Judwaa 2
-
భారీ వసూళ్లు.. మాసివ్ సూపర్ హిట్!
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ వరుసగా మరో భారీ విజయాన్ని అందుకున్నాడు. 'బద్రీనాథ్‌కి దుల్హానియా' సినిమాతో వందకోట్ల క్లబ్‌లోకి ఎంటరైన ఈ యువ హీరో ఈ ఏడాది 'జుడ్వా-2' భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటికే వందకోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద బలంగా కలెక్షన్స్ రాబడుతోంది. కవలల నేపథ్యంతో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన జుడ్వా 2లో ద్విపాత్రభినయం చేసిన వరుణ్ సరసన జాక్వలిన్ ఫెర్నాండెజ్, తాప్సీ పన్ను హీరోయిన్లుగా నటించారు. 1997లో ఘనవిజయం సాధించిన సల్మాన్ ఖాన్ జుడ్వాకు ఇది రీమేక్. ఈ సినిమాలో సల్మాన్ కూడా డ్యూయల్ లో రోల్ కనిపించి అలరించాడు. వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన జుడ్వా 2 రెండోవారంలో గట్టిగా వసూళ్లు రాబడుతోంది. సోమవారం నాటికి ఈ సినిమా దేశంలో 119.9 కోట్లు వసూలు చేసింది. తద్వారా వరుణ్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ సినిమాగా 'జుడ్వా-2' నిలిచింది. వరుణ్ గత సినిమా 'బద్రీనాథ్‌కి దుల్హానియా' మొత్తంగా రూ. 116.60 కోట్లు వసూలు చేయగా.. తాజా సినిమా ఆ రికార్డును అధిగమించింది. అంతేకాకుండా బాలీవుడ్లో ఈ ఏడాది చెప్పుకోదగ్గ బిగ్గెస్ట్ హిట్స్ లేవని చెప్పాలి. ఆ లోటును భర్తీచేస్తూ.. ఈ ఏడాది మాసివ్ హిట్‌గా 'జుడ్వా-2' నిలిచిందని విశ్లేషకులు అంటున్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - జుడ్వా-2
-
వందకోట్ల చేరువలో 'జుడ్వా 2'
ఈ ఏడాది సౌత్ సినిమాలు వందల కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంటే బాలీవుడ్ సినిమాలు మాత్రం తడబడుతున్నాయి. ఈ ఏడాది రిలీజైన ఒకటి రెండు సినిమాలు తప్ప ఘనవిజయాలు నమోదు చేసిన బాలీవుడ్ సినిమాలు పెద్దగా లేవు. ఆ లోటును బర్తీ చేస్తూ రీమేక్ గా తెరకెక్కిన జుడ్వా 2 భారీ వసూళ్లు సాధిస్తోంది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ వంద కోట్ల క్లబ్ లో చేరేందుకు దూసుకుపోతోంది. వరుణ్ ధావన్, జాక్వలిస్ ఫెర్నాండెజ్, తాప్సీ పన్ను లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా 1997లో ఘనవిజయం సాధించిన సల్మాణ్ ఖాన్ జుడ్వాకు రీమేక్ గా తెరకెక్కింది. వరుణ్ ధావన్ ద్విపాత్రాభినయం చేసిన జుడ్వా 2లో సల్మాన్ కూడా డ్యూయల్ లో రోల్ కనిపించాడు. వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన జుడ్వా 2కు ఈ వారం కూడా గట్టి పోటి లేకపోవటంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
ఇరవయ్యేళ్ల తరువాత అదే పాత్
1997లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన కామెడీ ఎంటర్ టైనర్ జుడ్వా. తెలుగు సూపర్ హిట్ హలో బ్రదర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమాలో సల్మాన్ ప్రేమ్, రాజాగా ద్విపాత్రాభినయం చేశాడు. సాజిద్ నదియావాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వరుణ్ దావన్ హీరోగా రీమేక్ చేశారు. అయితే పూర్తిగా అదే కథతో కాకుండా ఒరిజినల్ లోని కొన్ని సీన్స్ ను మాత్రమే తీసుకొని జుడ్వా 2 తెరకెక్కించారు. జుడ్వా 2 షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా అభిమానుల ఆశలు నిజం చేస్తూ సల్మాన్ డ్యూయల్ రోల్ లో అతిథిగా నటించిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్ ద్వారా రివీల్ చేశాడు హీరో వరుణ్ దావన్. వరుణ్.. ప్రేమ్, రాజాగా రెండు పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో జాక్వలిన్ ఫెర్నాండెజ్, తాప్సీ పన్నులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. Original judwaa meets #judwaa2 @BeingSalmanKhan pic.twitter.com/2cdVcAN3tF — Varun PREM Dhawan (@Varun_dvn) 22 September 2017 -
హాకీప్లేయర్‌గా ఢిల్లీ బ్యూటీ
టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయం అయి తరువాత బాలీవుడ్ లో బిజీ అయిన అందాల భామ తాప్సీ పన్ను. తెలుగు సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల వార్తల్లో ప్రముఖం గా వినిపించిన ఈ భామ తరువాత ఆనందో బ్రహ్మా సినిమాతో సౌత్ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఇక తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చేస్తానని చెప్పిన ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవటంతో తిరిగి బాలీవుడ్ లో బిజీ అయ్యే పనిలో ఉంది. ప్రస్తుతం వరుణ్ దావన్ సరసన హీరోయిన్ గా నటించిన జుడ్వా 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న తాప్సీ, మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పింది. ఇప్పటికే పింక్, బేబి లాంటి సినిమాలతో బాలీవుడ్ లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న తాప్సీ, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లో హాకీ ప్లేయర్ గా నటించనుందట. అందుకోసం ప్రత్యేకంగా హాకీ శిక్షణ తీసుకునేందుకు రెడీ అవుతోంది. షాద్ అలీ దర్శకత్వంలో తెరకెక్కనున్ ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
అందుకే గ్లామర్ డోస్ పెంచాను: నటి
సాక్షి, చెన్నై : సినిమాల్లో గ్లామర్ ఒక భాగం. గ్లామర్‌కు కేరాఫ్ హీరోయిన్లే. ఏదైనా హద్దుల్లో ఉంటేనే ముద్దు. ఒకప్పుడు శృగారభరిత గీతాలకంటూ ప్రత్యేకంగా తారలుండేవారు. ఇప్పటికీ అలాంటి డాన్సర్లున్నా, ఈ తరం హీరోయిన్లు అందాల ఆరబోతలో వారికి ఏ మాత్రం తీసిపోవడం లేదు. చాలా మంది హీరోయిన్లు గ్లామర్‌తోనే చలామణి అయిపోతున్నారు. అయితే అందుకు వారు చెప్పే సాకు అభిమానులు కోరుకుంటున్నారన్నది. నటి రాయ్‌లక్ష్మీ తన తొలి హింది చిత్రం జూలీ 2 చిత్రంలో విచ్చలవిడిగా అందాలను ఆరబోసి వార్తల్లోకెక్కారు. తాజాగా నటి తాప్సీ అదే బాట పట్టారు. దక్షిణాదిలో ఒక రౌండ్ కొట్టిన ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్‌నే నమ్ముకున్నారు. తాజా హిందీ చిత్రం జుడ్వా 2 విడుదలకు సిద్ధంగా ఉంది. వరుణ్‌దావన్ హీరోగా నటించిన ఇందులో మరో హీరోయిన్గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించారు. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలైంది. ఇందులో తాప్సీ ఈత దుస్తులు, టూపీస్ అంటూ అందాలను శృతిమించి ఆరబోశారు. ఏమిటీ ఇంతగా అంటే.. గ్లామరస్‌గా నటించడం తనకు కొత్తేమీ కాదంది. ఇంతకు ముందు దక్షిణాది చిత్రాల్లో గ్లామర్‌గా నటించానన్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు గత మూడేళ్లుగా తన చిత్రాలను ఆదరిస్తున్నారని, అలాంటి వారిని సంతృప్తి పరచడం నటిగా తన బాధ్యత అని చెప్పారు. అబిమానుల కోరిక మేరకు జూడ్వా 2 చిత్రంలో కాస్త మోతాదు మించే గ్లామర్‌గా నటించానని చెప్పుకొచ్చారు. సినిమాకు గ్లామర్, కామెడీ రెండూ ప్రధాన అంశాలయితే ఆ రెండూ జుడ్వా 2 చిత్రంలో ఉంటాయన్నారు తాప్సీ. ఇంతకు ముందు జూడ్వా చిత్రంలో నటి రంభ పోషించిన పాత్రను దానికి సీక్వెల్ అయిన జూడ్వా 2లో తాప్సీ నటించిందన్నది గమనార్హం. ఈ నెలాఖర్లో జుడ్వా 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.