బాలయ్య సినిమాలో భల్లాలదేవ | Rana cameo in bala krishna 100th film | Sakshi
Sakshi News home page

బాలయ్య సినిమాలో భల్లాలదేవ

Published Thu, May 19 2016 9:41 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

బాలయ్య సినిమాలో భల్లాలదేవ - Sakshi

బాలయ్య సినిమాలో భల్లాలదేవ

టాలీవుడ్ యంగ్ జనరేషన్లో విలక్షణ పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రానా. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.., ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా హీరోగానే కాక విలన్ గానూ మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా సత్తా చాటిన రానా, ఆ తరువాత కూడా మరిన్ని విలక్షణ పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే రెండు భారీ చిత్రాల్లో రాయల్ లుక్లో కనిపించిన రానా, ఇప్పుడు మరోసినిమాలో రాజు గెటప్లో కనిపించనున్నాడు.

నందమూరి బాలకృష్ణ వందవ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రంలో రానా కూడా నటిస్తున్నాడట. ఇప్పటికే బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో రెండు సార్లు రాజు పాత్రలో కనిపించిన రానా గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం మరోసారి అదే తరహా పాత్రలో నటించనున్నాడు. గతంలో క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన కృష్ణంవందే జగద్గురుమ్ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా, ఆ నమ్మకంతోనే మరోసారి క్రిష్తో కలిసి పనిచేయడానికి అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement