ఎస్‌ఆర్‌కె సినిమాకి ఎస్‌? | Shah Rukh Khan and Samantha Ruth Prabhu come on board with Rajkumar Hirani untitled patriotic film | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌కె సినిమాకి ఎస్‌?

Published Sun, Jun 23 2024 12:32 AM | Last Updated on Sun, Jun 23 2024 12:32 AM

Shah Rukh Khan and Samantha Ruth Prabhu come on board with Rajkumar Hirani untitled patriotic film

షారుక్‌ ఖాన్‌ని బాలీవుడ్‌లో ఎస్‌ఆర్‌కె అని పిలుస్తాంటారని అందరికీ తెలిసిన విషయమే. ఎస్‌ఆర్‌కే సరసన సమంత హీరోయిన్‌గా నటించనున్నారన్నది తాజా టాక్‌. ఈ చిత్రంలో నటించడానికి సమంత దాదాపు ‘ఎస్‌’ చెప్పారట. రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో ఈ సినిమా పోందనుందని టాక్‌.

దేశభక్తి నేపథ్యంలో యాక్షన్‌ అడ్వంచరస్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ఆగస్ట్‌ 15న ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే చాన్స్‌ ఉందని భోగట్టా. కాగా... ఇప్పటికే సమంత ఫలానా హిందీ చిత్రంలో నటించనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అవేవీ నిజం కాలేదు. కానీ ఎస్‌ఆర్‌కె–సమంత కాంబినేషన్‌ సినిమా నిజం అవుతుందని హిందీ చిత్రసీమ అంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement