
దులీప్ ట్రోఫీ-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా విధ్వంసం సృష్టించాడు. తొమ్మిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. భారీ షాట్లతో విరుచుకుపడి సూపర్ సెంచరీ సాధించాడు. కేవలం 86 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న నార్త్ జోన్ జట్టు భారీ స్కోర్ చేసింది.
హర్షిత్ కంటే ముందు ఇదే ఇన్నింగ్స్‌లో మరో ఐపీఎల్ ఆటగాడు కూడా శతక్కొట్టాడు. సీఎస్‌కే ఆటగాడు నిశాంత్ సింధు (150) భారీ శతకం బాదాడు. వీరిద్దరి కంటే ముందు సీఎస్‌కేకే చెందిన మాజీ ప్లేయర్ ధృవ్ షోరే (135) కూడా సెంచరీ చేశాడు. ఫలితంగా నార్త్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 540/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో ఈ స్కోర్ నమోదైంది.
ఇదిలా ఉంటే, 21 ఏళ్ల హర్షిత్ రాణాను 2022 ఐపీఎల్ మెగా వేలంలో కేకేఆర్ సొంతం చేసుకుంది. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, అడపాదడపా బ్యాటింగ్ చేసే హర్షిత్.. ఐపీఎల్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్టు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment