈ విషయంలోనూ సామాజికంగా ప్రతికూల ఆలోచనలు ఉండటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. బిడ్డకు పాలివ్వడంలో మాతృత్వం కల్పించే గొప్ప వరం.. దానిని కూడా సంకుచిత దృష్టితో చూడవద్దని కోరుతున్నారు. -
ఆట మధ్యలో అమ్మగా...
టొరంటో (కెనడా): అప్పటి వరకు మైదానంలో చురుగ్గా కదులుతూ ఆమె తమ ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది... తల్లిగా మారిన తర్వాత ఆడుతున్న తొలి టోర్నీలో అయినా ఆటలో ఏమాత్రం పదును తగ్గలేదు... ఇంతలో ఆటకు చిన్న విరామం! ఆ సమయంలో ఆమెలోని అమ్మతనం బయటకు వచ్చింది. అంతే... తమ జట్టు లాకర్ రూమ్‌లోనే సహచర క్రీడాకారిణుల మధ్య తన పాపకు పాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎక్కడ ఉన్నా తల్లిగా తన బాధ్యత నిర్వహించడం తప్పు కాదంటూ ఆమె పాలు ఇస్తున్న ఫొటోపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. క్రీడా ప్రపంచంలో ఇది ఎప్పుడూ జరగని ఒక అరుదైన ఘటనగా చెప్పవచ్చు. ఆమె పేరు సేరా స్మాల్. కెనడా ఐస్ హాకీ ప్లేయర్. ప్రస్తుతం తమ జాతీయ టోర్నీలో ఆల్బర్టా రాష్ట్ర జట్టు గ్రూవ్డేల్ వైపర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఎనిమిది వారాల క్రితం పాపకు జన్మనిచ్చిన సేరా, మళ్లీ ఫిట్నెస్ సాధించి బరిలోకి దిగడం విశేషం. టోర్నీ లేని సమయంలో టీచర్‌గా పని చేసే ఆమె... చిన్నతనం నుంచే హాకీని ఇష్టపడింది. అప్పట్లో ఐస్ హాకీలో మహిళలకు అంత మంచి ప్రోత్సాహం లేకపోయినా 13 ఏళ్ల వయసులో పురుషుల జట్టుతో చేరి సేరా సాధన చేసేది. అందుకోసం ఆమె తన పోనీటెయిల్‌ను కూడా కట్ చేసుకుంది! ఆటలో ఒక వెలుగు వెలిగిన తర్వాత పెళ్లి, ప్రసవం తర్వాత తిరిగొచ్చి మళ్లీ మైదానంలో తమ సత్తా చాటిన వారు చాలా మంది ఉన్నారు కానీ మ్యాచ్ మధ్యలో ఇలాంటిది గతంలో ఎప్పుడూ చూడలేదు. ‘నిజానికి ఈ ఫొటోను బయటపెట్టే విషయంలో నేను చాలా సంకోచించాను. అయితే మా జట్టు సభ్యులు తప్పేమీ లేదంటూ ప్రోత్సహించారు. ఒక అమ్మగా నేను చేసిన పనికి గర్వపడుతున్నాను. దీనికి అన్ని వైపుల నుంచి సానుకూల స్పందన రావడం నాకు సంతోషాన్నిచ్చింది’ అని సేరా స్మాల్ పేర్కొంది. -
బై బై.. సెర్బియా
సొంత గడ్డపై మ్యాచ్‌లు కంప్లీట్ అయ్యాయి. ఇక విదేశీ గడ్డపై సత్తా చాటేందుకు వెళ్లారు హీరోయిన్ తాప్సీ. ఇంతకీ...తాప్సీ ప్రజెంట్ ఏ గేమ్ ప్లేయర్ అంటే..‘హాకీ’ అని ఇట్టే ఊహించే ఉంటారు. బీ టౌన్ డైరెక్టర్ షాద్ అలీ దర్శకత్వంలో హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సూర్మ’. సందీప్ రోల్‌ను హిందీ యాక్టర్ దిల్జీత్‌సింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా తాప్సీ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్‌ను చత్తీస్‌ఘడ్‌లో చిత్రీకరించారు. నిన్నటి వరకు సెర్బియాలో ఒక షెడ్యూల్‌ను చిత్రీకరించారు. అక్కడ కీలకమైన సీన్స్‌లో పాల్గొన్నారు తాప్సీ. ఈ సినిమాను జూన్ 29న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అంతేకాదండోయ్.. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే... తాప్సీ త్వరలోనే ముంబైలో ఓ ఇల్లు కొనాలనుకుంటు న్నారని, సమ్మర్లో గృహప్రవేశం చేయాల నుకుంటున్నారని బాలీవుడ్ టాక్. మరి.. తాప్సీ కొత్త ఇంటి అడ్రెస్ ఎక్కడ? అంటే.. ఆశ..దోశ.. అప్పడం.. వడ.. చెప్పేస్తారేంటి? -
హాకీప్లేయర్‌గా ఢిల్లీ బ్యూటీ
టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయం అయి తరువాత బాలీవుడ్ లో బిజీ అయిన అందాల భామ తాప్సీ పన్ను. తెలుగు సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల వార్తల్లో ప్రముఖం గా వినిపించిన ఈ భామ తరువాత ఆనందో బ్రహ్మా సినిమాతో సౌత్ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఇక తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చేస్తానని చెప్పిన ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవటంతో తిరిగి బాలీవుడ్ లో బిజీ అయ్యే పనిలో ఉంది. ప్రస్తుతం వరుణ్ దావన్ సరసన హీరోయిన్ గా నటించిన జుడ్వా 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న తాప్సీ, మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పింది. ఇప్పటికే పింక్, బేబి లాంటి సినిమాలతో బాలీవుడ్ లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న తాప్సీ, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లో హాకీ ప్లేయర్ గా నటించనుందట. అందుకోసం ప్రత్యేకంగా హాకీ శిక్షణ తీసుకునేందుకు రెడీ అవుతోంది. షాద్ అలీ దర్శకత్వంలో తెరకెక్కనున్ ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
సర్దార్ సింగ్‌కు ఊరట
న్యూఢిల్లీ: మాజీ ప్రేమికురాలిపై అత్యాచారం కేసులో హాకీ ఆటగాడు సర్దార్ సింగ్‌కు ఊరట లభించింది. ఈ కేసు విచారణపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండానే విచారణ కోసం సిటీ ట్రయల్ కోర్టు ఆదేశించిందని, దీనిపై స్టే విధించాలని సర్దార్ హైకోర్టును ఆశ్రయించాడు. సర్దార్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని ఇంగ్లండ్‌కు చెందిన మాజీ అండర్-19 హాకీ పేయ్లర్ అష్పాల్ కౌర్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తూ ట్రయల్ కోర్టులో కేసు వేసింది. దీంతో కోర్టు విచారణకు ఆదేశించగా హైకోర్టు స్టే విధిస్తూ జనవరి 6లోగా ఈ విషయంపై సమాధానమివ్వాల్సిందిగా ఆమెకు నోటీసులిచ్చింది. -
వివాదంలో సర్దార్ సింగ్
లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బ్రిటిష్ హాకీ ప్లేయర్ ఆరోపణ న్యూఢిల్లీ: భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. రెండేళ్ల కిందట తనతో నిశ్చితార్థం చేసుకొని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని భారత సంతతికి చెందిన బ్రిటిష్ హాకీ ప్లేయర్ అష్పాల్ కౌర్... సర్దార్‌పై లూథియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని గతేడాది బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది. అప్పట్నించి పెళ్లి మాట ఎత్తితే బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. 2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా ఇద్దరికీ పరిచయం అయ్యిందని, అదే ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని క్రీడాకారిణి తెలిపింది. అప్పట్నించి కలిసి జీవిస్తున్నామని చెప్పింది. అయితే అష్పాల్ చేసిన ఆరోపణలను సర్దార్ సింగ్ ఖండించాడు. క్రీడాకారిణితో పరిచయం ఉన్న మాట వాస్తవమే అయినా... తామిద్దరికి ఎలాంటి నిశ్చితార్థం జరగలేదని స్పష్టం చేశాడు. ఆమె తనపై చేస్తున్న ఆరోపణలకు త్వరలోనే సమాధానమిస్తానన్నాడు. ‘ఆ అమ్మాయి నాపై చాలా సీరియస్ ఆరోపణలు చేస్తోంది. సరైన సమయంలో వాటన్నింటికీ సమాధానం ఇస్తా. ప్రస్తుతం నేను హాకీ ఇండియా లీగ్ మ్యాచ్‌లపై దృష్టి పెట్టా. మంగళవారం రాత్రి మ్యాచ్ తర్వాత ఈ ఆరోపణలు నా దృష్టికి వచ్చాయి. గురువారం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. దాని తర్వాత మా లాయర్‌తో సంప్రదించి జవాబిస్తా’ అని సర్దార్ సింగ్ వ్యాఖ్యానించాడు. -
విషాద గాథ.. ఆదర్శ కథ!
