సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ వరుసగా మరో భారీ విజయాన్ని అందుకున్నాడు. 'బద్రీనాథ్‌కి దుల్హానియా' సినిమాతో వందకోట్ల క్లబ్‌లోకి ఎంటరైన ఈ యువ హీరో ఈ ఏడాది 'జుడ్వా-2' భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటికే వందకోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద బలంగా కలెక్షన్స్ రాబడుతోంది.
కవలల నేపథ్యంతో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన జుడ్వా 2లో ద్విపాత్రభినయం చేసిన వరుణ్ సరసన జాక్వలిన్ ఫెర్నాండెజ్, తాప్సీ పన్ను హీరోయిన్లుగా నటించారు. 1997లో ఘనవిజయం సాధించిన సల్మాన్ ఖాన్ జుడ్వాకు ఇది రీమేక్. ఈ సినిమాలో సల్మాన్ కూడా డ్యూయల్ లో రోల్ కనిపించి అలరించాడు. వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన జుడ్వా 2 రెండోవారంలో గట్టిగా వసూళ్లు రాబడుతోంది. సోమవారం నాటికి ఈ సినిమా దేశంలో 119.9 కోట్లు వసూలు చేసింది. తద్వారా వరుణ్ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్ సినిమాగా 'జుడ్వా-2' నిలిచింది. వరుణ్ గత సినిమా 'బద్రీనాథ్‌కి దుల్హానియా' మొత్తంగా రూ. 116.60 కోట్లు వసూలు చేయగా.. తాజా సినిమా ఆ రికార్డును అధిగమించింది. అంతేకాకుండా బాలీవుడ్‌లో ఈ ఏడాది చెప్పుకోదగ్గ బిగ్గెస్ట్ హిట్స్ లేవని చెప్పాలి. ఆ లోటును భర్తీచేస్తూ.. ఈ ఏడాది మాసివ్ హిట్‌గా 'జుడ్వా-2' నిలిచిందని విశ్లేషకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment