సై రా.. మెగా లుక్ వచ్చేసింది..! | Chiranjeevi 151st movie First look | Sakshi
Sakshi News home page

సై రా.. మెగా లుక్ వచ్చేసింది..!

Published Tue, Aug 22 2017 12:23 PM | Last Updated on Thu, Sep 19 2019 8:25 PM

Chiranjeevi 151st movie First look

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందుతున్న ఈ సినిమాకు సై రా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రవివర్మన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, సీనియర్ హీరో జగపతి బాబు, సాండల్ వుడ్ స్టార్ సుధీప్, కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా లేడీ సూపర్ స్టార్ నయనతార చిరుకు జోడిగా నటిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

 ఈ సినిమాలో పోరాటయోధుడిగా కనిపించేందుకు చిరు దాదాపు ఆరు నెలలుగా మేకోవర్ అవుతున్నాడు. స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ చాలా కాలంగా ఈ కథ మీద కసరత్తులు చేస్తుండగా ధృవ సక్సెస్ తరువాత సురేందర్ రెడ్డిని దర్శకుడిగా ఫైనల్ చేశారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించగా అభిమానుల కోసం ఈ రోజు సాయంత్రం ఓ మెగా వేడుకను నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement