సర్దార్ సింగ్‌కు ఊరట | HC stays trial proceedings against hockey player Sardar Singh | Sakshi
Sakshi News home page

సర్దార్ సింగ్‌కు ఊరట

Published Sat, Oct 15 2016 10:45 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

సర్దార్ సింగ్‌కు ఊరట

సర్దార్ సింగ్‌కు ఊరట

న్యూఢిల్లీ: మాజీ ప్రేమికురాలిపై అత్యాచారం కేసులో హాకీ ఆటగాడు సర్దార్ సింగ్‌కు ఊరట లభించింది. ఈ కేసు విచారణపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండానే విచారణ కోసం సిటీ ట్రయల్ కోర్టు ఆదేశించిందని, దీనిపై స్టే విధించాలని సర్దార్ హైకోర్టును ఆశ్రయించాడు. సర్దార్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని ఇంగ్లండ్‌కు చెందిన మాజీ అండర్-19 హాకీ పేయ్లర్ అష్పాల్ కౌర్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
 అయితే అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తూ ట్రయల్ కోర్టులో కేసు వేసింది. దీంతో కోర్టు విచారణకు ఆదేశించగా హైకోర్టు స్టే విధిస్తూ జనవరి 6లోగా ఈ విషయంపై సమాధానమివ్వాల్సిందిగా ఆమెకు నోటీసులిచ్చింది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement