ఎమ్.ఎస్.ధోనిలో పాత్రపై చరణ్ క్లారిటీ | No cameo for ram charan in ms dhoni | Sakshi
Sakshi News home page

ఎమ్.ఎస్.ధోనిలో పాత్రపై చరణ్ క్లారిటీ

Published Thu, Sep 29 2016 1:22 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

ఎమ్.ఎస్.ధోనిలో పాత్రపై చరణ్ క్లారిటీ

ఎమ్.ఎస్.ధోనిలో పాత్రపై చరణ్ క్లారిటీ

ప్రస్తుతం సినీ అభిమానులతో పాటు క్రీడా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఎమ్.ఎస్.ధోని. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై కొద్ది రోజులుగా టాలీవుడ్లో ఓ ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ధోని సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి.

అయితే ఈ వార్తలపై రామ్ చరణ్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. చరణ్ ఎమ్.ఎస్.ధోని చిత్రంలో నటించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని. అసలు ఆ సినిమాలో నటించాల్సిందిగా చరణ్ను ఎవరు అడగలేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో చాలా రోజులుగా వినిపిస్తోన్న ఊహాగానాలకు తెరపడింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాను నిర్మిస్తున్న చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement