
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ మన్‌దీప్ సింగ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోను దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో మన్‌దీప్ సింగ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో మన్‌దీప్ సింగ్ ఆశించిన స్థాయిలో ఆడడం లేదని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. మన్‌దీప్ జట్టులో తన స్థానాన్ని నెలబెట్టుకోవాలంటే తన ఆట తీరును మార్చాలని అతడు తెలిపాడు.
తన ఐపీఎల్ కెరీర్‌లో 107 మ్యాచ్‌లు ఆడిన మన్‌దీప్ సింగ్.. 1692 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. గతంలో మన్‌దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు డేవిడ్ వార్నర్, అన్రీచ్ నోర్జే ఢిల్లీ జట్టులోకి రానున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ ప్రివ్యూ గురుంచి ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడాడు.
"జట్టులోకి డేవిడ్ వార్నర్ వస్తే.. టిమ్ సీఫెర్ట్ తన స్థానాన్ని కోల్పోతాడు. మన్‌దీప్ సింగ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. కానీ అతడు అంతగా రాణించడంలేదు. అతడు తన ఐపీఎల్ కెరీర్‌లో 100 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. కానీ 1500పైగా పరుగులు మాత్రమే చేశాడు. అతడు తన స్థాయికి తగ్గట్టుగా ఆడడం లేదు. అతడి స్థానంలో కోన భరత్ లేదా యష్ ధుల్ అవకాశం ఇస్తే బాగుటుందని భావిస్తున్నాను అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: MI VS KKR: వడ పావ్ ట్వీట్.. సెహ్వాగ్‌పై ఫైరవుతున్న హిట్‌మ్యాన్ ఫ్యాన్స్
Comments
Please login to add a commentAdd a comment