సినిమా తారగా తమన్నా! | A cameo for Udhay by Tamannaah | Sakshi
Sakshi News home page

సినిమా తారగా తమన్నా!

Published Sun, May 4 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

సినిమా తారగా తమన్నా!

సినిమా తారగా తమన్నా!

దక్షిణ, ఉత్తరాది భాషల్లో సినిమాలు చేస్తూ.. స్టార్‌గా దూసుకెళుతున్నారు తమన్నా. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదారు సినిమాల వరకు ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్నప్పటికీ ఇటీవల ఓ అతిథి పాత్రకు పచ్చజెండా ఊపారు. దాన్నిబట్టి ఆ పాత్ర తమన్నాకి ఎంత నచ్చి ఉంటుందో ఊహించవచ్చు. ఇంతకీ ఆమె ఏ సినిమాలో అతిథి పాత్ర చేశారనే విషయానికొస్తే.. ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా తమిళంలో ‘నన్‌బేన్డా’ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులోనే తమన్నా ఈ ప్రత్యేక పాత్ర చేశారు. జగదీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ సినీ తార పాత్ర ఉందట.
 
  ఈ పాత్రను ఎవరైనా ప్రముఖ తారతో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు భావించడం, చివరికి తమన్నా అయితే కరెక్ట్‌గా ఉంటుందని అనుకోవడం జరిగిందని కోలీవుడ్ టాక్. ఈ పాత్రకు అడగ్గానే తమన్నా డైరీ పరిశీలించి, డేట్ ఇచ్చేశారు. ఇటీవల చెన్నయ్‌లో తను పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించారని వినికిడి. ఒకే ఒక్క రోజులోనే ఈ అతిథి పాత్ర తాలూకు షూటింగ్ పూర్తయ్యిందని తెలిసింది. నిజజీవిత పాత్ర చేసే అవకాశం రావడం, షూటింగ్‌కి ఒకే ఒక్క రోజే సరిపోవడంవల్లే తమన్నా ఈ పాత్ర అంగీకరించి ఉంటారని ఊహించవచ్చు. ఆమె పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. సో.. పారితోషికం భారీగానే పుచ్చుకుని ఉంటారని ఊహించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement