బాలయ్య మాట కాదనలేకపోయిన నయనతార | Nayanatara cameo in Balakrishna Dictator | Sakshi
Sakshi News home page

బాలయ్య మాట కాదనలేకపోయిన నయనతార

Published Sat, Dec 12 2015 11:00 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలయ్య మాట కాదనలేకపోయిన నయనతార - Sakshi

బాలయ్య మాట కాదనలేకపోయిన నయనతార

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డిక్టేటర్ సినిమా రోజుకో వార్తతో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అంటూ ప్రకటించేసిన చిత్రయూనిట్ అందుకు తగ్గట్టుగా శరవేగంగా షూటింగ్ పనులు కానిచ్చేస్తోంది. బాలయ్యకు జోడిగా అంజలి, సోనాల్ చౌహాన్లు నటిస్తున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ అద్దడానికి మరో భామ రెడీ అవుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలయ్యతో రెండు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న నయనతార డిక్టేటర్ సినిమాలో నటించనుందట.

అయితే ఈ సినిమాలో నయన్ చేసేది హీరోయిన్ క్యారెక్టర్ కాదన్న టాక్ వినిపిస్తోంది. కేవలం రెండు మూడు నిమిషాలు మాత్రమే కనిపించే, ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం నయన్ను ఎంపిక చేశారు. గతంలో బాలయ్య సరసన నయనతార నటించిన రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధించటంతో సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. కోలీవుడ్లో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నయన్ను, స్వయంగా బాలయ్య ఫోన్ చేసి సినిమా చేయాలని కోరాడట. దీంతో కాదనలేకపోయిన నయన్ రెండు రోజుల పాటు డిక్టేటర్ సినిమాకు డేట్స్ కేటాయించింది.

బాలయ్య 99వ చిత్రంగా భారీగా తెరకెక్కుతున్న డిక్టేటర్ సినిమాకు శ్రీవాస్ దర్శకుడు. ఈ సినిమాలో బాలయ్య న్యూ లుక్లో స్టైలిష్గా కనిపించనున్నాడు. బాలయ్యకు మంచి రికార్డ్ ఉన్న సంక్రాంతి సీజన్లో ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో మరోసారి చరిత్ర తిరగరాస్తాడని నమ్మకంగా ఉన్నారు నందమూరి ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement