Cameo
-
ఒకే మూవీలో ప్రభాస్, సూర్య..ఇక బాక్సాఫిస్ షేక్ అవ్వాల్సిందే..
-
సల్మాన్ ఖాన్ చిత్రంలో రామ్ చరణ్ !
Is Ram Charan Cameo Role In Salman Khan Movie: ప్రస్తుతం స్టార్డమ్ ఉన్న హీరోలు అతిథి పాత్రల్లో తళుక్కున్న మెరుస్తూ కనువిందు చేస్తున్నారు. తమ అభిమాన హీరోలు ఇతర కథానాయకుల సినిమాల్లో నటిస్తుండటంతో వారిపై ఫ్యాన్స్‌కు అభిమానం మరింతగా పెరిగిపోతోంది. అంతేకాకుండా వారు తళుక్కుమన్న కొద్దిసేపు కొంచెం ఎఫెక్టివ్‌గా ఉంటే చాలు అందరికిమించి సినీ లవర్స్ ఎక్కువ పండుగ చేసుకుంటున్నారు. ఇటీవల కమల్ హాసన్ 'విక్రమ్' మూవీలో సూర్య 'రోలెక్స్'గా అదరగొట్టడం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కనిపించింది 3 నిమిషాలే అయిన ఆడియెన్స్‌కు మాములు థ్రిల్ ఇవ్వలేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు అతిథి పాత్రలో మెరవనున్న విషయం తెలిసిందే. మరి ఈ పాత్రతో సల్మాన్ ఏ మేర అదరగొడతాడో వేచి చూడాలి. ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ సినిమాలో చిన్న కెమియో చేసినట్లు సమాచారం. అది కూడా సల్లూ భాయ్ సినిమాలో. అవును సల్మాన్ ఖాన్ 'కభీ ఈద్ కభీ దివాలీ' చిత్రంలో రామ్ చరణ్ కనిపించనున్నట్లు బీటౌన్‌లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తెలుగు స్టార్ హీరో వెంకటేశ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ కూడా ఇందులో ఓ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఈ సినిమాలోని పాట షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో సల్లూ భాయితో కలిసి చెర్రీ స్టెప్పులేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం ధ్రువీకరించాల్సి ఉంది. ఈ సినిమాకు పర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి: స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! కాగా రామ్ చరణ్ తండ్రి చిరంజీవి సినిమాలో సల్మాన్ గెస్ట్ రోల్ చేస్తుంటే, సల్లూ భాయి మూవీలో చెర్రీ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం విశేషం. ఇటీవల 'ఆర్ఆర్ఆర్' సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. -
సూర్య ‘రోలెక్స్ సర్’ అంత బాగా ఎలా పేలాడు?
తెరపై కనిపించింది జస్ట్ కొన్ని నిమిషాలు.. అయినా థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేశాడు నటుడు సూర్య. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే రోలెక్స్ క్యారెక్టర్ ఎంత బ్రహ్మాండంగా పేలిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రెడిట్ లోకీ అలియాస్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కే దక్కుతుంది. కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో సూర్య రోల్ ఎవరూ ఊహించనిది. చాలా స్పెషల్‌గా.. అంతే క్రూరంగా డిజైన్ చేశాడు ఆ క్యారెక్టర్‌ను. ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేశాడు డైరెక్టర్ లోకేశ్. ఫొటోలు లీక్ కాకుంటే.. ఆ విషయం కూడా బయటకు పొక్కేది కాదు. అయితేనేం సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. క్లైమాక్స్‌లో వచ్చే సూర్య పోర్షన్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. రగ్గ్డ్ లుక్, రక్తపాతంతో టెర్రిఫిక్ విలనిజం పండించాడు సూర్య. చేసింది కామియో అయినా మంచి ఇంపాక్ట్ చూపించింది ఆ క్యారెక్టర్. అంతేకాదు.. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతీరోజూ ట్విటర్లో ‘రోలెక్స్’ ‘రోలెక్స్ సర్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఆ లుక్ వెనుకాల ఉంది ఎవరో సోషల్ మీడియాలో రివీల్ చేశాడాయన. చెక్క చివంత వానం, కాట్రూ వెలియిదై, ఇరుది సూట్రూ చిత్రాలకు పని చేసిన మేకప్ ఆర్టిస్ట్ సెరినా టిక్సియెరా.. సూర్య మేకోవర్‌కు కారణం. అందుకే ఆమెతో ఉన్న ఫొటోను షేర్ చేసి కృతజ్ఞతలు తెలియజేశాడు. సూర్య గతంలో 24 సినిమాలో నెగెటివ్ రోల్ చేసినా.. విక్రమ్ రోలెక్స్ మాత్రం టాప్ నాచ్ అనే చెప్పొచ్చు. అందుకే ఆయన అభిమానులు కూడా రోలెక్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఖైదీ-2లో అన్నదమ్ములు కార్తీ-సూర్యల మధ్య పోరు కోసం ఎదురు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Suriya Sivakumar (@actorsuriya) చదవండి: రోలెక్స్‌కు రోలెక్స్ తొడిగిన లోకనాయకుడు -
‘కి’ రోల్స్‌కి సై అంటున్న స్టార్ హీరోలు
హీరో ఎప్పుడూ హీరోగానే చేయాలా? ‘కీ రోల్’లో కనిపించకూడదా? ‘ఎందుకు కూడదూ’ అంటున్నారు కొందరు టాప్ హీరోలు.. అందుకే హీరోగా తమ చేతుల్లో సినిమాలు ఉన్నా కీ రోల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ హీరోల్ చేస్తున్న కీ రోల్ గురించి తెలుసుకుందాం. గతంలో హిందీ చిత్రాల్లో హీరోగా నటించిన నాగార్జున చాలా గ్యాప్ తర్వాత చేసిన హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జునది కీ రోల్. ఇందులో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లు. మూడు భాగాలుగా రానున్న ఈ ‘బ్రహ్మాస్త్ర’ తెలుగులో రాజమౌళి సమర్పణలో ‘బ్రహ్మాస్త్రం’గా వస్తోంది. ‘బ్రహ్మాస్త్రం’ తొలి భాగం ‘బ్రహ్మాస్త్రం: శివ’ ఈ ఏడాది సెప్టెంబరు 9న రిలీజ్ కానుంది. ఇక నాగ్ హీరోగా చేస్తున్న ‘ఘోస్ట్’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు ‘బిగ్ బాస్ నాన్‌స్టాప్’కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జునలానే గతంలో వెంకటేశ్ హిందీ చిత్రాల్లో హీరోగా నటించారు. ‘కబీ ఈద్ కబీ దివాలీ’లో చేస్తున్న కీ రోల్‌తో చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులకు హాయ్ చెబుతున్నారు వెంకటేశ్. సల్మాన్ ఖాన్ హీరోగా ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరు 30న రిలీజ్ కానుంది. ఇక హీరోగా వెంకటేశ్ నటించిన ‘ఎఫ్ 3’ ఈ నెల 27న రిలీజ్ కానుండగా వెంకీ చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ చిత్రీకరణలో ఉంది. మరోవైపు హీరోగా రవితేజ నాలుగు సినిమాలు చేస్తున్నారు. అయినప్పటికీ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో ఓ కీలక పాత్రకు ఊ కొట్టారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. ఇందులో చిరంజీవికి తమ్ముడి పాత్రలో కనిపిస్తారట రవితేజ. ఇదే నిజమైతే... ‘అన్నయ్య’ (2000) చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రను చేసిన రవితేజ మరోసారి చిరూకి తమ్ముడిగా కనిపించినట్లు అవుతుంది. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా బిజీగా ఉన్నారు. కానీ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’లో ఓ స్పెషల్ రోల్ చేశారు. ఈ సీనియర్ హీరోలు ఇలా కీలక పాత్రలు చేస్తుంటే యంగ్ హీరో నాగచైతన్య కూడా ఆ తరహా పాత్రలో కనిపించనున్నారు. హిందీ ‘లాల్‌సింగ్ చద్దా’లో కీలక పాత్ర చేశారు నాగచైతన్య. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్లో అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు మలయాళ స్టార్స్ మమ్ముట్టి, పృథ్వీరాజ్ కూడా కీలక పాత్రలు చేస్తున్నవారి లిస్ట్‌లో ఉన్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’లో మమ్ముట్టి కీ రోల్ చేస్తుండగా, ప్రభాస్ హీరోగా చేస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘సలార్’లో పృథ్వీరాజ్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇక మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ చేస్తున్న తెలుగు స్ట్రయిట్ ఫిల్మ్ ‘సీతారామం’లో సుమంత్ ఓ కీ రోల్ చేశారు. సుమంత్ హీరోగా చేసిన ‘వాల్తేరు శీను’, ‘అహం రీబూట్’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అలాగే మరో అక్కినేని హీరో సుశాంత్ ‘రావణాసుర’ చిత్రంలో కీలక పాత్రకు ఓకే చెప్పారు. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. అటు హిందీలో అక్షయ్ కుమార్ ‘రామ సేతు’లో కీ రోల్ చేశారు సత్యదేవ్. అలాగే చిరంజీవి ‘ఆచార్య’లో అతిథి పాత్ర చేసిన సత్యదేవ్ ‘గాడ్ ఫాదర్’ లోనూ కీ రోల్ చేశారు. సత్యదేవ్ హీరోగా చేసిన ‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’ రిలీజ్‌కి రెడీ అవు తున్నాయి. ఇక హీరోగా ఫామ్‌లోకి వస్తున్న విశ్వక్ సేన్ ‘ముఖచిత్రం’లో కీ రోల్ చేశారు. గంగాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్యరావ్, అయేషా ఖాన్ ముఖ్య తారలు. విశ్వక్ ప్రస్తుతం ‘గామీ’, ‘ఓరి.. దేవుడా’, ‘దాస్‌కీ దమ్కీ’ చిత్రాల్లో హీరోగా చేస్తున్నారు. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు ఇలా ‘కీరోల్స్’ చేయడం మంచి పరిణామం. ఎలానూ ఆ సినిమా హీరోకి ఉన్న స్టార్డమ్ వల్ల ఆ చిత్రంపై అంచనాలు ఉంటాయి. అదే సినిమాలో ఇంకో హీరో కీ రోల్లో కనబడితే అదనపు బలం చేకూరుతుంది. వీరే కాదు.. మరికొందరు హీరోలు కూడా ‘కీ రోల్స్’ చేసేందుకు రెడీ అంటున్నారు. -
కమల్ హాసన్ చిత్రంలో సూర్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Vikram: Lokesh Kanagaraj Confirms Suriya Cameo With Kamal Haasan: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించిన చిత్రం 'విక్రమ్'. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించారు. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం (మే 15) ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2 నిమిషాల 38 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్లో కమల్, విజయ్, ఫాహద్ ఫాజిల్ తమ నటనతో అదరగొట్టారు. కాగా ఈ మూవీలో స్టార్ హీరో సూర్య కూడా నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై డైరెక్టర్ లోకేష్ కనగరాజు స్పందించారు. విక్రమ్ మూవీలో ఈ మూగ్గురు స్టార్ హీరోలతోపాటు సూర్య కూడా నటిస్తున్నాడని స్పష్టం చేశారు. సూర్య ఒక కీలక పాత్రలో అలరించనున్నాడని తెలిపారు. మే 15న చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ట్రైలర్ రిలీజ్‌తో పాటు మూవీ ఆడియో లాంచ్ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలోనే విక్రమ్ చిత్రంలో సూర్య నటిస్తున్నాడని డైరెక్టర్ లోకేష్ తెలిపారు. ఇక ఈ నలుగురు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూస్తే ప్రేక్షకులకు, అభిమానులకు పూనకాలే. -
గురూ.. నాకు కొంచెం తిక్కుంది
సాక్షి, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంలో అగ్ర నటుడు వెంకటేష్ ఓ అతిథి పాత్రలో మెరవబోతున్నాడన్న వార్త అప్పట్లో బాగా వినిపించింది. టైటిల్ కార్డ్స్ లో కూడా వెంకీకి స్పెషల్ థ్యాంక్స్ ఉండటంతో రోల్ ఉంటుందని అంతా భావించారు. కానీ, చిత్రంలో మాత్రం ఆ మెరుపులు లేకుండా పోయాయి. దీంతో ఆ సీన్‌ను కలిపేందుకు అజ్ఞాతవాసి మేకర్లు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. వెంకీ-పవన్ మధ్య నడిచే అ సన్నివేశం కోసం ఇద్దరు స్టార్లు కలిసి డబ్బింగ్ చెప్పటం ఆ వీడియోలో ఉంది. పవన్.. గురువు గారు అంటే.. గారు అక్కర్లేదమ్మా గురూ చాలూ.. అని వెంకీ చెప్పటం... ‘నాకు కొంచెం తిక్కుంది’ అని పవన్ అంటే... ‘దానికో లెక్కుంది’ అని మళ్లీ వెంకీ చెప్పటం ఇలా సాగిపోయిన వీడియో ఫన్నీగా ఉంది. సంక్రాంతి నుంచి ఆ సీన్ చిత్రానికి యాడ్ చేస్తున్నారు. -
పవన్‌తోపాటే అనిరుధ్ కూడా!
సాక్షి, సినిమా : కాస్త ఆలస్యంగానైనా కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తెలుగులో తన డెబ్యూ ఇవ్వబోతున్నాడు. ఏకంగా పవన్ 25వ చిత్రానికే ట్యూన్లు అందించే బంపరాఫర్‌ను కొట్టేశాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెలోడియస్ పాటలతో అజ్ఞాతవాసి ఆల్బమ్‌ను అందంగా తీర్చి దిద్దాడు కూడా. అయితే అజ్ఞాతవాసికి సంగీతం అందించటంతోపాటు మరో అవకాశం కూడా అనిరుధ్ కొట్టేశాడంట. నిన్న సాయంత్రం విడుదలై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది పవర్ స్టార్ పాడిన కొడకా కోటేశ్వర రావు సాంగ్. అందులో పవన్‌తోపాటు అనిరుధ్ కూడా స్టెప్పులేయబోతున్నాడని తెలుస్తోంది. సినిమాలోని ఆ పాట చివర్లో కొద్ది సెకన్లపాటు అనిరుధ్ కూడా కనిపించబోతున్నాడంట. అనిరుధ్‌కి ఇలా స్టార్ల సినిమాల్లో కనిపించటం కొత్తేం కాదు. గతంలో ధనుష్ నటించిన ఓ చిత్రం కోసం అనిరుధ్ సాంగ్‌లో మాస్ స్టెప్పులతో అలరించాడు కూడా. ఇక అజ్ఞాతవాసి విషయానికొస్తే.. టీజర్లతోనే పవన్ రికార్డులు బద్ధలు కొడుతుండగా... ట్రైలర్ ఎలా ఉండబోతుందోనని పీకే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. https://t.co/KjgFD3MHk0 — PK Creative Works (@PKCreativeWorks) 31 December 2017 -
ఇరవయ్యేళ్ల తరువాత అదే పాత్
1997లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన కామెడీ ఎంటర్ టైనర్ జుడ్వా. తెలుగు సూపర్ హిట్ హలో బ్రదర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమాలో సల్మాన్ ప్రేమ్, రాజాగా ద్విపాత్రాభినయం చేశాడు. సాజిద్ నదియావాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వరుణ్ దావన్ హీరోగా రీమేక్ చేశారు. అయితే పూర్తిగా అదే కథతో కాకుండా ఒరిజినల్ లోని కొన్ని సీన్స్ ను మాత్రమే తీసుకొని జుడ్వా 2 తెరకెక్కించారు. జుడ్వా 2 షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా అభిమానుల ఆశలు నిజం చేస్తూ సల్మాన్ డ్యూయల్ రోల్ లో అతిథిగా నటించిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్ ద్వారా రివీల్ చేశాడు హీరో వరుణ్ దావన్. వరుణ్.. ప్రేమ్, రాజాగా రెండు పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో జాక్వలిన్ ఫెర్నాండెజ్, తాప్సీ పన్నులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. Original judwaa meets #judwaa2 @BeingSalmanKhan pic.twitter.com/2cdVcAN3tF — Varun PREM Dhawan (@Varun_dvn) 22 September 2017 -
సల్మాన్ సినిమాలో షారూఖ్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ట్యూబ్ లైట్. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా నిర్మాత, నటుడు సోహైల్ ఖాన్, సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. తన అభిమాన దర్శకుడైన కబీర్ ఖాన్‌తో కలిసి పనిచేయటం చాలా ఆనందంగా ఉందన్నాడు. అదే సమయంలో ఆసక్తికరమైన విషయమొకటి వెల్లడించాడు. సల్మాన్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తున్నాడట. కథను మలుపు తిప్పే ఇంపార్టెంట్ క్యారెక్టర్లో షారూఖ్ కనిపించబోతున్నట్టుగా వెల్లడించాడు సోహైల్. అంతేకాదు ఆ పాత్రకు షారూఖ్ ఇమేజ్ చాలా హెల్ప్ అవుతుందని అందుకే షారూఖ్‌ను ఆ పాత్రకు ఒప్పించినట్టుగా తెలిపాడు. ఈద్ సీజన్లో సూపర్ హిట్ రికార్డ్ ఉన్న సల్మాన్ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడని భావిస్తున్నారు. -
చిరు 151లో మరో సీనియర్ హీరో..?
ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీలో కూడా సత్తా చాటిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను మరింత భారీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాను కూడా చిరు తనయుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. మెగాస్టార్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను 151వ సినిమాగా తెరకెక్కించాలని నిర్ణయించారు. ఇప్పటికే కథా కథనాలు రెడీ అయిన ఈ ప్రాజెక్ట్‌ను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తాడన్న ప్రచారం జరుగుతోంది. చిరు 151వ సినిమాను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న మెగా టీం ఈ సినిమాలో మరో సీనియర్ హీరోతో అతిథి పాత్ర చేయించాలని నిర్ణయించారు. ఖైదీ నంబర్ 150లోనే సీనియర్ హీరో వెంకటేష్ కనిపించాల్సి ఉంది. ఈ సినిమాలో ఒక పాటలో వెంకీ, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్లు చిరుతో కలిసి డ్యాన్స్ చేస్తారని భావించారు., కానీ కుదరలేదు. కానీ చిరు 151లో మాత్రం వెంకీ తప్పకుండా కనిపిస్తాడట. ఇప్పటికే నిర్మాత రామ్ చరణ్, వెంకీతో చర్చించి ఆయన అంగీకారం తీసుకున్నాడట. చిరు, వెంకీల కాంబినేషన్ వెండితెర మీద ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. -
బాహుబలి-2 లో మరో విశేషం
హైదరాబాద్: విశిష్ట దర్శకుడు రాజమౌళి విజువల్ వండర్ బాహుబలికి సంబంధించి ఆసక్తికరమైన వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. బాహుబలి (ది బిగినింగ్) ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన టాలీవుడ్ జక్కన్న బాహుబలి -2 లో మరో విశేషాన్ని జోడించారట. బాహుబలి -2 లో బాలీవుడ్ హీరో అతిధి పాత్రలో అలరించనున్నారట. బాహుబలి-2 మూవీ రిలీజ్ కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న బాహుబలి -2 కి సంబంధించిన ఈ విశేషం ఇపుడు హల్ చల్ చేస్తోంది. ఆజ్ తక్. కాం అందించిన సమాచారం ప్రకారం బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారట. అయితే ఈ వార్తలపై అటు బాహుబలి టీం గానీ, ఇటు షారూక్ కానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బాహుబలి మూవీ ఫస్ట్ పార్ట్ టాలీవుడ్ చరిత్రలోనే కాకుండా ఇండియన్ సెల్యూలాయిడ్‌పై ఓ విజువల్ వండర్‌గా నిలిచిపోయింది. 2015లో కలక్షన్ సునామీ సృష్టించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.600కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీనికి సీక్వెల్ గా రూపొందుతున్న బాహుబలి-2 (కన్‌క్లూజన్) ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఏప్రిల్ 28న ఈ మూవీ థియేటర్లను పలకరించనుంది. మరోవైపు బాహుబలిని మించి మరింత ప్రతిష్టాత్మకంగా బాహుబలి -2 తెరకెక్కిస్తున్నట్టు ఇటీవల రాజమౌళి ప్రకటించి మరింత ఉత్కంఠను రేకెత్తించారు. దీంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న బాహుబలి -2 పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న దానిపై భారీ హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. -
21 ఏళ్ల తరువాత కలిసి నటిస్తున్న ఖాన్లు
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానం కోసం షారూఖ్, సల్మాన్‌లు తెగ పోటిపడుతున్నారు. ప్రస్తుతం కత్తులు దూసుకుంటున్న సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్లు గతంలో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేశారు. చివరగా 1995లో రిలీజ్ అయిన కరణ్ అర్జున్ సినిమాలో అన్నదమ్ములుగా నటించారు ఈ సూపర్ స్టార్స్. ఆ తరువాత వివాదాలతో దూరమైన ఈ ఇద్దరు, ఈ మధ్య అన్ని మర్చిపోయి ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేస్తున్నారు. దీంతో మరోసారి ఈ టాప్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తారన్న టాక్ వినిపించింది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూసల్మాన్, షారూఖ్‌లు కలిసి నటించేందుకు అంగీకరించారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ట్యూబ్ లైట్ సినిమాలో షారూఖ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. అయితే అది కూడా సినిమాను మలుపు తిప్పే కీలక పాత్ర కావటంతో ప్రేక్షకులకు ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమానే అనిపిస్తుందంటున్నారు మేకర్స్. -
ఎమ్.ఎస్.ధోనిలో పాత్రపై చరణ్ క్లారిటీ
ప్రస్తుతం సినీ అభిమానులతో పాటు క్రీడా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఎమ్.ఎస్.ధోని. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై కొద్ది రోజులుగా టాలీవుడ్లో ఓ ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ధోని సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై రామ్ చరణ్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. చరణ్ ఎమ్.ఎస్.ధోని చిత్రంలో నటించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని. అసలు ఆ సినిమాలో నటించాల్సిందిగా చరణ్‌ను ఎవరు అడగలేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో చాలా రోజులుగా వినిపిస్తోన్న ఊహాగానాలకు తెరపడింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాను నిర్మిస్తున్న చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. -
బాలయ్య సినిమాలో భల్లాలదేవ
టాలీవుడ్ యంగ్ జనరేషన్లో విలక్షణ పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రానా. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.., ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా హీరోగానే కాక విలన్ గానూ మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా సత్తా చాటిన రానా, ఆ తరువాత కూడా మరిన్ని విలక్షణ పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే రెండు భారీ చిత్రాల్లో రాయల్ లుక్‌లో కనిపించిన రానా, ఇప్పుడు మరోసినిమాలో రాజు గెటప్‌లో కనిపించనున్నాడు. నందమూరి బాలకృష్ణ వందవ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రంలో రానా కూడా నటిస్తున్నాడట. ఇప్పటికే బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో రెండు సార్లు రాజు పాత్రలో కనిపించిన రానా గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం మరోసారి అదే తరహా పాత్రలో నటించనున్నాడు. గతంలో క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన కృష్ణంవందే జగద్గురుమ్ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా, ఆ నమ్మకంతోనే మరోసారి క్రిష్‌తో కలిసి పనిచేయడానికి అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. -
అతిథి పాత్రలో మెరవనున్న సునీల్!
చెన్నై: కమెడియన్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం హీరోగా అదరగొడుతున్న సునీల్.. తన తదుపరి చిత్రంలో అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నాడు. మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా నటించిన 'ఈడోరకం ఆడోరకం' సినిమాలో సునీల్ ఒక గెస్ట్ రోల్లో నటించాడని ఈ సినిమాకి దర్శకత్వం వహించిన జీ నాగేశ్వర రావు తెలిపారు. ఈ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్‌లో కూడా సునీల్ తళుక్కుమంటాడట. ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో సోనారికా భండోరియా, హెబ్బా పటేల్‌లు కథానాయికలుగా నటించారు. -
బాలయ్య మాట కాదనలేకపోయిన నయనతార
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డిక్టేటర్ సినిమా రోజుకో వార్తతో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అంటూ ప్రకటించేసిన చిత్రయూనిట్ అందుకు తగ్గట్టుగా శరవేగంగా షూటింగ్ పనులు కానిచ్చేస్తోంది. బాలయ్యకు జోడిగా అంజలి, సోనాల్ చౌహాన్లు నటిస్తున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ అద్దడానికి మరో భామ రెడీ అవుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలయ్యతో రెండు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న నయనతార డిక్టేటర్ సినిమాలో నటించనుందట. అయితే ఈ సినిమాలో నయన్ చేసేది హీరోయిన్ క్యారెక్టర్ కాదన్న టాక్ వినిపిస్తోంది. కేవలం రెండు మూడు నిమిషాలు మాత్రమే కనిపించే, ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం నయన్‌ను ఎంపిక చేశారు. గతంలో బాలయ్య సరసన నయనతార నటించిన రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధించటంతో సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. కోలీవుడ్‌లో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నయన్‌ను, స్వయంగా బాలయ్య ఫోన్ చేసి సినిమా చేయాలని కోరాడట. దీంతో కాదనలేకపోయిన నయన్ రెండు రోజుల పాటు డిక్టేటర్ సినిమాకు డేట్స్ కేటాయించింది. బాలయ్య 99వ చిత్రంగా భారీగా తెరకెక్కుతున్న డిక్టేటర్ సినిమాకు శ్రీవాస్ దర్శకుడు. ఈ సినిమాలో బాలయ్య న్యూ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించనున్నాడు. బాలయ్యకు మంచి రికార్డ్ ఉన్న సంక్రాంతి సీజన్లో ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో మరోసారి చరిత్ర తిరగరాస్తాడని నమ్మకంగా ఉన్నారు నందమూరి ఫ్యాన్స్. -
సరికొత్త పాత్రలో రాజమౌళి
హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి నటుడిగా అవతారం ఎత్తుతున్నారా ? అది అతిథి పాత్రలో అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ వర్గాలు. ప్రముఖ దర్శకుడు వీర శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మన కుర్రాళ్లే'. ఆ చిత్రంలో రాజమౌళి అతిథి పాత్రలో నటించనున్నారని సమాచారం. ఆ చిత్రంలో రాజమౌళి నటిస్తున్న పాత్ర ఆ చిత్రానికి అత్యంత కీలకమైందని ఆ చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. మన కుర్రోళ్లు చిత్రం అరవింద్ కృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే తన దర్శకత్వంలో మహా బిజీగా ఉన్న రాజమళి... అతిథి పాత్రలో నటించడం ద్వారా మరింత బిజీ అయ్యే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
సినిమా తారగా తమన్నా!
దక్షిణ, ఉత్తరాది భాషల్లో సినిమాలు చేస్తూ.. స్టార్‌గా దూసుకెళుతున్నారు తమన్నా. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదారు సినిమాల వరకు ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్నప్పటికీ ఇటీవల ఓ అతిథి పాత్రకు పచ్చజెండా ఊపారు. దాన్నిబట్టి ఆ పాత్ర తమన్నాకి ఎంత నచ్చి ఉంటుందో ఊహించవచ్చు. ఇంతకీ ఆమె ఏ సినిమాలో అతిథి పాత్ర చేశారనే విషయానికొస్తే.. ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా తమిళంలో ‘నన్బేన్డా’ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులోనే తమన్నా ఈ ప్రత్యేక పాత్ర చేశారు. జగదీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ సినీ తార పాత్ర ఉందట. ఈ పాత్రను ఎవరైనా ప్రముఖ తారతో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు భావించడం, చివరికి తమన్నా అయితే కరెక్ట్‌గా ఉంటుందని అనుకోవడం జరిగిందని కోలీవుడ్ టాక్. ఈ పాత్రకు అడగ్గానే తమన్నా డైరీ పరిశీలించి, డేట్ ఇచ్చేశారు. ఇటీవల చెన్నయ్‌లో తను పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించారని వినికిడి. ఒకే ఒక్క రోజులోనే ఈ అతిథి పాత్ర తాలూకు షూటింగ్ పూర్తయ్యిందని తెలిసింది. నిజజీవిత పాత్ర చేసే అవకాశం రావడం, షూటింగ్‌కి ఒకే ఒక్క రోజే సరిపోవడంవల్లే తమన్నా ఈ పాత్ర అంగీకరించి ఉంటారని ఊహించవచ్చు. ఆమె పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. సో.. పారితోషికం భారీగానే పుచ్చుకుని ఉంటారని ఊహించవచ్చు.