
హాకీ ప్లేయర్‌గా అలియా భట్...!
ఆమె వయసు 22 ఏళ్లు... కెరీర్ వయసు కేవలం రెండున్నరేళ్లు. కానీ బాలీవుడ్‌లో ఆమె సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘2 స్టేట్స్’ చిత్రాలలో పక్కింటి అమ్మాయిలా కుర్రకారు మనసు దోచుకున్న అలియా భట్ తన తాజా చిత్రం ‘ఉడ్తా పంజాబ్’లో హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నారు. కరీనా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్‌కు జంటగా అలియా కనిపించనున్నారు. అభిషేక్ చౌబే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అలియా ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు హాకీ ప్రాక్టీస్ చేస్తున్నారట.