1997లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన కామెడీ ఎంటర్ టైనర్ జుడ్వా. తెలుగు సూపర్ హిట్ హలో బ్రదర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమాలో సల్మాన్ ప్రేమ్, రాజాగా ద్విపాత్రాభినయం చేశాడు. సాజిద్ నదియావాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వరుణ్ దావన్ హీరోగా రీమేక్ చేశారు. అయితే పూర్తిగా అదే కథతో కాకుండా ఒరిజినల్ లోని కొన్ని సీన్స్ ను మాత్రమే తీసుకొని జుడ్వా 2 తెరకెక్కించారు.
జుడ్వా 2 షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా అభిమానుల ఆశలు నిజం చేస్తూ సల్మాన్ డ్యూయల్ రోల్ లో అతిథిగా నటించిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్ ద్వారా రివీల్ చేశాడు హీరో వరుణ్ దావన్. వరుణ్.. ప్రేమ్, రాజాగా రెండు పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో జాక్వలిన్ ఫెర్నాండెజ్, తాప్సీ పన్నులు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Original judwaa meets #judwaa2 @BeingSalmanKhan pic.twitter.com/2cdVcAN3tF
— Varun PREM Dhawan (@Varun_dvn) 22 September 2017