పృథ్వీపాల్ సింగ్.. ఒకనాటి భారత హాకీ లెజెండ్. యాభైవ దశకంలో హాకీ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టి భారత్ కు తిరుగులేని విజయాలను అందించాడు. మూడు సార్లు ఒలింపిక్స్ లో పాల్గొన్న పృథ్వీపాల్.. ప్రతీసారి దేశానికి పతకం తెచ్చిపెట్టాడు. పెనాల్టీ కార్నర్ గా విశేషమైన సేవలందించి తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అతని జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే హత్యకు గురయ్యాడు. హాకీ కెరీయర్ లో అందరికీ ఆదర్శవంతంగా నిలిచిన అతని జీవితం.. తరువాత సాఫీగా సాగలేదు. హాకీ నుంచి దూరమైన అనంతరం లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో స్పోర్ట్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్నసమయంలో ఆయన హత్యకు గురయ్యాడు. పృథ్వీపాల్ ను హత్య చేసింది ఎవరో కాదు.. అతని విద్యార్థులే. పృథ్వీపాల్ ను క్యాంపస్ లోనే అతిదారుణంగా కాల్చి అతని మరణానికి కారణమయ్యారు ఆ యూనివర్శిటీలోని కొందరు విద్యార్థులు. ప్రస్తుతం పృథ్వీపాల్ జీవిత కథ ఆధారంగా సినిమా రూపొందుతోంది. బబితా పూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఆరంభంలో విడుదుల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పృథ్వీపాల్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.. ఆరంభంలోనే అదరగొట్టాడు 1950లో హాకీ కెరీయర్ ను ప్రారంభించిన పృథ్వీపాల్.. తక్కువ కాలంలోనే భారత జట్టుకు సారథి అయ్యాడు. 1955లో కెప్టెన్ గా ఎంపికై అందరీ అభినందనలు పొందాడు. ప్రత్యేకంగా 'కింగ్ ఆఫ్ పెనాల్టీ కార్నర్' అంటూ కామెంటేటర్స్ చేసే వ్యాఖ్యలు పృథ్వీపాల్ కు ఆటకు అద్దం పట్టేవి. దీంతో పాటు బెస్ట్ ఫుల్ బ్యాక్ ప్లేయర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1955 లో జర్మనీలో జరిగిన మునిచ్ ఫెస్టివల్ వేడుకల్లో ఆయనకు 'రోల్ ఆఫ్ హానర్స్' అవార్డును ఇచ్చి సత్కరించారు. క్రీడా రంగం, విద్యారంగంలో సాధించిన విజయాలకు గాను పృథ్వీపాల్ కు ఆ అవార్డు దక్కింది. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్.. మాస్టర్ ఆఫ్ ఆల్! పృథ్వీపాల్ కు అనేక రంగాల్లో నైపుణ్యం ఉంది. అటు హాకీలో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నా.. అగ్రికల్చర్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పంజాబ్ పోలీస్ శాఖలో పనిచేశాడు. భారత రైల్వే విభాగంలో పోలీస్ అధికారిగా పని చేశాడు. అనంతరం పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్శిటీ(పీఏయూ)లో డిప్యూటీ డైరెక్టర్ బాధ్యతలను చేపట్టాడు. ఆక్రమంలోనే 1965 లో 'ఉత్తమ'అవార్డును పొందాడు. గుర్తుండి పోయే క్షణాలు.. పృథ్వీపాల్ సింగ్ మూడు ఒలింపిక్స్ లో భాగస్వామ్యం అయ్యాడు. ఒలింపిక్స్ పాల్గొన్న ప్రతీసారి అతని ప్రదర్శనతో పతకం సాధించిపెట్టాడు. 1960 రోమ్ లో జరిగిన ఒలింపిక్స్ లో భారత్ కు రజతం, 1964 టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం, 1968 మెక్సికోలో జరిగిన ఒలింపిక్స్ లో కాంస్య పతకాలు సాధించడంలో పృథ్వీపాల్ కీలక పాత్ర పోషించాడు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ మొత్తంగా 22 గోల్స్ నమోదు చేస్తే.. అందులో 10 గోల్స్ పృథ్వీపాల్ ద్వారానే వచ్చాయంటే అతిశయోక్తిగా అనిపించక మానదు. హాకీలో తొలి అర్జున అవార్డు.. భారత ప్రభుత్వం అందజేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు హాకీ విభాగంలో తొలిసారి దక్కించుకున్న ఆటగాడు పృథ్వీపాల్. 1961 లో అప్పటి భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ నుంచి పృథ్వీపాల్ సింగ్ అ అవార్డును తీసుకున్నాడు. అనంతరం హాకీలో చేసిన విశిష్ట సేవలకు గాను1967 లో పద్మ శ్రీ పురస్కారం కూడా పృథ్వీపాల్ కు దక్కింది. విషాద క్షణాలు.. 1983 లో పృథ్వీపాల్ జీవితం విషాదాంతమైంది. ఆయన విద్యార్థులే హత్య చేశారు. పీఏయూ కార్యాలయ ఆవరణలో బైక్ పార్క్ చేస్తున్న సమయంలో ఆయనపై విద్యార్థులు తుపాకులతో దాడి చేశారు. దీనికి అక్కడ ఉన్న మరి కొందరు విద్యార్థులతో పాటు 50 మంది యూనివర్శిటీ అధికారులే సాక్ష్యం. కానీ పృథ్వీపాల్ అనుకూలంగా ఏ ఒక్కరూ సాక్ష్యం చెప్పలేదు. దీంతో కోర్టులో కేసు వీగిపోయి ఆ నిందితులు తప్పించుకున్నారు. సినిమా రూపకల్పన.. ఇప్పటికే ఎందరో క్రీడాకారుల జీవిత గాథలు సినిమా కథల రూపంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారత అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్, మహిళా బాక్సర్ మేరీకామ్ జీవిత కథలు సినిమాల రూపంలో వచ్చి మనల్ని అలరించాయి. ఇప్పుడు పృథ్వీపాల్ సింగ్ జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించే సిద్ధమయ్యారు దర్శకురాలు బబితా పూరీ. వచ్చే సంవత్సరం విడుదల కానున్న ఈ చిత్రం.. వచ్చే నెలలో లాస్ ఏంజెల్స్ లో జరిగే ఆల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఈవెంట్ లో ప్రీమియర్ షోగా ప్రదర్శించనున్నారు. -
ఆంధ్ర హాకీ కెప్టెన్‌గా విద్యా ఐశ్వర్య
-
హాకీ ప్లేయర్‌గా అలియా భట్...!
ఆమె వయసు 22 ఏళ్లు... కెరీర్ వయసు కేవలం రెండున్నరేళ్లు. కానీ బాలీవుడ్లో ఆమె సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘2 స్టేట్స్’ చిత్రాలలో పక్కింటి అమ్మాయిలా కుర్రకారు మనసు దోచుకున్న అలియా భట్ తన తాజా చిత్రం ‘ఉడ్తా పంజాబ్’లో హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నారు. కరీనా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్‌కు జంటగా అలియా కనిపించనున్నారు. అభిషేక్ చౌబే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అలియా ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు హాకీ ప్రాక్టీస్ చేస్తున్నారట. -
హాకీ క్రీడాకారిణిని వేధించిన యువకుల అరెస్టు
హైదరాబాద్: మానవ మృగాలు ఏదో చోట మహిళలను వేధిస్తునే ఉన్నారు. ఎన్ని చట్టాలు తెచ్చి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా వారు మాత్రం తమ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఓ హాకీ క్రీడాకారిణిపై ఇద్దరు యువకులు ఈవ్ టీజింగ్ పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రానికి చెందిన ఓ హాకీ క్రీడాకారిణి సోమవారం ముజాఫ్ నగర్ ఎస్ఎస్పీ ఆఫీసుకు ఆమె తండ్రితో కలసి వెళుతుండగా వికాస్(26), హరి ఓం(25) అనే ఇద్దరు యువకులు ఈవ్ టీజింగ్ పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు ఆ యువకులికి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువకుల్ని అరెస్టు చేశారు.