బాహుబలి-2 లో మరో విశేషం | Bollywood superstar Shah Rukh Khan has been roped in to play a cameo in the film | Sakshi
Sakshi News home page

బాహుబలి-2 లో మరో విశేషం

Published Mon, Feb 13 2017 4:37 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

బాహుబలి-2 లో మరో విశేషం - Sakshi

బాహుబలి-2 లో మరో విశేషం

హైదరాబాద్‌:  విశిష్ట దర్శకుడు రాజమౌళి విజువల్‌  వండర్‌ బాహుబలికి సంబంధించి ఆసక్తికరమైన వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది.    బాహుబలి (ది బిగినింగ్‌) ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన  టాలీవుడ్‌ జక్కన్న బాహుబలి -2 లో మరో విశేషాన్ని జోడించారట.  బాహుబలి -2 లో బాలీవుడ్‌ హీరో  అతిధి  పాత్రలో అలరించనున్నారట. 

బాహుబలి-2 మూవీ రిలీజ్ కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న బాహుబలి -2 కి  సంబంధించిన  ఈ విశేషం  ఇపుడు హల్‌ చల్‌ చేస్తోంది.   ఆజ్‌ తక్‌. కాం అందించిన సమాచారం ప్రకారం  బాలీవుడ్ సూపర్‌స్టార్‌ షారూఖ్ ఖాన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారట.  అయితే ఈ వార్తలపై అటు బాహుబలి టీం గానీ, ఇటు షారూక్‌ కానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  

బాహుబలి మూవీ ఫస్ట్ పార్ట్ టాలీవుడ్ చరిత్రలోనే కాకుండా ఇండియన్ సెల్యూలాయిడ్‌పై ఓ విజువల్ వండర్‌గా నిలిచిపోయింది.  2015లో  కలక్షన్‌ సునామీ సృష్టించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.600కోట్లకు పైగా  వసూళ్లను రాబట్టింది. దీనికి  సీక్వెల్ గా రూపొందుతున్న బాహుబలి-2 (కన్‌క్లూజన్‌) ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్  పనులను శరవేగంగా  పూర్తి చేసుకుంటోంది.   ఏప్రిల్‌  28న ఈ మూవీ థియేటర్లను పలకరించనుంది.  

మరోవైపు బాహుబలిని మించి మరింత  ప్రతిష్టాత్మకంగా బాహుబలి -2 తెరకెక్కిస్తున్నట్టు  ఇటీవల రాజమౌళి ప్రకటించి  మరింత  ఉత‍్కంఠను రేకెత్తించారు.  దీంతో ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌ లో ఉన్న  బాహుబలి -2 పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా  కట్టప్ప బాహుబలిని ఎందుకు  చంపాడన్న  దానిపై భారీ హైప్‌  క్రియేట్‌ అయిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement