
టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha Ruthprabhu) నటించిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ (Citadel: Honey Bunny). ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్‌లో సత్తా చాటింది. బెస్ట్ వెబ్ సిరీస్‌గా అవార్ట్‌ను దక్కించుకుంది.
ఈ సందర్భంగా హనీ బన్నీ డైరెక్టర్ డీకే సంతోషం వ్యక్తం చేశారు. ఈ వెబ్‌సిరీస్ తీయడం వెనుక చాలా మంది కష్టముందని.. అవార్డుల రూపంలో మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి మంచి టాక్ అయితే వచ్చింది. ఇందులో సమంత, వరుణ్ ధావన్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్ రావడంతో సమంత ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
డేటింగ్ రూమర్స్..
కాగా.. సమంత ఇటీవల పికిల్ బాల్ లీగ్‌లో మెరిసింది. చెన్నైలో జరిగిన ఈవెంట్‌కు డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి హాజరైంది. ఇద్దరూ కలిసి పికిల్ బాల్ కోర్టులో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ వినిపించాయి. రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment