నయనతార కాదు ముమైత్ ఖాన్ | mumaith Khan item song in balakrishna dictator | Sakshi
Sakshi News home page

నయనతార కాదు ముమైత్ ఖాన్

Published Wed, Dec 23 2015 1:22 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

నయనతార కాదు ముమైత్ ఖాన్ - Sakshi

నయనతార కాదు ముమైత్ ఖాన్

సంక్రాంతి కానుకగా రిలీజ్కు రెడీ అవుతున్న నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ ఎంటర్టైనర్ డిక్టేటర్. బాలయ్య స్టైలిష్ డాన్గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఒక్క పాట మాత్రం బ్యాలెన్స్ ఉంది. భారీగా తెరకెక్కిస్తున్న ఈ పాట కోసం ముందుగా స్టార్ హీరోయిన్లను ప్రయత్నించారు చిత్రయూనిట్. బాలయ్య సరసన సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న నయనతార, ప్రస్తుతం టాలీవుడ్లో రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఇలియానా లాంటి తారలను ప్రయత్నించి ఫైనల్గా ముమైత్ ఖాన్ను ఫిక్స్ అయ్యారట.

డిసెంబర్ 23 నుంచి హైదరాబాద్లో వేసిన సెట్లో ఈ పాట చిత్రీకరణ జరగనుంది. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేస్తాం అంటున్నారు చిత్రయూనిట్. బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్లు నటిస్తున్న ఈ సినిమాను, ఈరోస్ ఇంటర్ నేషనల్తో కలిసి దర్శకుడు శ్రీవాస్ నిర్మిస్తున్నాడు. కోనవెంకట్, గోపి మోహన్లు కథ, మాటలు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement