IPL 2024- KKR: ఐపీఎల్ వేలం-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ అవలంబించిన వ్యూహాన్ని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ విమర్శించాడు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కోసం కేకేఆర్ ఏకంగా 24 కోట్లు వెచ్చించడం అతిశయోక్తిగా అనిపించిందన్నాడు.
ఏ క్రికెటర్ కూడా అంత మొత్తం అందుకునేందుకు అర్హుడు కాదని తాను భావిస్తున్నట్లు గావస్కర్ పేర్కొన్నాడు. కాగా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత స్టార్క్ క్యాష్ రిచ్ లీగ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
ఏకంగా రూ. 24.75 కోట్లు
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో సత్తా చాటిన ఈ పేస్ బౌలర్ కోసం మినీ వేలంలో ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఈ క్రమంలో స్టార్క్ కోసం గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైన కేకేఆర్.. ఏకంగా రూ. 24.75 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకుంది.
తద్వారా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ పాత రికార్డులన్నీ బద్దలుకొట్టాడు. ఈ విషయం గురించి సునిల్ గావస్కర్ తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడాడు. ‘‘నాకైతే నిజంగా ఇది అతిశయోక్తి అనిపించింది.
అతడే కాదు.. అసలు ఎవరికీ ఆ అర్హత లేదు
నాకు తెలిసి ఏ క్రికెటర్‌కు కూడా అంత భారీ మొత్తం అందుకోగల అర్హత లేదు. ఒకవేళ తాను ఆడే 14 మ్యాచ్‌లలో స్టార్క్ కనీసం నాలుగింటిలోనైనా ప్రభావం చూపితే.. ఆ డబ్బుకు కాస్తైనా న్యాయం చేసినట్లు అవుతుంది.
మిగతా మ్యాచ్‌లలోనూ రాణించగలిగితే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లలో మేటి బ్యాటర్లు ఉన్నారు. ఈ జట్లపై స్టార్క్ బంతితో ప్రభావం చూపితే మాత్రం ఫ్రాంఛైజీ తన కోసం వెచ్చించిన మొత్తానికి న్యాయం చేసినవాడవుతాడు’’ అని సునిల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు.
తొలుత ఆర్సీబీకి ఆడాడు
కాగా 2014, 2015 సీజన్లలో ఆర్సీబీకి ఆడిన స్టార్క్.. 2018లో కేకేఆర్‌కు మారాడు. అప్పుడు కేకేఆర్ అతడి కోసం రూ. 9.40 కోట్లు ఖర్చు చేయగా.. గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఇక వన్డే వరల్డ్‌కప్-2023లో మిచెల్ స్టార్క్ మొత్తంగా ఆడిన 10 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆసీస్ ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.
చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా!
Comments
Please login to add a commentAdd a comment