సాక్షి ముంబై: టైమ్ మ్యాగజైన్ 2023లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్, టాలీవుడ్ దర్శక దిగ్గజం, ఆర్‌ఆర్‌ఆర్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి చోటు సంపాదించారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, బిలియనీర్ ఎలాన్ మస్క్,హాలీవుడ్ దిగ్గజాలు ఏంజెలా బాసెట్, మైఖేల్ బి జోర్డాన్ , కోలిన్ ఫారెల్ లాంటి ప్రముఖుల ఎలైట్ వార్షిక జాబితాలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుండి వీరు మాత్రమే చోటు దక్కించుకోవడం విశేషం. (రిలయన్స్ ఫౌండర్ అంబానీ: తొలి జీతం రూ.300, ఆసక్తికర విషయాలు)
గత వారం టైమ్ మ్యాగజైన్ ఆన్‌లైన్ పోల్‌లో షారూక్ టాప్‌లో నిలిచారు. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల స్థానానికి నిర్వహించిన ఈ పోల్‌లో లియోనెల్ మెస్సీ, ప్రిన్స్ విలియం, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ వంటి వారిని వెనక్కి నెట్టి మరీ షారూక్ టాప్‌లో నిలిచారు. (టాటా, బిర్లా సక్సెస్ సీక్రెట్ ఇదే? అనంత్, రాధికా మర్చంట్ అడోరబుల్ వీడియో వైరల్)
ఆర్‌ఆర్‌ఆర్ సంచలనం తరువాత ఎస్‌ఎస్ రాజమౌళి ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రముఖంగా నిలిచారు. డోజా క్యాట్, బెల్లా హడిద్, సామ్ ఆల్ట్‌మాన్ వంటి వారితో పాటు పయనీర్స్ విభాగంలో చోటు దక్కించుకున్నారు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ)
కాగా బాలీవుడ్ పఠాన్ మూవీ ఫారూక్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇక సంచలనాలునమోదు చేసిన టాలీవుడ్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్ గత ఏడాది అత్యధిక వసూళ్లను సాధించడమేకాదు, ఆస్కార్‌తో సహా అనేక అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment