టీమిండియా స్టార్ రిషభ్ పంత్ వచ్చే ఏడాది కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే ఉంటాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. భారీ మొత్తానికి ఫ్రాంఛైజీ అతడిని అట్టిపెట్టుకుందని.. ఢిల్లీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల్లోకెల్లా ఇదే ఉత్తమమైందని పేర్కొన్నాడు. కాగా రోడ్డు ప్రమాదం కారణంగా ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన పంత్.. పునరాగమనంలో సత్తా చాటిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన పంత్.. జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చలేకపోయినా.. ఆరో స్థానంలో నిలపగలిగాడు. అయితే, సారథిగా విఫలమైనా ఆటగాడిగా మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ మొత్తంగా 446 పరుగులు సాధించి.. ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్‌గానూ రాణించాడు.
పాంటింగ్‌తో పాటు పంత్ కూడా పంజాబ్ జట్టులోకి?
అయితే, ఐపీఎల్-2025కి ముందు పంత్ ఢిల్లీ ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వచ్చాయి. హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్‌కు ఢిల్లీ ఉద్వాసన పలకగా.. అతడు పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. దీంతో పాంటింగ్‌తో పాటు పంత్ కూడా పంజాబ్‌తో జట్టుకట్టనున్నాడనే వదంతులు వ్యాపించాయి. టెస్టుల్లో పునరాగమనంలో పంత్ శతక్కొట్టగా.. అతడిని అభినందిస్తూ పంజాబ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇందుకు ఊతమిచ్చింది.
పంత్ కంటే మెరుగైన ఆటగాడు మరొకరు దొరకరు
ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ ఢిల్లీ జట్టును వీడి ఎక్కడికీ వెళ్లడం లేదు. రిక్కీ పాంటింగ్‌తో కలిసి పంజాబ్ కింగ్స్‌లో చేరతాడనే వార్తలు అవాస్తవం. చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా అతడు ఆడే అవకాశం లేదు. క్రిక్‌బజ్ తాజా కథనం ద్వారా ఈ విషయం వెల్లడైంది.
భారీ మొత్తం వెచ్చించి అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఇదొకటి. అతడిని అస్సలు వదులు కోవద్దు. పంత్ కంటే మెరుగైన కెప్టెన్ మళ్లీ మరొకరు మీకు దొరకరు’’ అని పేర్కొన్నాడు. పంత్ ఢిల్లీతోనే ఉండి.. జట్టును విజయపథంలో నడిపి టైటిల్ గెలవాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా ఆకాంక్షించాడు.
చదవండి: రంజీ ‘జట్టు’లో విరాట్ కోహ్లి, మరో టీమిండియా స్టార్ కూడా.. డీడీసీఏ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment