![Sunil Gavaskar lashes out at Mandeep Singh after KKR vs RCB game - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/7/mandeep-singh.jpg.webp?itok=6ZIShnmp)
PC: iplt20.com
ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు మన్‌దీప్ సింగ్ వరుసగా రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన మన్‌దీప్.. ఇప్పుడు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా మన్‌దీప్(15) రికార్డులకెక్కాడు.దీంతో అతడి ఆటతీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.
ఈ క్రమంలో మన్‌దీప్ ఆటతీరుపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ప్రతీ ఐపీఎల్ సీజన్‌లో ఎదోక జట్టులో మన్‌దీప్ ఉంటాడని, అయితే తన స్థానానికి మాత్రం ఎటువంటి న్యాయం చేయడని గవాస్కర్ విమర్శించాడు. అతడు ఔటైన సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న గవాస్కర్ మాట్లాడుతూ.. ప్రతీ సారి అతడిని ఏదో ఒక ప్రాంఛైజీ కొనుగొలు చేస్తుంది.
కానీ అతడి మాత్రం తనకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. బహుశా అతడు వచ్చే సీజన్‌కు కేకేఆర్ విడిచిపెట్టే అవకాశం ఉంది అని పేర్కొన్నాడు. మరోవైపు నెటిజన్లు సైతం మన్‌దీప్‌ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఐపీఎల్‌కు ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్ అంటూ ట్రోలు చేస్తున్నారు.
చదవండి: రోహిత్, కోహ్లి, రాహుల్‌కే ఛాన్స్‌లు ఇస్తారా.. అతడు ఏం పాపం చేశాడు మరి?
Comments
Please login to add a commentAdd a comment