హాకీప్లేయర్గా ఢిల్లీ బ్యూటీ
టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయం అయి తరువాత బాలీవుడ్ లో బిజీ అయిన అందాల భామ తాప్సీ పన్ను. తెలుగు సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల వార్తల్లో ప్రముఖం గా వినిపించిన ఈ భామ తరువాత ఆనందో బ్రహ్మా సినిమాతో సౌత్ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఇక తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చేస్తానని చెప్పిన ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవటంతో తిరిగి బాలీవుడ్ లో బిజీ అయ్యే పనిలో ఉంది.
ప్రస్తుతం వరుణ్ దావన్ సరసన హీరోయిన్ గా నటించిన జుడ్వా 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న తాప్సీ, మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పింది. ఇప్పటికే పింక్, బేబి లాంటి సినిమాలతో బాలీవుడ్ లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న తాప్సీ, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లో హాకీ ప్లేయర్ గా నటించనుందట. అందుకోసం ప్రత్యేకంగా హాకీ శిక్షణ తీసుకునేందుకు రెడీ అవుతోంది. షాద్ అలీ దర్శకత్వంలో తెరకెక్కనున్ ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.