‘సుశాంత్ కోసం త‌న జీవితాన్నే ఇచ్చేసింది’ | Ankita Lokhande Almost Gave Up Her Career For Sushant Says Sandip Ssingh | Sakshi
Sakshi News home page

‘సుశాంత్ కోసం త‌న కెరీర్‌నే వ‌దులుకుంది’

Published Sat, Jun 27 2020 9:00 PM | Last Updated on Sat, Jun 27 2020 9:08 PM

Ankita Lokhande Almost Gave Up Her Career For Sushant Says Sandip Ssingh - Sakshi

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం మాజీ ప్రేయ‌సి అంకితా లోఖండే త‌న జీవితాన్ని అంకితం చేసింద‌ని సుశాంత్ స్నేహితుడు సందీప్ సింగ్ అన్నారు. అంకితా మాత్ర‌మే సుశాంత్‌ను నిజంగా అర్థం చేసుకుంద‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు. అస‌లు రియా చ‌క్ర‌వ‌ర్తిని పెళ్లి చేసుకోవాలన్న సుశాంత్ ఆలోచ‌న గురించి త‌న‌కు తెలియ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. కాగా ఈ నెల 14 సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని త‌న నివాసంలో ఆత్మ‌హ‌త్య చేసుకొని అర్థాంత‌రంగా త‌నువు చాలించిన విష‌యం తెలిసిందే. అయితే కెరీర్ ప‌రంగా స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో తీవ్ర మాన‌సిక ఒత్తిడి కార‌ణంగానే సుశాంత్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని అంద‌రూ భావిస్తున్నారు. (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్ : కీలక ప్రకటన)

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ.. సుశాంత్ మాన‌సిక ఒత్తిడితో బాధ‌ప‌డుతున్న‌ట్లు త‌న‌కు చెప్ప‌లేద‌ని వెల్ల‌డించారు. సుశాంత్ ఇంట్లో ఎప్పుడూ కొంత‌మంది వ్య‌క్తులు ఉండేవార‌న్నారు. తానెప్పుడూ సుశాంత్‌తో ఫోన్ కాల్స్ ద్వారా ట‌చ్‌లో ఉండే వాడ‌ని పేర్కొన్నారు. రియా చక్రవర్తితో సుశాంత్  రిలేష‌న్ గురించి అడ‌గ్గా.. ‘వాళ్లు పెళ్లి చేసుకుంటార‌ని నాకు తెలీదు. ఆ పెళ్లి గురించి నాకు ఎప్పుడూ చెప్ప‌లేదు. నాకు నిజంగా తెలీదు. ఒకానొక స‌మ‌యంలో సుశాంత్‌, అంకితా పెళ్లి చేసుకోవాల్సి ఉండేది. నాకు తెలిసినంత‌వ‌ర‌కు అదే సుశాంత్ చివ‌రి రిలేష‌న్ అనుకుంటా’. అని తెలిపారు.(తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు: సుశాంత్‌ తండ్రి)

సుశాంత్‌ను అంకితా స్నేహితురాలుగా కాకుండా త‌న త‌ల్లిగా చూసుకునేద‌ని సందీప్ అన్నారు. అంకితా గురించి మాట్లాడుతూ.. ‘ఆమె సుశాంత్ జీవితంలో త‌న త‌ల్లి స్థానాన్ని పొందింది. నా 20 ఏళ్ల సినీ ప‌రిశ్ర‌మ‌లో అంకితా లాంటి అమ్మాయిని చూడ‌లేదు. అంత మంచి అమ్మాయి. సుశాంత్‌కు ఎల్ల‌ప్పుడూ జాగ్ర‌త్త‌గా చూసుకునేది. త‌న కోసం ఏమైనా చేస్తుంది. సుశాంత్‌కు అనుగుణంగా మెలిగేది. అనికి న‌చ్చిన ఫుడ్‌ను వండి పెట్టేది. అంకితా త‌న ఇంటిని సుశాంత్‌కు న‌చ్చే విధంగా డిజైన్ చేసుకుంది.సుశాంత్ కోసం త‌న కెరీర్‌ను వ‌దులుకుంది. ఇలా ప్ర‌తిదీ సుశాంత్ ఇష్టం మేర‌కే చేసేది. అంకితా లాంటి అమ్మాయిని పొందాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ అనుకుంటారు. ఇటీవ‌ల త‌న‌తో మాట్లాడాను అంకితా ఎంత బాధ‌ప‌డుతుందో నాకు తెలుసు’. అంటూ ముగించారు. (‘సుశాంత్‌ను‌ అందుకే తొలగించారా!’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement