
'రూ. 50 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం'
కురుక్షేత్ర: ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాను మన్ దీప్ సింగ్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా అంతహేది గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంతకుముందు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్... మన్ దీప్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసాయిచ్చారు. మన్ దీప్ సింగ్ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. మన్ దీప్ సింగ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం హామీయిచ్చారు. కశ్మీర్ లోని మచ్చిల్ సెక్టార్ లో మన్ దీప్ సింగ్ ను ఉగ్రవాదులు కిరాతంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేశారు. ముష్కరుల దమనకాండపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి.