చిరు 151లో మరో సీనియర్ హీరో..? | Venkatesh Cameo In Chiranjeevi Uyyalavada Narasimha Reddy | Sakshi
Sakshi News home page

చిరు 151లో మరో సీనియర్ హీరో..?

Published Tue, Apr 4 2017 10:24 AM | Last Updated on Thu, Sep 19 2019 8:25 PM

చిరు 151లో మరో సీనియర్ హీరో..? - Sakshi

చిరు 151లో మరో సీనియర్ హీరో..?

ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీలో కూడా సత్తా చాటిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను మరింత భారీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాను కూడా చిరు తనయుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. మెగాస్టార్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను 151వ సినిమాగా తెరకెక్కించాలని నిర్ణయించారు. ఇప్పటికే కథా కథనాలు రెడీ అయిన ఈ ప్రాజెక్ట్ను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తాడన్న ప్రచారం జరుగుతోంది.

చిరు 151వ సినిమాను మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్న మెగా టీం ఈ సినిమాలో మరో సీనియర్ హీరోతో అతిథి పాత్ర చేయించాలని నిర్ణయించారు. ఖైదీ నంబర్ 150లోనే సీనియర్ హీరో వెంకటేష్ కనిపించాల్సి ఉంది. ఈ సినిమాలో ఒక పాటలో వెంకీ, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్లు చిరుతో కలిసి డ్యాన్స్ చేస్తారని భావించారు., కానీ కుదరలేదు. కానీ చిరు 151లో మాత్రం వెంకీ తప్పకుండా కనిపిస్తాడట. ఇప్పటికే నిర్మాత రామ్ చరణ్, వెంకీతో చర్చించి ఆయన అంగీకారం తీసుకున్నాడట. చిరు, వెంకీల కాంబినేషన్ వెండితెర మీద ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement