చంఢీగర్: ఎలాంటి భద్రత లేకుండా బైక్ రైడ్ చేశారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై సీఎం ముందు వెళుతుండగా.. భద్రతా సిబ్బంది, అధికారులు ఆయనను అనుసరించారు. కర్నాల్ ఎయిర్‌పోర్టు వరకు బైక్ ప్రయాణం చేశారు.
హరియాణాలో 'కార్ ఫ్రీ డే' సందర్భంగా సీఎం బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్‌ను తగ్గించే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. వారంలో ఓ రోజు కార్లను ఉపయోగించకుండా ప్రజలను ప్రోత్సహించే సంకల్పంతో బైక్ రైడ్ నిర్వహించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన కర్నాల్‌లో ఈ ర్యాలీ చేపట్టారు.
"कार फ्री डे" हो या "नशामुक्त हरियाणा" बनाने का संकल्प हो बिना जनसहयोग के पूरा नहीं हो सकता!
— Manohar Lal (@mlkhattar) September 26, 2023
“कार फ्री डे” पर करनाल एयरपोर्ट तक की यात्रा बाइक द्वारा करके, आज के दिन कार ट्रैफिक कम करने का एक छोटा सा प्रयास मेरा भी रहा।
मुझे आशा है कि प्रदेश के जागरूक लोग इस सन्देश को आगे… pic.twitter.com/a5DQeDn1ky
ఇదీ చదవండి: బీజేపీ నేతపై లుక్‌అవుట్ నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment