most influential people
-
టైమ్స్ మాగజైన్ 100: ఈ రంగం నుంచి వీరిద్దరే, ఆ సూపర్స్టార్లు ఎవరంటే?
సాక్షి ముంబై: టైమ్ మ్యాగజైన్ 2023లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్, టాలీవుడ్ దర్శక దిగ్గజం, ఆర్ఆర్ఆర్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చోటు సంపాదించారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, బిలియనీర్ ఎలాన్ మస్క్,హాలీవుడ్ దిగ్గజాలు ఏంజెలా బాసెట్, మైఖేల్ బి జోర్డాన్ , కోలిన్ ఫారెల్ లాంటి ప్రముఖుల ఎలైట్ వార్షిక జాబితాలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుండి వీరు మాత్రమే చోటు దక్కించుకోవడం విశేషం. (రిలయన్స్ ఫౌండర్ అంబానీ: తొలి జీతం రూ.300, ఆసక్తికర విషయాలు) గత వారం టైమ్ మ్యాగజైన్ ఆన్లైన్ పోల్‌లో షారూక్ టాప్‌లో నిలిచారు. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల స్థానానికి నిర్వహించిన ఈ పోల్‌లో లియోనెల్ మెస్సీ, ప్రిన్స్ విలియం, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ వంటి వారిని వెనక్కి నెట్టి మరీ షారూక్ టాప్‌లో నిలిచారు. (టాటా, బిర్లా సక్సెస్ సీక్రెట్ ఇదే? అనంత్, రాధికా మర్చంట్ అడోరబుల్ వీడియో వైరల్) ఆర్ఆర్ఆర్ సంచలనం తరువాత ఎస్ఎస్ రాజమౌళి ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రముఖంగా నిలిచారు. డోజా క్యాట్, బెల్లా హడిద్, సామ్ ఆల్ట్మాన్ వంటి వారితో పాటు పయనీర్స్ విభాగంలో చోటు దక్కించుకున్నారు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) కాగా బాలీవుడ్ పఠాన్ మూవీ ఫారూక్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇక సంచలనాలునమోదు చేసిన టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ గత ఏడాది అత్యధిక వసూళ్లను సాధించడమేకాదు, ఆస్కార్‌తో సహా అనేక అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
సచిన్‌కు మరో అరుదైన గౌరవం.. విశ్వవ్యాప్త సర్వేలో మోదీ తర్వాతి స్థానం
Tendulkar Entered Brandwatchs 50 Most Influential People Globally On Twitter: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ట్విటర్ వేదికగా బ్రాండ్‌వాచ్ అనే సంస్థ నిర్వహించిన విశ్వవ్యాప్త వార్షిక(2021) పరిశోధనలో అత్యంత ప్రభావవంతమైన 50 మంది వ్యక్తుల్లో స్థానం దక్కించుకున్నాడు. ఈ జాబితాలో కేవలం ఇద్దరు భారతీయులకు మాత్రమే స్థానం లభించగా.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండో స్థానంలో, సచిన్ 35వ స్థానంలో నిలిచారు. మోదీ, సచిన్‌లు అమెరికన్ నటులు డ్వేన్ జాన్సన్(ద రాక్), లియోనార్డో డికాప్రియో, అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా కంటే ముందు వరుసలో ఉన్నారు. ఈ జాబితాలో అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే, సచిన్.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా అనంతరం ఎంపీగా, దశాబ్దానికి పైగా యునిసెఫ్ దక్షిణాసియా అంబాసిడర్‌గా పలు గౌరవాలను దక్కించుకున్న సంగతి తెలసిందే. చదవండి: 'ఆ విషయంలో' రవిశాస్త్రి వ్యాఖ్యలను సమర్ధించిన పాకిస్థాన్ కెప్టెన్ -
మెగా కోడలు ఉపాసనకు అరుదైన గౌరవం
మెగా కోడలు, రామ్‌చరణ్ భార్య ఉపాసన కామినేనికి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఉపాసన ఎంపికైంది. ఎఫ్ఎల్ఓ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) మహిళా విభాగం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ నుంచి ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఉపాసనను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా 'తన భార్య, తల్లి, సోదరి, కూతురు, కోడలు, మనవరాలి జీవితాల్లో వెలుగులు నింపే ప్రతి పురుషుడికి ఈ అవార్డును అంకితమిస్తున్నాను' అని ఉపాసన పేర్కొంది. పురుషుల మద్దతు వుండే మహిళలు చాలా సురక్షితంగా, సానుకూల దృక్పథంతో, విజయాలు సాధిస్తూ ఉంటారు అని నేను నమ్ముతాను' అని ఉపాపన ట్వీట్ చేసింది. కాగా కాగా ఉపాసన కొణిదెల... రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి : (చెర్రి, నేను ఎప్పుడు గొడవ పడుతుంటాం: ఉపాసన) (అందుకే విడాకులు రద్దు చేసుకుంటున్నాను: నటుడి భార్య) -
టైమ్ జాబితాలో మోదీ, పేటీఎం విజయ్ శర్మ
-
టైమ్ జాబితాలో మోదీ, పేటీఎం విజయ్ శర్మ
టైమ్ పత్రిక ప్రతియేటా ప్రకటించే అత్యంత ప్రభావశీలురైన వంద మంది వ్యక్తులలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మలకు స్థానం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని థెరెసా మే కూడా ఈ జాబితాలో ఉన్నారు. డోనాల్డ్ ట్రంప్ ఇంకా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం పొందుతారా లేదా అన్నది కూడా ఇంకా నిర్ధారణ కాకముందే 2014 మే నెలలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి మోదీ ప్రధానమంత్రి అయ్యారని ఆ ప్రకటనలో చెప్పారు. దాదాపు మూడేళ్ల తర్వాత కూడా మోదీ ప్రభ ఏమాత్రం తగ్గలేదని, ప్రజలను సమ్మోహితులను చేయడంలో ఆయన అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘనవిజయాన్ని కూడా అందులో ప్రస్తావించారు. ఇక పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ అయితే భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపిస్తున్నారని చెప్పారు. నవంబర్ నెలలో భారత ప్రభుత్వం ఉన్నట్టుండి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు పేటీఎం విజయ్ ఆ అవకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకున్నారని తెలిపారు. 2016 ప్రారంభం నాటికి పేటీఎంకు 12.2 కోట్ల మంది యూజర్లుంటే, సంవత్సరాంతం నాటికి వారి సంఖ్య 17.7 కోట్లకు చేరుకుందని వివరించారు. చిన్న పల్లెటూరి నుంచి వచ్చి హిందీ మీడియంలో చదువుకుని దేశంలో డిజిటల్ ఎకానమీతో సంచలనం సృష్టించారన్నారు. టైమ్స్ పత్రిక ప్రతియేటా విడుదల చేసే 100 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులలో కళాకారులు, వ్యాపారవేత్తలు, నాయకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందినవారు ఉంటారు.