చంఢిగఢ్: లోక్‌సభ ఎన్నికల వేళ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా బీజేపీకి తమ మద్దతు ఉపసంహరించుకోవటంతో హర్యానాలో నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మైనార్టీలోకి పడిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధావారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవటంతో బీజేపీ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం పడదు. మాతో కూడా పలువురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. పలువురు నేతలు సైతం మాకు మద్దతుగా నిలుస్తున్నారు.వారిని రక్షించుకోవాలి.అయితే తర్వరలోనే తమతో ఎంతమంది టచ్‌లోకి వచ్చారన్న విషయంలో స్పస్టత వస్తుంది’ అని మనోహర్ లాల్ కట్టర్ అన్నారు.
ఇక.. మంగళవారం స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్ (దాద్రీ), రణధీర్ సింగ్ గొల్లెన్ (పుండ్రి), ధరంపాల్ గోండర్ (నీలోఖేరి)లు.. రోహ్‌తక్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో బీజేపీకి తమ మద్దతును ఉపసహరించున్న విషయాన్ని వెల్లడించారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో సీనియర్ నేత అయిన ఖట్టర్.. కర్నాల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని మొత్తం పది స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
హర్యానాలో మొతం 90 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 45 స్థానాలు. మనోర్ లాల్, రంజిత్ చౌతాలా రాజీనామాల కారణంగా రెండు స్థానాలు ఖాలీ అయ్యాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 88. ప్రస్తుతం బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.బీజేపీ హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. అయితే నిన్న ముగ్గరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించగా.. బీజేపీ కి ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment