Mandeep Singh
-
పంజాబ్ జట్టుకు టీమిండియా క్రికెటర్ గుడ్‌బై
టీమిండియా వెటరన్ క్రికెటర్ మన్దీప్ సింగ్ కీలక ప్రకటన చేశాడు. పంజాబ్ జట్టుతో తన పద్నాలుగేళ్ల బంధం ముగిసిందని తెలిపాడు. ఇకపై తాను దేశవాళీ క్రికెట్లో త్రిపురకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు వెల్లడించాడు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.పరుగుల వరదపంజాబ్లోని జలంధర్‌లో 1991లో జన్మించిన మన్దీప్ సింగ్‌కు చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ. ఈ క్రమంలో బ్యాటర్‌గా ఎదిగిన అతడు.. 2010 అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే ఏడాది.. పంజాబ్ తరఫున దేశవాళీ క్రికెట్లో అరంగేట్రం చేసిన మన్దీప్ సింగ్.. మూడు ఫార్మాట్లలో కలిపి 14 వేలకు పైగా పరుగులు సాధించాడు.ఇందులో 19 సెంచరీలు, 81 అర్ధ శతకాలు ఉండటం విశేషం. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న క్రమంలో 2016లో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న మన్దీప్ సింగ్.. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. పంజాబ్‌కు టైటిల్ అందించిన కెప్టెన్టీమిండియా తరఫున మూడు టీ20 మ్యాచ్‌లు ఆడి 87 పరుగులు చేశాడు. అదే ఏడాది చివరిసారిగా భారత్‌కు ఆడిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. పంజాబ్ కెప్టెన్‌గానూ పనిచేశాడు. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో పంజాబ్‌కు టైటిల్ అందించిన 32 ఏళ్ల మన్దీప్ సింగ్.. తన కెరీర్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నట్లు శనివారం ప్రకటించాడు. అందుకే జట్టును వీడుతున్నా కాగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయాలని భావిస్తోందని.. అందుకే జట్టుకు తన సేవలు ఇక అవసరం లేదని మన్దీప్ అన్నాడు. ఈ ఏడాది త్రిపుర జట్టుతో జతకట్టేందుకు సిద్దమైనట్లు తెలిపాడు. కాగా మరో పంజాబీ బ్యాటర్ జీవన్‌జ్యోత్ సింగ్ కూడా ఈసారి త్రిపురకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. -
ముందు తిన్నగా ఆడటం నేర్చుకో...తర్వాత ప్రయోగాలు చేద్దువు
-
తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్
ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ మన్దీప్ సింగ్ ఆట తీరు మారలేదు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మన్దీప్ సింగ్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న మన్దీప్ కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. గత మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చి విఫలమైన మన్‌దీప్‌ను కేకేఆర్ మేనెజ్మెంట్ మిడిలార్డర్లో పంపింది. బ్యాటింగ్ ఆర్డర్ మారిన అతడు ఆట తీరులో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అనవసర స్కూప్ షాట్ ఆడి క్లీన్ బౌల్డయ్యాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు మూడు మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఢిల్లీపై చేసిన 12 పరుగులకే అత్యధికంగా ఉన్నాయి. పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన మన్దీప్.. అనంతరం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ మేనెజ్మెంట్ అతడిని పక్కన పెట్టింది. అయితే మన్‌దీప్‌కు మరో అవకాశం ఇవ్వాలని భావించింది. ఈ క్రమంలోనే ఢిల్లీతో మ్యాచ్‌కు అతడికి మరో అవకాశం కేకేఆర్ ఇచ్చింది. కానీ కేకేఆర్ మేనెజ్మెంట్ నమ్మకాన్ని అతడు నిలబెట్టుకోలేకపోయాడు. ఇక కీలక సమయంలో వచ్చి చెత్త షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్న మన్దీప్ సింగ్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముందు తిన్నగా ఆడటం నేర్చుకో.. తర్వాత ప్రయోగాలు చేద్దువు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఐపీఎల్లో మన్దీప్ సింగ్ అంత మంచి రికార్డు ఏమీ లేదు. ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్లో 111 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 20.80 సగటుతో 1706 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2023: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్‌లో ఇంతే! తీసి పడేయండి.. Mandeep Singh :#KKRvsDC pic.twitter.com/kYt3OWsTrG — Sharjeel (@Sharjeel0208) April 20, 2023 Mandeep Singh and Riyan Parag 2 Biggest Fraud In IPL History. Don't understand how this 2 Fraud Still Get Chance in Playing XI ????#ViratKohli #RCBvsPBKS #DCvKKR pic.twitter.com/mVqGsQJvBC — Vaibhav D (@Vaibhav04563161) April 20, 2023 First Jason, then Anukul... ...Kuldeep 'rolls Roys' over! 😅#DCvKKR #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @imkuldeep18 pic.twitter.com/XpRTNDDtbI — JioCinema (@JioCinema) April 20, 2023 -
ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే
ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు మన్దీప్ సింగ్ వరుసగా రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన మన్దీప్.. ఇప్పుడు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా మన్దీప్(15) రికార్డులకెక్కాడు.దీంతో అతడి ఆటతీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో మన్దీప్ ఆటతీరుపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ప్రతీ ఐపీఎల్ సీజన్లో ఎదోక జట్టులో మన్దీప్ ఉంటాడని, అయితే తన స్థానానికి మాత్రం ఎటువంటి న్యాయం చేయడని గవాస్కర్ విమర్శించాడు. అతడు ఔటైన సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న గవాస్కర్ మాట్లాడుతూ.. ప్రతీ సారి అతడిని ఏదో ఒక ప్రాంఛైజీ కొనుగొలు చేస్తుంది. కానీ అతడి మాత్రం తనకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. బహుశా అతడు వచ్చే సీజన్‌కు కేకేఆర్ విడిచిపెట్టే అవకాశం ఉంది అని పేర్కొన్నాడు. మరోవైపు నెటిజన్లు సైతం మన్‌దీప్‌ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఐపీఎల్‌కు ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్ అంటూ ట్రోలు చేస్తున్నారు. చదవండి: రోహిత్, కోహ్లి, రాహుల్‌కే ఛాన్స్‌లు ఇస్తారా.. అతడు ఏం పాపం చేశాడు మరి? -
ఐపీఎల్-2023లో బద్దలయ్యేందుకు రెడీగా రికార్డులివే..!
మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో పలు రికార్డులు బద్దలయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఆ రికార్డులేంటో ఓసారి లుక్కేద్దాం. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు: ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉంది. ఈ సీఎస్కే మాజీ ఆల్‌రౌండర్ 183 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ హైయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా చలామణి అవుతున్నాడు. ఈ రికార్డును రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. చహల్ ఖాతాలో ప్రస్తుతం 166 వికెట్లు ఉన్నాయి. రానున్న సీజన్లో అతను మరో 18 వికెట్లు తీస్తే బ్రావో రికార్డు బ్రేక్ అవుతుంది. అత్యధిక సెంచరీలు: ఐపీఎల్లో అత్యధిక సెంచరీల రికార్డు క్రిస్ గేల్ పేరిట నమోదై ఉంది. యూనివర్సల్ బాస్ ఖాతాలో 6 సెంచరీలు ఉండగా.. ఆర్ఆర్ జోస్ బట్లర్, ఆర్సీబీ విరాట్, పంజాబ్ రాహుల్, ఢిల్లీ వార్నర్ ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అత్యధిక సిక్సర్ల రికార్డు: రాబోయే సీజన్లో ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న సెకెండ్ హైయ్యెస్ట్ సిక్సర్స్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. ఏబీడీ ఖాతాలో 251 సిక్సర్లు ఉండగా.. ఈ రికార్డును రోహిత్ శర్మ (240) బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో క్రిస్ గేల్ (357) ఉన్నాడు. అత్యధిక డక్స్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రానున్న సీజన్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది. హిట్‌మ్యాన్ మరో మ్యాచ్‌లో డకౌటైతే మన్దీప్ సింగ్ (14)ను అధిగమించి హోల్ అండ్ సోల్‌గా చెత్త రికార్డుకు ఓనర్ అవుతాడు. ఇవే కాకుండా రానున్న సీజన్లో పలువురు ఆటగాళ్లు ఐపీఎల్లో ఎవరికీ సాధ్యపడని పలు మైలురాళ్లను అధిగమించే అవకాశం ఉంది. అవేంటంటే.. అత్యధిక మ్యాచ్‌లు: సీఎస్కే సారధి ఎంఎస్ ధోని రానున్న ఐపీఎల్ సీజన్లో 250 మ్యాచ్‌ల మార్కును అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ధోని ఐపీఎల్లో 234 మ్యాచ్‌లు ఆడి టాప్‌లో ఉన్నాడు. అత్యధిక పరుగులు: ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ రానున్న సీజన్లో 7000 పరుగుల మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 6624 పరుగులుండగా.. ధవన్ ఖాతాలో 6244 రన్స్ ఉన్నాయి. అలాగే వార్నర్ (5881), రోహిత్ శర్మ (5879)లు 6000 పరుగుల క్లబ్లో చేరే అవకాశం ఉంది. అత్యధిక క్యాచ్‌లు: ఐపీఎల్లో ఇప్పటివరకు 97 క్యాచ్‌లు అందుకున్న రోహిత్ శర్మ, 93 క్యాచ్‌లు అందుకున్న విరాట్ కోహ్లి 100 క్యాచ్‌ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఈ రికార్డు సురేశ్ రైనా (109) పేరిట ఉంది. -
'అతడిని పక్కన పెట్టండి.. ఆ యువ ఆటగాడికి అవకాశం ఇవ్వండి'
ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ మన్దీప్ సింగ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోను దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో మన్దీప్ సింగ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో మన్దీప్ సింగ్ ఆశించిన స్థాయిలో ఆడడం లేదని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. మన్దీప్ జట్టులో తన స్థానాన్ని నెలబెట్టుకోవాలంటే తన ఆట తీరును మార్చాలని అతడు తెలిపాడు. తన ఐపీఎల్ కెరీర్లో 107 మ్యాచ్‌లు ఆడిన మన్దీప్ సింగ్.. 1692 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. గతంలో మన్దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు డేవిడ్ వార్నర్, అన్రీచ్ నోర్జే ఢిల్లీ జట్టులోకి రానున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ ప్రివ్యూ గురుంచి ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడాడు. "జట్టులోకి డేవిడ్ వార్నర్ వస్తే.. టిమ్ సీఫెర్ట్ తన స్థానాన్ని కోల్పోతాడు. మన్దీప్ సింగ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. కానీ అతడు అంతగా రాణించడంలేదు. అతడు తన ఐపీఎల్ కెరీర్లో 100 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. కానీ 1500పైగా పరుగులు మాత్రమే చేశాడు. అతడు తన స్థాయికి తగ్గట్టుగా ఆడడం లేదు. అతడి స్థానంలో కోన భరత్ లేదా యష్ ధుల్ అవకాశం ఇస్తే బాగుటుందని భావిస్తున్నాను అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: MI VS KKR: వడ పావ్ ట్వీట్.. సెహ్వాగ్‌పై ఫైరవుతున్న హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ -
FIH Pro League: ఆఖరి నిమిషంలో గోల్.. భారత్‌ను గెలిపించిన మన్దీప్
భువనేశ్వర్: చివరి నిమిషంలో గోల్ చేసిన మన్దీప్ సింగ్ ప్రొ హాకీ లీగ్‌లో భారత పురుషుల జట్టుకు ఐదో విజయాన్ని అందించాడు. అర్జెంటీనాతో ఆదివారం జరిగిన రెండో అంచె లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–3 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున హార్దిక్ సింగ్ (17వ ని.లో), మన్దీప్ సింగ్ (60వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... జుగ్రాజ్ సింగ్ (20వ, 52వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. ఈ విజయంతో భారత్ తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. చదవండి: IND VS SL Pink Ball Test: పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ కీలక వ్యాఖ్యలు -
‘ఒక్క రోజు.. ఒక్క మ్యాచ్ మాత్రమే.. గెలిచి తీరుతాం’
టోక్యో: ‘‘ఇది నిజంగా బాధాకరమైన రోజు. అతిముఖ్యమైన మ్యాచ్‌లో ఓడిపోయాం. ముఖ్యంగా పెనాల్టీ కార్నర్ల విషయంలో పెద్ద తప్పులు చేశాం. అయితే, ఇప్పటికీ కాంస్యం గెలిచే అవకాశం ఉంది కదా. కాబట్టి పతకం గెలిచేందుకు మేం పూర్తిగా కృషి చేస్తాం. అన్ని విధాలా సన్నద్ధమవుతాం. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం. మాకు ఇంకొక్క రోజు.. ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి తప్పకుండా పోరాడతాం. ఒకరికొకరం పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటూ మమ్మల్ని మేం సన్నద్ధం చేసుకుంటాం’’ అని భారత పురుషుల హాకీ జట్టు స్టార్ ప్లేయర్ మన్దీప్ సింగ్ పేర్కొన్నాడు. సెమీస్‌లో ఓడినప్పటికీ కాంస్య పతక పోరులో తప్పక గెలిచితీరతామని విశ్వాసం వ్యక్తం చేశాడు. అదే విధంగా... స్టార్ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ చాంపియన్‌తో మ్యాచ్ అంత సులభమేమీకాదు. కొన్ని తప్పిదాలు జరిగాయి. మ్యాచ్ స్వరూపమే మారిపోయింది’’ అని విచారం వ్యక్తం చేశాడు. కాగా మంగళవారం నాటి టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. దేశమంతా సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూసిన ఈ మ్యాచ్‌లో పరాజయం ఎదురుకావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. తాజా ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు మెరుగైన ప్రదర్శన కనబరిచారని, తదుపరి మ్యాచ్‌లో ఇంకా బాగా ఆడాలని ఆకాంక్షించారు. కాగా సెమీస్-2లో ఓడిన జట్టుతో భారత్ కాంస్య కోసం తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. -
కేకేఆర్‌పై పంజాబ్ ప్రతాపం
పంజాబ్ తెలుసుగా... 220 పైచిలుకు పరుగులు చేసినా కూడా ఓడింది. సూపర్ ఓవర్లో రెండంటే రెండు పరుగులు చేసిన జట్టు. ఒక్కమాటలో చెప్పాలంటే ఐపీఎల్ తొలి సగం మ్యాచ్‌ల్లో వరుసబెట్టి నిరాశపరిచింది. కానీ ఈ కింగ్స్... చెన్నై కింగ్స్‌లా కాదు! మొదటన్నీ ఓడినా... తర్వాతన్నీ గెలుచుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఆరో విజయంతో ‘ప్లే ఆఫ్స్’ దారిలో పడింది. షార్జా: ఈ సీజన్లో పంజాబ్‌ను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం, అనుమానం కలుగకమానదు. ఒకదశలో ఏడింట ‘ఆరు’ ఓడిపోయిన జట్టు... వరుసగా విజయబావుటా ఎగరేస్తున్న జట్టు ఇదేనా అని కచ్చితంగా అనిపిస్తుంది. కానీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ప్రత్యర్థి జట్టపై పంజా విసురుతోంది. ఇది నిజం. అది కూడా వరుసగా! సోమవారం పంజాబ్ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచింది. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ మోర్గాన్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. షమీ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత పంజాబ్ 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ గేల్ (29 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరిపించగా... మన్దీప్ (56 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలిపించాడు. షమీ తడఖా... పంజాబ్ కెప్టెన్ రాహుల్ టాస్ నెగ్గగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా ఇన్నింగ్స్ మొదలైన రెండో బంతికే మ్యాక్స్‌వెల్... నితీశ్ రాణా (0)ను డకౌట్ చేశాడు. రెండో ఓవర్ వేసిన షమీ తన తడాఖా చూపాడు. నాలుగో బంతికి రాహుల్ త్రిపాటి (7)ని, ఆఖరి బంతికి దినేశ్ కార్తీక్ (0)ను డకౌట్ చేశాడు. ఒక్కసారిగా 10/3 స్కోరుతో కోల్‌కతా కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ గిల్, కెప్టెన్ మోర్గాన్ నిలకడగా ఆడి వికెట్ల పతనాన్ని కాసేపు నిలువరించారు. శుబ్‌మన్ ఫిఫ్టీ... ఆత్మరక్షణలో పడిపోయిన నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్, మోర్గాన్లే నడిపించారు. ఈ జోడీ ఆడినంతవరకు పరుగులకు ఢోకా లేకుండా పోయింది. అయితే ఈ భాగస్వామ్యం ముగిశాక మళ్లీ తర్వాత వచ్చిన వారు కూడా ముందరి బ్యాట్స్‌మెన్‌నే అనుసరించారు. గేల్... మెరుపుల్! కింగ్స్ లక్ష్యఛేదన ఫోర్‌తో మొదలైంది. కమిన్స్ తొలి బంతిని రాహుల్ బౌండరీకి తరలించాడు. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద రాహుల్ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో గేల్ క్రీజ్‌లోకి వచ్చాడు. వరుణ్ చక్రవర్తి, నరైన్ బౌలింగ్ల్లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు ఓపెనర్ మన్దీప్ చూడచక్కని బౌండరీలతో నిలకడగా పరుగులు చేశాడు. 49 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. జట్టు 13.4 ఓవర్లలో 100 పరుగులను అధిగమించింది. కాసేపటికే గేల్ ఫిఫ్టీ 25 బంతుల్లోనే పూర్తయ్యింది. వీళ్లిద్దరు రెండో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జత చేశాక గేల్ ఔటైనా... మిగతా లాంఛనాన్ని పూరన్ (2 నాటౌట్)తో కలిసి మన్దీప్ పూర్తి చేశాడు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ గిల్ (సి) పూరన్ (బి) షమీ 57; నితీశ్ రాణా (సి) గేల్ (బి) మ్యాక్స్‌వెల్ 0; రాహుల్ త్రిపాఠి (సి) కేఎల్ రాహుల్ (బి) షమీ 7; దినేశ్ కార్తీక్ (సి) రాహుల్ (బి) షమీ 0; మోర్గాన్ (సి) అశ్విన్ (బి) రవి బిష్ణోయ్ 40; నరైన్ (బి) జోర్డాన్ 6; నాగర్కోటి (బి) అశ్విన్ 6; కమిన్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 1; ఫెర్గూసన్ (నాటౌట్) 24; వరుణ్ చక్రవర్తి (బి) జోర్డాన్ 2; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–10, 4–91, 5–101, 6–113, 7–114, 8–136, 9–149. బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 2–0–21–1, షమీ 4–0–35–3, అర్‡్షదీప్ సింగ్ 2–0– 18–0, మురుగన్ అశ్విన్ 4–0–27–1, జోర్డాన్ 4–0–25–2, రవి బిష్ణోయ్ 4–1–20–2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 28; మన్దీప్ సింగ్ (నాటౌట్) 66; క్రిస్ గేల్ (సి) ప్రసిధ్ కృష్ణ (బి) ఫెర్గూసన్ 51; పూరన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో 2 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–47, 2–147. బౌలింగ్: కమిన్స్ 4–0–31–0, ప్రసి«ధ్ కృష్ణ 3–0–24–0, వరుణ్ చక్రవర్తి 4–0–34–1, నరైన్ 4–0–27–0, ఫెర్గూసన్ 3.5–0–32–1. -
భారమైన హృదయంతో బరిలోకి దిగాడు..
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ అనూహ్య విజయం సాధించింది. సన్‌రైజర్స్ గెలుస్తుందనుకునే తరుణంలో కింగ్స్ పంజాబ్ అద్భుతం చేసింది. 14 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు సాధించిన పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తద్వారా ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ జట్టు మయాంక్ అగర్వాల్‌కు విశ్రాంతినిచ్చి మన్దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకుంది. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన మన్దీప్ 17 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌కు భారమైన హృదయంతోనే మన్దీప్ సిద్ధమయ్యాడు. అతని తండ్రి, మాజీ అథ్లెటిక్స్ హర్దేవ్ సింగ్ శుక్రవారం రాత్రి చనిపోయారు. అయితే స్వస్థలం వెళ్లలేని స్థితిలో ఉన్న మనదీప్ సింగ్.. అతని తండ్రి చివరి చూపును వీడియో కాల్‌లోనే చూసి నివాళులు అర్పించాడు. శనివారం నాటి మ్యాచ్‌లో మన్దీప్ తండ్రి మృతికి సంతాపంగా పంజాబ్ ఆటగాళ్లు నల్లరంగు రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. గత మ్యాచ్‌లో మయాంక్ గాయపడటంతో మన్దీప్ తుది జట్టులోకి వచ్చాడు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న మన్దీప్ జట్టుకోసం ఓపెనర్‌గా బరిలోకి దిగాడని కింగ్స్ పంజాబ్ కొనియాడింది. ఇక మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రాతో పాటు సచిన్ టెండూల్కర్లు కూడా మన్‌దీప్‌ను కొనియాడారు. ఎంతో గుండె నిబ్బరం ఉన్న మన్దీప్ జట్టుకోసం సిద్ధం కావడం అతని అంకితభావానికి, ధైర్యానికి నిదర్శనమన్నాడు. ‘ మనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోవడం చాలా బాధిస్తుంది. ఆ వ్యక్తికి తుది వీడ్కోలు చెప్పలేకపోతే ఇంకా కలిచివేస్తుంది. మన్‌దీప్‌కు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా’ అని సచిన్ తెలిపాడు. ఇక కేకేఆర్ ఆటగాడు నితీష్ రాణా మావయ్య సురిందర్ సింగ్ కూడా రెండు రోజుల క్రితం మరణించారు. ఈ రెండు కుటుంబాలు విషాదం నుండి కోలుకోవాలని సచిన్ ఆకాంక్షించారు. అదే సమయంలో ఫ్యాన్స్ కూడా మన్‌దీప్‌ను కొనియాడుతున్నారు. కుటుంబంలో విషాదం నెలకొని ఉన్న పరిస్థితుల్లో మ్యాచ్ ఆడటం అతని చేసే పనిలో ఎంతటి అంకిత భావం ఉందో తెలియజేస్తుందని అభిమానులు కీర్తిస్తున్నారు. -
పండగ పంజాబ్‌దే...
విజయలక్ష్యం 127 పరుగులు... స్కోరు 100/3... మరో 24 బంతుల్లో 27 పరుగులు చేస్తే చాలు... కానీ ఇలాంటి స్థితి నుంచి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాన్ని వెతుక్కుంటూ వెళ్లింది. 23 బంతుల్లో మిగిలిన 7 వికెట్లు చేజార్చుకొని కుప్పకూలింది. కట్టుదిట్టమైన బౌలింగ్, చక్కటి ఫీల్డింగ్‌కు తోడు ఓటమిని అంగీకరించని తత్వం, పట్టుదలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో అనేక మ్యాచ్‌లలో చివరి క్షణం వరకు తీవ్ర ఉత్కంఠను అనుభవించిన రాహుల్ సేన కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకొని సగర్వంగా నిలబడింది. ఓటమి ఖాయమైన మ్యాచ్‌ను గెలుచుకొని సత్తా చాటింది. తాజా ఫలితం సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను బాగా దెబ్బ తీసింది. దుబాయ్: ఐపీఎల్–2020లో మరో అనూహ్య ఫలితం... గెలవాల్సిన స్థితిలో ఉండి కూడా హైదరాబాద్ జట్టు చేజేతులా ఓటమిని ఆహ్వానించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 12 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది. నికోలస్ పూరన్ (28 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రషీద్ ఖాన్ (2/14) కింగ్స్ ఎలెవన్ బ్యాట్స్‌మెన్ పని పట్టగా... హోల్డర్, సందీప్ కూడా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.5 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే దూకుడుగా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ జోర్డాన్ (3/17), అర్‡్షదీప్ సింగ్ (3/23) పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అందరూ అందరే... తొలి బంతి నుంచి చివరి బంతి వరకు పంజాబ్ ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు జట్టు బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (27 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్), మన్దీప్ సింగ్ (17) దూకుడుగా ఆడటంలో విఫలమయ్యారు. ఫలితంగా ఈ జోడి తొలి వికెట్‌కు 30 బంతుల్లో 37 పరుగులే జోడించగలిగింది. సందీప్ బౌలింగ్‌లో మన్దీప్ వెనుదిరగ్గా, పవర్‌ప్లేలో స్కోరు 47 పరుగులకు చేరింది. అయితే 66 పరుగుల వద్ద పంజాబ్‌కు అసలు దెబ్బ పడింది. వరుస బంతుల్లో గేల్ (20 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ అవుట్ కావడంతో జట్టు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పటిలాగే మ్యాక్స్‌వెల్ (12) విఫలం కాగా, దీపక్ హుడా (0) నిలబడలేకపోయాడు. మరో ఎండ్‌లో ఉన్న పూరన్ మాత్రం కాస్త పోరాడే ప్రయత్నం చేసినా అతని బ్యాటింగ్‌లో కూడా ధాటి లోపించింది. తొలి పది ఓవర్లలో 66 పరుగులు చేసిన పంజాబ్, తర్వాతి పది ఓవర్లలో 60 పరుగులే చేయగలిగింది. జట్టు ఇన్నింగ్స్‌లో మొత్తం 7 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే ఉన్నాయి. 75 బంతులు... బౌండరీనే లేదు! పంజాబ్ పస లేని బ్యాటింగ్‌కు ఇదో ఉదాహరణ. 120 బంతుల ఇన్నింగ్స్‌లో ఒకదశలో వరుసగా 75 బంతుల పాటు (12.3 ఓవర్లు) బ్యాట్స్‌మెన్ ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయారు. హోల్డర్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతికి గేల్ ఫోర్ కొట్టగా... ఖలీల్ వేసిన 19వ ఓవర్ మూడో బంతికి పూరన్ ఫోర్ కొట్టాడు. జట్టు ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు చేయని డాట్ బంతులు మొత్తం 48 ఉన్నాయి! నాన్న చనిపోయినా... పంజాబ్ ఓపెనర్ మన్దీప్ భారమైన హృదయంతో మ్యాచ్ ఆడాడు. అతని తండ్రి శుక్రవారమే చనిపోయారు. అయితే స్వస్థలం కూడా వెళ్లలేని స్థితిలో మన్దీప్ కొనసాగాడు. ఈ నేపథ్యంలో పంజాబ్ ఆటగాళ్లు నల్లరంగు రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. గత మ్యాచ్‌లో గాయపడిన మయాంక్ స్థానంలో మన్దీప్ జట్టులోకి వచ్చాడు. వార్నర్ జోరు... స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వార్నర్, బెయిర్‌స్టో (20 బంతుల్లో 19; 4 ఫోర్లు) జట్టుకు శుభారంభం అందించారు. పంజాబ్‌తో ఆడిన గత 9 మ్యాచ్‌లలో వరుసగా ప్రతీసారి అర్ధ సెంచరీ చేసిన అద్భుత రికార్డు ఉన్న వార్నర్ ఇప్పుడు కూడా అదే జోరును ప్రదర్శించాడు. తొలి రెండు ఓవర్లలో ఒక్కో సిక్స్ కొట్టిన అతను, షమీ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. అయితే బిష్ణోయ్ బౌలింగ్‌లో రివర్స్‌స్వీప్‌కు ప్రయత్నించి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో అతను పదో హాఫ్ సెంచరీ అవకాశం కోల్పోయాడు. మరో రెండు పరుగులకే బెయిర్‌స్టో కూడా అవుట్ కాగా, సమద్ (7) విఫలమయ్యాడు. ఈ దశలో మనీశ్ పాండే (29 బంతుల్లో 15), విజయ్ శంకర్ (27 బంతుల్లో 26; 4 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. మరీ నెమ్మదిగా ఆడి 33 పరుగులు జోడించేందుకు 44 బంతు లు తీసుకున్నారు. గత మ్యాచ్‌లో చెలరేగిన పాండే అయితే ఒక్కో పరుగు కోసం తంటాలు పడ్డాడు. చివరకు భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) రషీద్ 27; మన్దీప్ (సి) రషీద్ (బి) సందీప్ 17; గేల్ (సి) వార్నర్ (బి) హోల్డర్ 20; పూరన్ (నాటౌట్) 32; మ్యాక్స్‌వెల్ (సి) వార్నర్ (బి) సందీప్ 12; దీపక్ హుడా (స్టంప్డ్) బెయిర్‌స్టో (బి) రషీద్ 0; జోర్డాన్ (సి) ఖలీల్ (బి) హోల్డర్ 7; మురుగన్ అశ్విన్ (రనౌట్) 4; రవి బిష్ణోయ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–37; 2–66; 3–66; 4–85; 5–88; 6–105; 7–110. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–29–2; ఖలీల్ 4–0–31–0; హోల్డర్ 4–0–27–2; రషీద్ ఖాన్ 4–0–14–2; నటరాజన్ 4–0–23–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) రాహుల్ (బి) బిష్ణోయ్ 35; బెయిర్‌స్టో (బి) అశ్విన్ 19; పాండే (సి) (సబ్) సుచిత్ (బి) జోర్డాన్ 15; సమద్ (సి) జోర్డాన్ (బి) షమీ 7; శంకర్ (సి) రాహుల్ (బి) అర్‡్షదీప్ 26; హోల్డర్ (సి) మన్దీప్ (బి) జోర్డాన్ 5; గార్గ్ (సి) జోర్డాన్ (బి) అర్‡్షదీప్ 3; రషీద్ (సి) పూరన్ (బి) జోర్డాన్ 0; సందీప్ (సి) అశ్విన్ (బి) అర్‡్షదీప్ 0; నటరాజన్ (నాటౌట్) 0; ఖలీల్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 114. వికెట్ల పతనం: 1–56; 2–58; 3–67; 4–100; 5–110; 6–112; 7–112; 8–114; 9–114; 10–114. బౌలింగ్: షమీ 4–0–34–1; అర్‡్షదీప్ 3.5–0–23–3; అశ్విన్ 4–0–27–1; బిష్ణోయ్ 4–0–13–1; జోర్డాన్ 4–0–17–3. టర్నింగ్ పాయింట్... 17వ ఓవర్ తొలి బంతికి జోర్డాన్ బౌలింగ్‌లో పాండే అవుట్ కావడంతో రైజర్స్ పతనం మొదలైంది. సబ్‌స్టిట్యూట్ సుచిత్ బౌండరీ లైన్ వద్ద గాల్లో లేచి అద్భుతంగా క్యాచ్ పట్టాడు. తర్వాతి ఓవర్లో శంకర్ వెనుదిరగ్గా, 19వ ఓవర్లో రెండు, 20వ ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయిన జట్టు ఓటమిని ఖాయం చేసుకుంది. జోర్డాన్, బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి పాండే క్యాచ్ పట్టిన సుచిత్ -
మన్దీప్ సింగ్ ఆసుపత్రికి తరలింపు
న్యూఢిల్లీ: ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన భారత హాకీ ప్లేయర్ మన్దీప్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. సోమవారం రాత్రి మన్దీప్ రక్తంలో ఆక్సిజన్ స్థాయి సా«ధారణం కంటే తక్కువకు పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 20 నుంచి బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో జాతీయ హాకీ శిక్షణ శిబిరం జరగాల్సి ఉండటంతో... ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించారు. అందులో మన్‌దీప్‌తో పాటు సారథి మన్‌ప్రీత్ సింగ్, డిఫెండర్ సురేంద్ర కుమార్, జస్కరన్ సింగ్, వరుణ్ కుమార్, గోల్ కీపర్ కృషన్ బహదూర్ పాఠక్‌లకు కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో వారికి అక్కడే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. రోజువారీ చెకప్‌లో భాగంగా... సోమవారం రాత్రి వైద్యులు వీరిని పరీక్షించగా మన్దీప్ రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయినట్లు తేలింది. దాంతో వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. -
మన్‌దీప్‌కు కరోనా
న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టులో కోవిడ్–19 బాధితుల సంఖ్య ఆరుకు చేరింది. జలంధర్‌కు చెందిన ఫార్వర్డ్ ప్లేయర్ మన్దీప్ సింగ్ తాజాగా కరోనా బారిన పడ్డాడు. ఈనెల 20 నుంచి బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో జాతీయ హాకీ శిబిరం జరుగనుండగా... 25 ఏళ్ల మన్‌దీప్‌తో పాటు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, డిఫెండర్ సురేందర్ కుమార్, జస్కరణ్ సింగ్ , డ్రాగ్ ఫ్లికర్ వరుణ్ కుమార్, గోల్ కీపర్ కృషన్ బహదూర్ పాథక్ పాజిటివ్‌గా తేలినట్లు సాయ్ తెలిపింది. వీరంతా బెంగళూరులో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ‘మన్దీప్ పాజిటివ్‌గా తేలాడు. కానీ అతనిలో కరోనా సంబంధిత లక్షణాలు పెద్దగా లేవు. మిగతా ఐదుగురితో కలిపి చికిత్స అందజేస్తున్నాం’ అని సాయ్ తెలిపింది. -
భారత హాకీలో కరోనా కలకలం
న్యూఢిల్లీ: భారత హాకీలో కరోనా కలకలం రేపుతోంది. జాతీయ స్థాయి ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతూ ఉండటం ఇండియన్ హాకీలో ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా ఆరో పాజిటివ్ నమోదు కావడంతో మరోసారి అలజడి రేగింది. హాకీ ఆటగాడు మన్దీప్ సింగ్‌కు తాజాగా కరోనా బారిన పడ్డాడు. తాజాగా జరిపిన కోవిడ్-19 టెస్టుల్లో మన్‌దీప్‌కు కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. తద్వారా భారత హాకీలో ఆరో పాజిటివ్ నమోదైంది. ఈ విషయాన్ని సాయ్ ఓ ప్రకటనలో తెలిపింది.ఆగస్టు 20వ తేదీ నుంచి నేషనల్ క్యాంప్ ఆరంభించడానికి సన్నాహకాలు ప్రారంభించిన తరుణంలో వరుసగా క్రీడాకారులు కరోనా బారిన పడటం గుబులు పుట్టిస్తోంది. (నర్సింగ్ వస్తున్నాడు...) దాంతో జాతీయ క్యాంపును వాయిదా వేసే పరిస్థితిపై భారత హాకీ సమాఖ్య చర్చలు జరుపుతోంది. గతవారం భారత హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు మరో నలుగురు కోవిడ్ బారిన పడ్డారు. సుదీర్ఘ విరామం తర్వాత సాయ్ సెంటర్‌కు వెళ్లిన క్రమంలో వీరికి కరోనా సోకింది. సాయ్ సెంటర్‌కు 20 మంది ఆటగాళ్లు హాజరు కాగా అందులో ఆరుగురికి కరోనా సోకడంతో కలవరం మొదలైంది. కరోనా సోకిన హాకీ ఆటగాళ్లలో మన్దీప్, మన్‌ప్రీత్ సింగ్‌లతో పాటు సురేంద్ర కుమార్, జస్కరన్ సింగ్, వరుణ్ కుమార్, కృష్ణ బహుదుర్ పాఠక్‌లు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నట్లు సాయ్ వెల్లడించింది. -
టైటిల్ పోరుకు టీమిండియా
బ్రెడా (నెదర్లాండ్స్): చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ వరుసగా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం ఆతిథ్య నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ 1–1 స్కోరుతో ‘డ్రా’ అయింది. ఫైనల్ చేరేందుకు కనీసం ‘డ్రా’ చేసుకుంటే సరిపోయే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచేందుకు చోమటోడ్చింది. చివరకు ‘డ్రా’ ఫలితంతో తుదిపోరుకు అర్హత సంపాదించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున మన్దీప్ సింగ్ (47వ నిమిషంలో) గోల్ చేయగా, తియెరి బ్రింక్‌మన్ (55వ ని.) నెదర్లాండ్స్‌కు గోల్ అందించాడు. తొలి క్వార్టర్‌లోనే భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించాయి. కానీ హర్మన్‌ప్రీత్, సునీల్ వాటిని గోల్స్‌గా మలచలేకపోయారు. ఈ మ్యాచ్‌లో భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ ఆకట్టుకున్నాడు. రెండో క్వార్టర్లో ప్రత్యర్థి జట్టుకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను అతను సమర్థంగా అడ్డుకున్నాడు. ఇందులో ఏ ఒక్కటి గోల్ అయినా భారత్ పరిస్థితి క్లిష్టంగా ఉండేది. ఆరు దేశాలు తలపడుతున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలువగా, భారత్ రెండో స్థానంలో ఉంది. టోర్నీ నిబంధనల ప్రకారం టాప్–2 జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. శనివారం జరిగిన తొలిమ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2–3తో ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా చేతిలో ఓడింది. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. రాత్రి గం. 7.30కు మొదలయ్యే ఈ ఫైనల్‌ను స్టార్ స్పోర్ట్స్–1 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
మన్‌దీప్‌సింగ్ హ్యట్రిక్
జపాన్‌పై భారత్ విజయం ఇపో: మలేసియాలో జరుగుతున్న సుల్తాన్ అజ్లాన్‌షా హాకీ టోర్నీలో భారత్ తొలి విజయం నమోదు చేసింది. బుధవారం జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్ట్రైకర్ మన్దీప్ సింగ్ ‘హ్యాట్రిక్’ గోల్స్ నమోదు చేయడంతో 4–3తో టీమిండియా గెలుపొందింది. ఆట ఆరంభం (ఎనిమిదో నిమిషం)లో జట్టుకు లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ పాల్ సింగ్ గోల్‌గా మలవడంతో 1–0తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కాసేపటికే కజుమా మారతా (10వ నిమిషం)లో గోల్ చేయడంతో స్కోరును 1–1తో జపాన్ సమం చేసింది. అనంతరం ఇరుజట్లు గోల్ చేయడంలో రెండు క్వార్టర్లు ముగిసేసరికి గేమ్ సమంగా నిలిచింది. అయితే రెండు నిమిషాల వ్యవధిలో హీతా యోషిహరా (43వ ని.),లో గోల్ సాధించడంతో జపాన్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కాసేపటికే మన్దీప్ సింగ్ తన తొలిగోల్ నమోదు చేయడంతో 2–2తో భారత్ స్కోరు సమం చేసింది. అయితే గెంకి మితాని (45వ ని.)లో గోల్ చేయడంతో జపాన్ 3–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే పది నిమిషాల తర్వాత కళ్లు చెదిరే రీతిలో మన్దీప్ మరోగోల్ చేయడంతో 3–3తో స్కోరును సమం చేసింది. మరో రెండు నిమిషాల తర్వాత మన్దీప్ మూడో గోల్ చేయడంతో 4–3తో భారత్ తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరిదాక ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ విజేతగా నిలిచింది. టోర్నీ నుంచి తప్పుకున్న శ్రీజేశ్ మరోవైపు మోకాలి గాయంతో కెప్టెన్ శ్రీజేశ్ జట్టు నుంచి తప్పుకున్నాడు. గాయం తగ్గడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని చీఫ్ కోచ్ రోలాంట్ ఓల్ట్‌మన్స్ పేర్కొన్నారు. దీంతో జూన్‌లో లండన్లోజరిగే వరల్డ్ లీగ్ సెమీస్‌కు దూరమవుతాడని తెలిపారు. -
'రూ. 50 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం'
కురుక్షేత్ర: ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాను మన్ దీప్ సింగ్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా అంతహేది గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్... మన్ దీప్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసాయిచ్చారు. మన్ దీప్ సింగ్ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. మన్ దీప్ సింగ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం హామీయిచ్చారు. కశ్మీర్ లోని మచ్చిల్ సెక్టార్ లో మన్ దీప్ సింగ్ ను ఉగ్రవాదులు కిరాతంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేశారు. ముష్కరుల దమనకాండపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. -
వీరజవాన్ మన్‌దీప్‌కు కన్నీటి వీడ్కోలు
-
టీమిండియా ఎలా రిలాక్స్ అయ్యిందంటే..
హరారే: జింబాబ్వే పర్యటనలో వన్డే సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన టీమిండియా ఆ తరువాత తొలి టీ 20లో మాత్రం అన్యూహ్యంగా ఓటమి పాలైంది. దీంతో ఒక్కసారిగా టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. మరోవైపు ఆ పరాజయం యువ ఆటగాళ్లని తీవ్రంగా నిరుత్సాహానికి గురి చేసింది. అయితే తీవ్ర ఒత్తిడిలో ఉన్న యువ జట్టు రెండో టీ 20లో అద్భుతమైన ఆట తీరుతో అదరగొట్టింది. జింబాబ్వేపై సమష్టిగా పోరాడి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే తొలి టీ 20 ఓటమి తరువాత లభించిన ఈ ఘన విజయానికి హాలీవుడ్ మూవీనే కారణమట. ఆ సినిమాతో లభించిన రిలాక్స్తోనే రెండో టీ 20లో పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించామని ఓపెనర్ మన్ దీప్ సింగ్ అంటున్నాడు. 'తొలి టీ 20 తరువాత చాలా ఒత్తిడికి గురయ్యాం. ఆ ఓటమి షాక్ నుంచి ముందు బయటపడాలని నిర్ణయించుకున్నాం. అప్పటికే అదే పిచ్ పై చాలా మ్యాచ్ లు ఆడినా మొదటి టీ 20లో విజయానికి దగ్గరకొచ్చి ఓడిపోయాం. ఆ ఓటమిపై కొన్ని కీలక విషయాలు చర్చించిన తరువాత హాలీవుడ్ మూవీ 'నౌ యూ సీ మీ-2'సినిమాకు వెళ్లాం. ఆ సినిమాను ధోనితో పాటు కొంతమంది క్రికెటర్లు కలిసి వీక్షించాం. అదే తీవ్ర ఒత్తిడిలో ఉన్న మాకు ఉపశమనం కల్గించింది' అని అరంగేట్రం టీ 20లో హాఫ్ సెంచరీ సాధించిన మన్ దీప్ సింగ్ స్సష్టం చేశాడు. -
'మ్యాచ్ ముందు రోజు నిద్రపోలేదు'
హరారే: జింబాబ్వేతో రెండో టీ20 మ్యాచ్ ఆడడానికి ముందు రోజు రాత్రి నిద్రపోలేదని టీమిండియా యువ బ్యాట్స్ మన్ మన్దీప్ సింగ్ తెలిపాడు. మ్యాచ్ కు ముందు చాలా ఒత్తిడికి గురైనట్టు వెల్లడించాడు. అయితే బ్యాటింగ్ కు దిగిన తర్వాత తనపై ఒత్తిడి మాయం అయిందన్నాడు. సోమవారం జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో మన్దీప్ అర్ధసెంచరీ(52)తో రాణించాడు. 'మ్యాచ్ ఆడడానికి ముందు నిద్రలేని రాత్రి గడిపా. మ్యాచ్ గెలుస్తామా, సిరీస్ దక్కించుకుంటామా అనేదే మదిలో మెదిలింది. నా ఆటను సెలక్టర్లు గమనిస్తున్నారన్న విషయం పదేపదే గుర్తుకు వచ్చింది. బ్యాటింగ్ కు దిగడానికి ముందు కూడా ఒత్తిడి గురయ్యాను. బ్యాటింగ్ ప్రారంభించాక ఒత్తిడి దూదిపింజలా ఎగిరిపోయింది. మ్యాచ్ గెలవాలన్న లక్ష్యం తప్ప మరో ఆలోచన రాలేద'ని మన్దీప్ తెలిపాడు. మొదటి మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో ఓడిపోవడం బాధ కలిగించిందన్నాడు. పరాజయం తర్వాత తప్పులను సమీక్షించుకుని రెండో మ్యాచ్ లో బరిలోకి దిగామని మన్దీప్ వెల్లడించాడు. -
భారత్‌కు చేజారిన విజయం
► జర్మనీతో 3-3తో మ్యాచ్ ‘డ్రా’ ► చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ లండన్: పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో బరిలోకి దిగిన భారత జట్టు తొలి మ్యాచ్‌లో ఆకట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ జర్మనీ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను టీమిండియా 3-3తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున రఘునాథ్ (7వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (26వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (32వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. జర్మనీ జట్టుకు టామ్ గ్రామ్‌బుష్ (26వ, 36వ నిమిషాల్లో) రెండు గోల్స్, జొనాస్ గోమోల్ (57వ నిమిషంలో) ఒక గోల్ అందించాడు. ఆరంభంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను రఘునాథ్ సద్వినియోగం చేసుకోవడంతో భారత్ ఖాతా తెరిచింది. 26వ నిమిషంలో జర్మనీ స్కోరు సమం చేసినా... ఆ వెంటనే భారత్ మరో గోల్ చేసి 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. మూడో క్వార్టర్ ఆరంభంలో హర్మన్‌ప్రీత్ సింగ్ డ్రాగ్ ఫ్లిక్‌తో భారత్‌కు మూడో గోల్‌ను అందించాడు. ఈ దశలో జర్మనీ దూకుడును పెంచి భారత గోల్‌పోస్ట్‌పై దాడులు చేసి రెండో గోల్‌ను సాధించింది. ఆ తర్వాత కాసేపు జర్మనీ జోరును భారత్ అడ్డుకున్నా... చివర్లో తడబడింది. 57వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను జర్మనీ సద్వినియోగం చేసుకొని స్కోరును సమం చేసింది. చివరి 3 నిమిషాల్లో భారత్ మరో గోల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. -
పంజాబ్ 327.. అసోం 326
హైదరాబాద్:అసలు సిసలైన పోరాటానికి మరో మచ్చుతునక పంజాబ్-అసోంల మధ్య జరిగిన వన్డే మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 327 పరుగులు చేస్తే.. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అసోం చివరికంటూ పోరాడి ఒక పరుగు తేడాతో ఓడింది. ఇందుకు నగరంలోని జింఖానా మైదానం వేదికైంది. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా గ్రూప్-ఏలో అసోంతో సోమవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఓటమి అంచుల వరకూ వెళ్లి బయటపడింది. తొలుత టాస్ గెలిచిన అసోం ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు పర్గత్ సింగ్(69), జీవన్ జోత్ సింగ్(32) శుభారంభాన్నివ్వగా, అనంతరం మన్ దీప్(117 నాటౌట్; 97 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్సర్లు), గుర్ కీరత్ సింగ్ (62; 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేశారు. వీరికి తోడుగా యువరాజ్ సింగ్ (36) ఫర్వాలేదనిపించడంతో పంజాబ్ ర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన అసోం అందుకు దీటుగా బదులిచ్చింది. ఓపెనర్ పాల్వకుమార్ దాస్(1) వికెట్ ను తొలి ఓవర్ లోనే కోల్పోయినా, అనంతరం స్వరూపం పూర్ కయస్తా(125; 112 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్స్) శతకాన్ని నమోదు చేశాడు. అటు తరువాత అమిత్ వర్మ(71), గోకుల్ శర్మ(60)లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఆ దశలో అస్సాం గెలుపు దిశగా పయనించింది. 28 పరుగుల వ్యవధిలో ఈ జోడీ పెవిలియన్ కు చేరడంతో ఆ భారం చివరి వరస ఆటగాళ్లపై పడింది. ఆఖర్లో సయ్యద్ మహ్మద్(22), సిన్హా(20), వాసిక్యూర్ రెహ్మాన్(11) జట్టును గెలిపిద్దామని చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో అసోం నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 326 పరుగులకు పరిమితమై ఓటమి పాలైంది. -
మన్ దీప్, గుర్ కీరత్ దూకుడు
హైదరాబాద్:విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా ఇక్కడ జింఖానా మైదానంలో అస్సాంతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ ఆటగాడు మన్ దీప్ సింగ్ , గుర్ కీరత్ సింగ్ లు దూకుడుగా ఆడారు. గ్రూప్-ఏలో భాగంగా సోమవారం ఇక్కడ జరుగుతున్న మ్యాచ్ లో మన్ దీప్(117 నాటౌట్; 97 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్సర్లు) అజేయ సెంచరీ నమోదు చేయగా, గుర్ కీరత్ సింగ్ (62; 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేశాడు. అంతకుముందు పర్గత్ సింగ్(69)లు ఆకట్టుకోగా, జీవన్ జోత్ సింగ్(32), యువరాజ్ సింగ్ (36) ఫర్వాలేదనిపించారు. దీంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. అస్సాం బౌలర్లలో అమిత్ వర్మకు రెండు వికెట్లు దక్కగా, అహ్మద్, ప్రీతమ్ దాస్ లకు తలో వికెట్ దక్కింది. ఆంధ్రపై మహారాష్ట్ర విజయం గ్రూప్-సిలో భాగంగా ఢిల్లీలో పాలెం గ్రౌండ్ లో ఆంధ్రతో జరిగిన మ్యాచ్ లో మహారాష్ట్ర 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర 50.0 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. మహారాష్ట్రఆటగాళ్లు బావ్నే(100), కేదర్ జాదవ్(101)లు శతకాలు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్రలో శ్రీకాంత్(74) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. ఆంధ్ర 42.5 ఓవర్లలో 194 పరుగులకే పరిమితమై పరాజయం చవిచూసింది. -
కెప్టెన్‌గా మన్దీప్
వార్మప్ టి20కి భారత ‘ఎ’ జట్టు ప్రకటన న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాతో వార్మప్ టి20 మ్యాచ్‌లో తలపడే భారత ‘ఎ’ జట్టును సెలక్టర్లు బుధవారం ప్రకటించారు. ఈ నెల 29న ఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా జట్టు సుదీర్ఘ పర్యటన ప్రారంభమవుతుంది. ఇందులో చాలా మంది ఐపీఎల్ ద్వారా గుర్తింపు తెచ్చుకోగా...చహల్, నేగి, పాండ్యా మినహా మిగతావారంతా భారత ‘ఎ’ తరఫున గతంలో ఆడినవారే. జట్టు వివరాలు: మన్దీప్ సింగ్ (కెప్టెన్), వోహ్రా, మనీశ్ పాండే, మయాంక్, సూర్యకుమార్, శామ్సన్, హార్దిక్ పాండ్యా, రిషి ధావన్, అనురీత్, చహల్, నేగి, కుల్దీప్ ఇషాంత్‌కు చోటు లేదు... మరో వైపు రంజీ ట్రోఫీ కోసం ప్రకటించిన ఢిల్లీ జట్టులో భారత పేసర్ ఇషాంత్ శర్మకు స్థానం లభించలేదు. గౌతం గంభీర్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. రంజీల్లో ఆడటం గురించి తమ ఫోన్ కాల్‌కు గానీ సంక్షిప్త సందేశానికి గానీ ఇషాంత్ స్పందించలేదని... అందుకే అతడిని ఎంపిక చేయలేదని సెలక్షన్ కమిటీ చైర్మన్ వినయ్ లాంబా చెప్పారు. భారత వన్డే, టి20 టీమ్‌లోకి ఎంపిక కాని ఇషాంత్‌కు టెస్టు సిరీస్‌కు ముందు రంజీల్లో ఆడేందుకు తగినంత సమయం ఉంది. -
హాకీలో భారత జూనియర్స్ ఘనవిజయం
న్యూఢిల్లీ: భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు తమ టెస్టు సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 5-1 తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఈనెల 2న ఆరంభమైన ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 13 వరకు జరుగుతుంది. ఏడో నిమిషంలోనే మన్దీప్ సింగ్ భారత్ తరఫున ఖాతా తెరిచాడు. మూడు నిమిషాల అనంతరం పెనాల్టీ కార్నర్‌ను వరుణ్ కుమార్ గోల్‌గా మలిచి 2-0 ఆధిక్యాన్ని అందించాడు. 16వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ మరో పెనాల్టీని గోల్‌గా మలిచాడు. 25వ నిమిషంలో కివీస్ ఏకైక గోల్ సాధించగలిగింది. 50వ నిమిషంలో పర్వీందర్ సింగ్, 54వ నిమిషంలో సుమీత్ టొప్పో గోల్స్‌తో భారత్ తిరుగులేని విజయాన్ని అందుకుంది.