ఈ ఏడాది సౌత్ సినిమాలు వందల కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంటే బాలీవుడ్ సినిమాలు మాత్రం తడబడుతున్నాయి. ఈ ఏడాది రిలీజైన ఒకటి రెండు సినిమాలు తప్ప ఘనవిజయాలు నమోదు చేసిన బాలీవుడ్ సినిమాలు పెద్దగా లేవు. ఆ లోటును బర్తీ చేస్తూ రీమేక్ గా తెరకెక్కిన జుడ్వా 2 భారీ వసూళ్లు సాధిస్తోంది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ వంద కోట్ల క్లబ్ లో చేరేందుకు దూసుకుపోతోంది.
వరుణ్ ధావన్, జాక్వలిస్ ఫెర్నాండెజ్, తాప్సీ పన్ను లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా 1997లో ఘనవిజయం సాధించిన సల్మాణ్ ఖాన్ జుడ్వాకు రీమేక్ గా తెరకెక్కింది. వరుణ్ ధావన్ ద్విపాత్రాభినయం చేసిన జుడ్వా 2లో సల్మాన్ కూడా డ్యూయల్ లో రోల్ కనిపించాడు. వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన జుడ్వా 2కు ఈ వారం కూడా గట్టి పోటి లేకపోవటంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment