హాకీలో భారత జూనియర్స్ ఘనవిజయం | Men's Junior Hockey: India Thrash New Zealand 5-1 | Sakshi
Sakshi News home page

హాకీలో భారత జూనియర్స్ ఘనవిజయం

Published Fri, Dec 5 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

Men's Junior Hockey: India Thrash New Zealand 5-1

న్యూఢిల్లీ: భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు తమ టెస్టు సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 5-1 తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఈనెల 2న ఆరంభమైన ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 13 వరకు జరుగుతుంది. ఏడో నిమిషంలోనే మన్‌దీప్ సింగ్ భారత్ తరఫున ఖాతా తెరిచాడు.
 
  మూడు నిమిషాల అనంతరం పెనాల్టీ కార్నర్‌ను వరుణ్ కుమార్ గోల్‌గా మలిచి 2-0 ఆధిక్యాన్ని అందించాడు. 16వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ మరో పెనాల్టీని గోల్‌గా మలిచాడు. 25వ నిమిషంలో కివీస్ ఏకైక గోల్ సాధించగలిగింది. 50వ నిమిషంలో పర్వీందర్ సింగ్, 54వ నిమిషంలో సుమీత్ టొప్పో గోల్స్‌తో భారత్ తిరుగులేని విజయాన్ని అందుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement