FICCI Awards 2021: Upasana Kamineni Has Been Awarded As Influential Award 2021 - Sakshi
Sakshi News home page

అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఎంపిక చేసిన ఫిక్కో

Published Wed, Mar 10 2021 2:01 PM | Last Updated on Wed, Mar 10 2021 3:51 PM

Upasana Has Been Awarded As Influential Women 2021 - Sakshi

మెగా కోడలు, రామ్‌చరణ్‌ భార్య  ఉపాసన కామినేనికి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఉపాసన ఎంపికైంది. ఎఫ్ఎల్ఓ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) మహిళా విభాగం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ నుంచి ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఉపాసనను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా 'త‌న భార్య‌, త‌ల్లి, సోద‌రి, కూతురు, కోడ‌లు, మ‌న‌వ‌రాలి జీవితాల్లో వెలుగులు నింపే ప్ర‌తి పురుషుడికి ఈ అవార్డును అంకిత‌మిస్తున్నాను' అని ఉపాసన పేర్కొంది.

పురుషుల మ‌ద్ద‌తు వుండే మ‌హిళలు చాలా సుర‌క్షితంగా, సానుకూల దృక్ప‌థంతో, విజయాలు సాధిస్తూ ఉంటారు అని నేను న‌మ్ముతాను' అని ఉపాప‌న ట్వీట్ చేసింది. కాగా కాగా ఉపాసన కొణిదెల... రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. 

చదవండి : (చెర్రి, నేను ఎప్పుడు గొడవ పడుతుంటాం: ఉపాసన)
(అందుకే విడాకులు రద్దు చేసుకుంటున్నాను: నటుడి భార్య)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement