
న్యూఢిల్లీ: ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన భారత హాకీ ప్లేయర్ మన్‌దీప్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. సోమవారం రాత్రి మన్‌దీప్ రక్తంలో ఆక్సిజన్ స్థాయి సా«ధారణం కంటే తక్కువకు పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 20 నుంచి బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్‌లో జాతీయ హాకీ శిక్షణ శిబిరం జరగాల్సి ఉండటంతో... ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించారు. అందులో మన్‌దీప్‌తో పాటు సారథి మన్‌ప్రీత్ సింగ్, డిఫెండర్ సురేంద్ర కుమార్, జస్కరన్ సింగ్, వరుణ్ కుమార్, గోల్ కీపర్ కృషన్ బహదూర్ పాఠక్‌లకు కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో వారికి అక్కడే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. రోజువారీ చెకప్‌లో భాగంగా... సోమవారం రాత్రి వైద్యులు వీరిని పరీక్షించగా మన్‌దీప్ రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయినట్లు తేలింది. దాంతో వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment