IPL 2023, KKR Vs DC: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్‌ | Netizens Slams Mandeep Singh For Poor Batting Performance Against Delhi Capitals - Sakshi
Sakshi News home page

IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్‌

Published Fri, Apr 21 2023 7:30 AM | Last Updated on Fri, Apr 21 2023 8:51 AM

IPL 2023: Netizens slams kkr batter mandeep singh - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటర్‌ మన్‌దీప్‌ సింగ్‌ ఆట తీరు మారలేదు. అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మన్‌దీప్‌ సింగ్‌ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న మన్‌దీప్‌ కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. గత మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చి విఫలమైన మన్‌దీప్‌ను కేకేఆర్‌ మేనెజ్‌మెంట్‌ మిడిలార్డర్‌లో పంపింది.

బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారిన అతడు ఆట తీరులో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో అనవసర స్కూప్‌ షాట్‌ ఆడి క్లీన్‌ బౌల్డయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు మూడు మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఢిల్లీపై చేసిన 12 పరుగులకే అత్యధికంగా ఉన్నాయి. పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన మన్‌దీప్‌.. అనంతరం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు.

దీంతో కేకేఆర్‌ మేనెజ్‌మెంట్‌ అతడిని పక్కన పెట్టింది. అయితే మన్‌దీప్‌కు మరో అవకాశం ఇవ్వాలని భావించింది. ఈ క్రమంలోనే ఢిల్లీతో మ్యాచ్‌కు అతడికి మరో అవకాశం కేకేఆర్‌ ఇచ్చింది. కానీ కేకేఆర్‌ మేనెజ్‌మెంట్‌ నమ్మకాన్ని అతడు నిలబెట్టుకోలేకపోయాడు. ఇక కీలక సమయంలో వచ్చి చెత్త షాట్‌ ఆడి వికెట్‌ సమర్పించుకున్న మన్‌దీప్‌ సింగ్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ముందు తిన్నగా ఆడటం నేర్చుకో.. తర్వాత ప్రయోగాలు చేద్దువు అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌లో మన్‌దీప్‌ సింగ్‌ అంత మంచి రికార్డు ఏమీ లేదు. ఇప్పటి వరకు తన ఐపీఎల్‌ కెరీర్‌లో 111 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 20.80 సగటుతో 1706 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

చదవండిIPL 2023: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్‌లో ఇంతే! తీసి పడేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement