basketball
-
తెలంగాణకు తొలి స్వర్ణం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మొదటి స్వర్ణం చేరింది. మహిళల బాస్కెట్‌బాల్ 3X3 ఈవెంట్లో తెలంగాణ జట్టు తొలి స్థానంలో నిలిచింది. ఫైనల్లో తెలంగాణ 21–11 పాయింట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. పసిడి పతకం సాధించిన మహిళల జట్టులో గులాబ్ షా అలీ, ఎస్.పుష్ప, కేబీ హర్షిత, పి.ప్రియాంక సభ్యులుగా ఉన్నారు. రెండేళ్ల క్రితం గోవా జాతీయ క్రీడల్లోనూ ఇదే ఈవెంట్లో విజేతగా నిలిచిన తెలంగాణ తమ స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో 14–12 తేడాతో తమిళనాడును ఓడించి మధ్యప్రదేశ్ కాంస్యం సొంతం చేసుకుంది. అంతకుముందు సెమీస్‌లో తెలంగాణ 18–11తో తమిళనాడును... కేరళ 13–10తో మధ్యప్రదేశ్‌ను ఓడించాయి. మరో వైపు పురుషుల బాస్కెట్‌బాల్ 3–3 ఈవెంట్లో మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నాయి. ఫైనల్లో మధ్యప్రదేశ్ 22–20 తేడాతో కేరళను ఓడించింది. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు చేతిలో 16–21తో ఓడిన తెలంగాణ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు మూడు కాంస్యాలు మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు మంగళవారం మూడు కాంస్య పతకాలు లభించాయి. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కర్రి సాయిపవన్–షేక్ గౌస్ జోడీ... కనోయింగ్–కయాకింగ్ క్రీడాంశంలోని పురుషుల స్లాలోమ్–కే1 ఈవెంట్లో కొల్లకాని విష్ణు... మహిళల స్లాలోమ్–సీ1 ఈవెంట్లో దొడ్డి చేతన భగవతి కాంస్య పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్ డబుల్స్ సెమీఫైనల్లో సాయిపవన్–షేక్ గౌస్ ద్వయం 13–21, 12–21తో నితిన్–ప్రకాశ్ రాజ్ (కర్ణాటక) జంట చేతిలో ఓడి కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. మంగళవారం పోటీలు ముగిశాక ఆంధ్రప్రదేశ్ ఆరు పతకాలతో 21వ స్థానంలో, మూడు పతకాలతో తెలంగాణ 24వ స్థానంలో ఉన్నాయి. -
పాపాల భోపాల్‌లో పారా తారలు.. విషం కాటేసినా ఆటై మెరిశారు
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 40 ఏళ్లు. డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి మొదలై డిసెంబర్ 3 వరకూ కొనసాగిన విష వాయువులు ఆ ఒక్క రాత్రితో తమ ప్రభావాన్ని ఆపేయలేదు. అవి జన్యువుల్లో దూరి నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దుర్ఘటన నుంచి బయటపడిన వారికి నేటికీ అవకరాలతో పిల్లలు పుడుతున్నారు. ఏనాటి ఎవరి పాపమో ఇప్పటికీ వీళ్లు అనుభవిస్తున్నారు. అయితే వీరిలో కొందరు పిల్లలు పారా స్పోర్ట్స్‌లో ప్రతిభ చూపుతుండటం ఒక ఆశ. కాని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పడమే వీరు మనకు కలిగిస్తున్న చైతన్యం.పదిహేడేళ్ల దీక్షా తివారి ‘ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ డిజార్డర్’ (ఐడిడి) రుగ్మతతో బాధ పడుతోంది. ఆ అమ్మాయిని బాల్యంలో గమనించిన తల్లిదండ్రులు మహేష్ తివారి, ఆర్తి తివారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఆయన ‘ఇది భోపాల్ గ్యాస్ విష ఫలితం’ అనంటే ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. ‘అదెప్పటి సంగతో కదా’ అన్నారు. ‘అవును... ఇప్పటికీ వెంటాడుతోంది’ అన్నాడు డాక్టర్. దానికి కారణం భోపాల్ ఘటన జరిగినప్పుడు మహేష్ వయసు 5 ఏళ్లు, ఆర్తి వయసు 3 సంవత్సరాలు. వారు భోపాల్‌లో ఆ గ్యాస్‌ని పీల్చారు. కాని అది జన్యువుల్లో దూరి సంతానానికి సంక్రమిస్తుందని నాడు వాళ్లు ఊహించలేదు.అదృష్టం ఏమిటంటే దీక్షా తివారి 2023 స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బాస్కెట్ బాల్లో రజత పతకం తేవడం. ఈ అమ్మాయే కాదు భోపాల్ విష వాయువు వెంటాడుతున్న చాలా మంది బాలలు భోపాల్‌లోని జేపీ నగర్ప్రాంతంలో అత్యధికం ఉన్నారు. వీరంతా తమ శారీరక, మానసిక లోపాలను, రుగ్మతలను జయించడానికి స్పోర్ట్స్‌ను ఎంచుకున్నారు. అథ్లెటిక్స్, సైక్లింగ్, ఫుట్‌బాల్ తదితర ఆటల్లో ప్రతిభ చూపుతున్నారు. బతుకు జీవచ్ఛవం కాకుండా ఉండేందుకు క్రీడలు వారిని కాపాడుతున్నాయి. కాని ప్రభుత్వం వీరికి చేయవలసింది చేసిందా?40 టన్నుల గ్యాస్డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి అత్యంత ప్రాణాంతకమైన ‘మిథైల్ ఐసొసైనెట్’ విడుదలవడం మొదలయ్యి మరుసటి రోజు సాయంత్రం వరకూ వ్యాపించింది. దాదాపు 40 టన్నుల విషవాయువు విడుదలైంది. దీని వల్ల చనిపోయిన వారు అధికారికంగా 2,259 కాని 20 వేల నుంచి 40 వేల వరకు మరణించి ఉంటారని సామాజిక కార్యకర్తల అంచనా. ఆ సమయంలో బతికున్నవారు జీవచ్ఛవాలుగా మారితే కొద్దిపాటి అస్వస్థతతో బయటపడిన వారూ ఉన్నారు. విషాదం ఏమంటే ఈ ఘటన జరిగినప్పుడు చంటిపాపలు, చిన్న పిల్లలుగా ఉన్నవారు ఆ ఘటన నుంచి బయట పడి అదృష్టవంతులం అనుకున్నారు కానీ వారికి యుక్తవయసు వచ్చి పిల్లలు పుట్టాక వారిలో అధిక శాతం దివ్యాంగులుగా, మానసిక దుర్బలురుగా మిగిలారు.1300 మంది దివ్యాంగులు‘‘భోపాల్ విషవాయువులు భోపాల్‌లోని 42 వార్డుల మీద ప్రభావాన్ని చూపాయి. ఆ 42 వార్డుల్లో దివ్యాంగ శిశువులు జన్మిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య అధికారికంగా 1300. వీరిలో అత్యధికులు అంధత్వం, సెరిబ్రల్ పాల్సీ, డౌన్ సిండ్రోమ్, మస్క్యులర్ డిస్ట్రఫీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటి సమస్యలతో బాధ పడుతున్నారు.వీరికి రెగ్యులర్‌గా థెరపీ అవసరం. కాని మా వద్ద వున్న వనరులతో కేవలం 300 మందికే సేవలు అందించగలుగుతున్నాం. మిగిలినవారికీ ఏ థెరపీ అందడం లేదు. వీరిలో చాలామంది పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు. ఈనాటికీ వీరికి నష్టపరిహారం అందలేదు’’ అని ‘చింగారి’ ట్రస్ట్ బాధ్యుడొకరు తెలిపారు. భోపాల్ విషవాయువు బాధిత దివ్యాంగ శిశువులకు ఈ సంస్థ వైద్య సహాయం అందిస్తుంది.కల్లాకపటం లేని పిల్లలుభోపాల్లోని జేపీనగర్‌లో కల్లాకపటం లేని అమాయక బాలలు చాలామంది కనిపిస్తారు. ముద్దొచ్చే మాటలు మాట్లాడుతూ అందరిలాగా ఆటలాడాలని, స్కూలుకు వెళ్లాలని, కబుర్లు చెప్పే వీరంతా చాలామటుకు బుద్ధిమాంద్యంతో బాధపడే పిల్లలే. కొందరు శరీరం చచ్చుబడ్డ వారే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన వీరంతా నిరసన కార్యక్రమం జరుపుతుంటారు. న్యాయం కోరుతుంటారు. కానీ దుర్ఘటన జరిగి 40 ఏళ్లు అవుతున్నా వీరు రోడ్ల మీదకు వస్తూనే ఉండాల్సి రావడం బాధాకరం.నీరు తాగిభోపాల్ విషవాయులు భూమిలోకి ఇంకడం వల్ల కొన్ని చోట్ల ఇప్పటికీ ఆ నీరు విషతుల్యం అయి ఉంది. వేరే దిక్కు లేక పేదలు ఆ నీరే చాలాకాలం తాగి ఇప్పుడు దివ్యాంగ శిశువులకు జన్మనిస్తున్నారు. ‘ఆటలాడే ఉత్సాహం ఉన్నా వీరికి ఆటవస్తువులు లేవు. హెల్త్ కార్డులు లేవు’ అని తల్లిదండ్రులు భోరున విలపిస్తుంటే ఏ పాపానికి ఈ శిక్ష అనిపిస్తుంది. -
24, 25 తేదీల్లో తెలంగాణ అండర్–19 చెస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో ఈనెల 24, 25వ తేదీల్లో రాష్ట్ర అండర్–19 జూనియర్ చాంపియన్‌షిప్ జరగనుంది. కూకట్పల్లి ప్రగతినగర్‌లోని పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. జనవరి 1, 2005న లేదా ఆ తర్వాత పుట్టిన వారు మాత్రమే ఈ టోర్నీలో పాల్గొనేందుకు అర్హులు. బాలబాలికల విభాగాల్లో వేర్వేరుగా గేమ్‌లు నిర్వహిస్తారు. బాలికల విభాగంలో టాప్–4లో నిలిచిన ప్లేయర్లు... బాలుర విభాగంలో టాప్–7లో నిలిచిన ప్లేయర్లు జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర బాలబాలికల జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారని టీఎస్‌సీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ టోర్నీలో ఆడాలనుకునే వారు తమ పేర్లను 7337578899, 7337399299 నంబర్లలో నమోదు చేసుకోవాలి. 25, 26 తేదీల్లో తెలంగాణ యూత్ బాస్కెట్‌బాల్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బాస్కెట్‌బాల్ సంఘం, మహబూబ్‌నగర్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యూత్ అంతర్ జిల్లా చాంపియన్‌షిప్ పోటీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 25, 26వ తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలో ఈ టోర్నీని నిర్వహిస్తారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోరీ్నలో మొత్తం 17 జిల్లా జట్లు పాల్గొంటున్నాయి.ఈ టోర్నీలో రాణించిన క్రీడాకారులను జాతీయ యూత్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ బాస్కెట్‌బాల్ జట్టులోకి ఎంపిక చేస్తామని తెలంగాణ బాస్కెట్‌బాల్ సంఘం జనరల్ సెక్రటరీ నార్మన్ ఐజాక్ తెలిపారు. జాతీయ యూత్ చాంపియన్‌షిప్ పశ్చిమ బెంగాల్లో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు జరుగుతుంది. గత ఏడాది సూర్యాపేటలో జరిగిన తెలంగాణ యూత్ అంతర్జిల్లా చాంపియన్íÙప్లో మేడ్చల్ మల్కాజిగిరి జట్లు బాలబాలికల విభాగాల్లో విజేతగా నిలిచాయి. కరాటే కుర్రాళ్ల కిక్ అదిరింది సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఆల్ స్టయిల్స్ మార్షల్ ఆర్ట్స్ కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాళ్లు అదరగొట్టారు. టైగర్ కుంగ్ ఫూ అకాడమీ ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహించారు. వివిధ విభాగాల పతక విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. స్వర్ణ పతకాలు: ఈథన్ రాజ్ (అండర్–12 కటా), దక్ష్ (అండర్–8 కటా). రజత పతకాలు: అంకిత (అండర్–10 కటా), సాయాంశ్ (అండర్–12 కటా), కావ్యాంశ్ (అండర్–8 కటా). కాంస్య పతకాలు: అమైర్ (అండర్–8 కటా), కిరణ్య (అండర్–8 కటా), అహ్మద్ (అండర్–6 కటా), శ్రవణ్ (అండర్–12 కటా), నిగ్నేశ్ (అండర్–6 కటా), మాన్విత (అండర్–6 కటా), సాధ్విత (అండర్–12 కటా), కరణ్‌నాథ్ (అండర్–13 కటా). చాంపియన్స్ వృత్తి, సుహాస్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ అంతర్ జిల్లా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో అంతర్జాతీయ స్విమ్మర్ వృత్తి అగర్వాల్, పురుషుల విభాగంలో సుహాస్ ప్రీతమ్ చాంపియన్స్‌గా నిలిచారు. సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో జరిగిన ఈ టోర్నీలో వృత్తి నాలుగు ఈవెంట్లలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన వృత్తి 200, 400, 800, 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్స్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన మైలారి సుహాస్ ప్రీతమ్ 50, 100, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్స్‌తోపాటు 200, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్స్‌లో విజేతగా నిలిచాడు. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం సెక్రటరీ జి.ఉమేశ్, జీహెచ్ఎంసీ ఏడీఎస్ శ్రీనివాస్ గౌడ్, వెంకట్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. -
అమెరికాకే అందలం
పారిస్: విశ్వ క్రీడల్లో చివరిరోజు ఆఖరి మెడల్ ఈవెంట్లో అమెరికా అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. చివరి మెడల్ ఈవెంట్‌గా జరిగిన మహిళల బాస్కెట్‌బాల్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అమెరికా 67–66 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టును ఓడించింది. మహిళల బాస్కెట్‌బాల్ జట్టు స్వర్ణ పతకంతో పతకాల పట్టికలో అమెరికా జట్టు టాప్ ర్యాంక్‌ను ఖరారు చేసుకోవడం విశేషం. అమెరికా, చైనా జట్లు 40 స్వర్ణ పతకాలతో సమంగా నిలిచాయి. అయితే చైనాకంటే అమెరికా ఎక్కువ రజత పతకాలు, ఎక్కువ కాంస్య పతకాలు సాధించింది. దాంతో అమెరికాకు అగ్రస్థానం దక్కింది. ఫ్రాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో అమెరికా మహిళల జట్టుకు గట్టిపోటీ ఎదురైంది. ఒకదశలో అమెరికాకు ఓటమి తప్పదా అనిపించింది. ఆఖరి క్వార్టర్లో నాలుగు నిమిషాలు మిగిలి ఉన్నంతవరకు ఫ్రాన్స్ 53–52తో ఒక్క పాయింట్ ఆధిక్యంలో ఉంది. ఈ దశలో తమకు లభించిన ఫ్రీ త్రోను అమెరికా పాయింట్‌గా మలిచి స్కోరును 53–53తో సమం చేసింది. ఆ తర్వాత అమెరికా కీలక పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి వెళ్లింది. 17 సెకన్లు మిగిలి ఉన్నాయనగా అమెరికా 63–59తో ముందంజలో నిలిచింది. ఈ దశలో తమకు లభించిన రెండు ఫ్రీ త్రోలను ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ పాయింట్లుగా మలిచింది. దాంతో అమెరికా ఆధిక్యం 63–61గా మారింది. 11 సెకన్లు ఉన్నాయనగా అమెరికా ప్లేయర్ కెల్సీ ప్లమ్ రెండు పాయింట్లు సాధించి 65–61తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ గ్యాబీ విలియమ్స్ మూడు పాయింట్ల షాట్ సంధించడంతో అమెరికా ఆధిక్యం 65–64కు తగ్గింది. మూడు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ ఫౌల్ చేయడంతో అమెరికాకు రెండు ఫ్రీ త్రోలు రావడం, వాటిని పాయింట్లుగా మలచడం జరిగింది. దాంతో అమెరికా 67–64తో ముందంజలోకి వెళ్లింది. చివరి క్షణంలో ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ రెండు పాయింట్లు సాధించినా ఆతిథ్య జట్టు పాయింట్ తేడాతో ఓటమి చవిచూసింది. అమెరికా జట్టులో విల్సన్ అజా 21 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... కెల్సీ ప్లమ్, కాపర్ కాలీ 12 పాయింట్ల చొప్పున సాధించారు. ఈ గెలుపుతో అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు ఒలింపిక్స్‌లో వరుసగా ఎనిమిదో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఓవరాల్‌గా అమెరికా మహిళల జట్టుకిది పదో స్వర్ణం. 1984 లాస్ ఏంజెలిస్, 1988 సియోల్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు నెగ్గిన అమెరికా జట్టు 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. ఆ తర్వాత 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో అమెరికా మహిళల జట్టు పసిడి పతకాల వేట మళ్లీ మొదలై 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు కొనసాగుతూనే ఉంది. మరోవైపు శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల బాస్కెట్‌బాల్ ఫైనల్లో అమెరికా జట్టు 98–87 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టుపై గెలిచి ఓవరాల్‌గా 17వసారి పసిడి పతకాన్ని దక్కించుకుంది. అమెరికా జట్టులో స్టీఫెన్ కర్రీ త్రీ పాయింటర్ షాట్లను ఎనిమిదిసార్లు వేయడం విశేషం. దిగ్గజ ప్లేయర్లు కెవిన్ డురాంట్ 15 పాయింట్లు, లెబ్రాన్ జేమ్స్ 14 పాయింట్లు, డేవిడ్ బుకెర్ 15 పాయింట్లు సాధించారు. 14 అమెరికా సాధించిన స్వర్ణాల సంఖ్యలో అత్యధికంగా అథ్లెటిక్స్ నుంచి 14 పసిడి పతకాలు లభించాయి. ఆ తర్వాత స్విమ్మింగ్‌లో 8, జిమ్నాస్టిక్స్‌లో 3, బాస్కెట్‌బాల్, సైక్లింగ్ ట్రాక్, ఫెన్సింగ్, రెజ్లింగ్‌లో 2 చొప్పున స్వర్ణాలు దక్కాయి. సైక్లింగ్ రోడ్, ఫుట్‌బాల్, గోల్ఫ్, రోయింగ్, షూటింగ్, సరి్ఫంగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒక్కో స్వర్ణం చొప్పున లభించాయి. 19 ఇప్పటి వరకు 30 సార్లు ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 19 సార్లు అమెరికా జట్టు పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సోవియట్ యూనియన్ ఆరుసార్లు టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. యూనిఫైడ్ టీమ్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ ఒక్కోసారి మొదటి స్థానంలో నిలిచాయి. -
అజేయ అమెరికా
ఒలింపిక్స్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని రికార్డును అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు సొంతం చేసుకుంది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు విశ్వక్రీడల్లో అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు పరాజయం అన్నదే ఎరగకుండా దూసుకెళుతోంది. ఈ క్రమంలో వరుసగా 60 మ్యాచ్‌లు గెలవడం విశేషం. ‘పారిస్’ క్రీడల్లో ఫైనల్ చేరడం ద్వారా అమెరికా ఈ ఘనత సాధించింది. శనివారం జరిగిన మహిళల సెమీఫైనల్లో అమెరికా 85–64తో ఆ్రస్టేలియాపై గెలిచి ఫైనల్‌కు చేరింది. నేడు ఫ్రాన్స్‌తో స్వర్ణం కోసం తలపడనుంది. ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు వరుసగా ఏడు స్వర్ణాలు గెలిచింది. ఈసారి కూడా పసిడి కైవసం చేసుకుంటే.. విశ్వక్రీడల చరిత్రలో వరుసగా 8 బంగారు పతకాలు గెలిచిన తొలి టీమ్‌గా చరిత్ర కెక్కనుంది. -
భారత బాస్కెట్‌బాల్ జట్టు కోచ్‌గా సంతోష్
ఆసియా కప్ సీనియర్ పురుషుల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టుకు కోచ్‌గా తెలంగాణకు చెందిన పి.ఎస్.సంతోష్ ఎంపికయ్యాడు. ఈ టోర్నీ కజకిస్తాన్‌లో ఈనెల 23 నుంచి 26 వరకు జరుగుతుంది. గ్రూప్ ‘ఇ’లో భారత్‌తోపాటు ఖతర్, కజకిస్తాన్, ఇరాన్ జట్లున్నాయి. భారత జట్టులో విశేష్, అరవింద్, ముయిన్ బెక్, ప్రణవ్ ప్రిన్స్, అమృత్‌పాల్, గుర్బాజ్, పల్‌ప్రీత్, అమరేంద్ర, వైశాఖ్, ప్రిన్స్‌పాల్ సింగ్, సహజ్‌ప్రతాప్ సింగ్, బాలదానేశ్వర్ సభ్యులుగా ఉన్నారు. -
వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు
న్యూఢిల్లీ: బాస్కెట్ బాల్ దిగ్గజం, మాజీ ఎన్బీఏ స్టార్ మైఖేల్ జోర్డాన్ తన ఆసక్తికి తగ్గట్టుగానే మరో ఫాస్టెస్ట్ కారును సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, కన్వర్టిబుల్ కార్ హెన్నెస్సీ వెనమ్ F5 రోడస్టర్ను కొనుగోలు చేశాడు దీని ఏకంగా రూ. 29 కోట్ల రూపాయలు. బాస్కెట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడైన జోర్డాన్ హైపర్, సూపర్, స్పోర్ట్స్ కార్ల కలెక్షన్‌కు పెట్టింది పేరు. అందులోనూ అల్ట్రా-ఫాస్ట్ కార్లంటే అంటే అతనికి పిచ్చి. గంటకు 400 కి.మీ దూసుకుపోయే బుగట్టి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్ కారు ఇప్పటికే గ్యారేజీలో ఉంది. ఇంకా పోర్స్చే 911 టర్బో S 993, ఫెరారీ 512 TR , చేవ్రొలెట్ కొర్వెట్టి లాంటి లెజెండ్రీ కార్లు కూడా ఉన్నాయి. తాజాగా అమెరికన్ హెన్నెస్సీ వెనమ్ F5 రోడస్టర్ కారు కూడా చేరింది. ప్రపంచంలో కేవలం 30 మంది ఓనర్లలో మైఖేల్ జోర్డాన్ ఒకరు. (మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ ) హెన్నెస్సీ పెర్ఫార్మెన్స్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జోర్డాన్‌తో పోటోను కంపెనీ సీఈవో జాన్ హెన్నెస్సీ ట్వీట్ చేశారు. ప్రత్యేకమైన రోజు, స్పెషల్ ఫ్రెండ్ కోసం స్పెషల్ వెనమ్ ఎఫ్5ని అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేయడం విశేషం.(యాపిల్ స్పెషల్ ఫీచర్‌తో స్మార్ట్ ట్రావెల్ మగ్, ధర వింటే..!) View this post on Instagram A post shared by Hennessey Performance (@hennesseyperformance) అద్భుతమైన ఈ కారు 6.6-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్న్, 1,842 హార్స్పవర్, 1193 గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. కేవలం 2.6 సెకన్లలో 0 - 100 kmph వేగంతో గరిష్ట వేగంతో గంటకు 498 కి.మీ.ని అధిగమిస్తుందని అంచనా. నివేదిక ప్రకారం కేవలం 30 కార్లు మాత్రమే తయారైనాయి. ధర 3 మిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన , అత్యంత శక్తివంతమైన కన్వర్టిబుల్ కారని కంపెనీ ప్రకటించింది.. -
ఫ్లై ఓవర్ల కింద క్రీడా వేదికలు.. ఆలోచన బాగుందన్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఫ్లై ఓవర్ల కింద ఖాళీ స్థలంలో మొక్కలు పెంచడం, వాహనాల పార్కింగ్ వంటి సదుపాయాలు కల్పిస్తుంటారు. అయితే నవీ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినూత్నంగా ఆలోచించి.. ఫ్లైఓవర్ కింద బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ధనుంజయ్ అనే యువకుడు ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘ఇది అద్భుతమైన ఆలోచన.. నవీ ముంబైలో ఫ్లై ఓవర్ల కింద ఆట స్థలాలను నిర్మించినట్లు అన్ని పట్టణాల్లోని ఫ్లై ఓవర్ల కింద ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మీ పట్టణాల్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అని అతడు ట్వీట్ చేశాడు ఈ ట్వీట్‌పై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది మంచి ఆలోచన అని మంత్రి సైతం ఈ వీడియోను షేర్ చేశారు. ఈ విధానాన్ని పరిశీలించాలని పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్‌కు సూచించారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి తరహా క్రీడా వేదికలను అందుబాటులోకి తీసుకురావొచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. Let’s get this done in a few places in Hyderabad @arvindkumar_ias Looks like a nice idea https://t.co/o0CVTaYxqb — KTR (@KTRBRS) March 27, 2023 -
సాయిప్రణీత్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో గురువారం మూడు స్వర్ణాలు చేరాయి. బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు సాధించిన జట్టుకు బాస్కెట్‌బాల్‌లో కూడా మరో బంగారు పతకం దక్కింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో తెలంగాణ షట్లర్ సాయిప్రణీత్ 21–11, 12–21, 21–16తో మిథున్ మంజునాథ్ (కర్నాటక)ను ఓడించి విజేతగా నిలిచాడు. మహిళల డబుల్స్‌లో ఫైనల్లో ఎన్.సిక్కిరెడ్డి–పుల్లెల గాయత్రి గోపీచంద్ ద్వయం పసిడి పతకాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో సిక్కి–గాయత్రి 21–14, 21–11తో శిఖా గౌతమ్–అశ్విని భట్ (కర్నాటక)ను చిత్తు చేశారు. మహిళల బాస్కెట్‌బాల్ 5–5 ఈవెంట్లో కూడా తెలంగాణకు స్వర్ణం లభించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో తెలంగాణ 67–62 పాయింట్ల తేడాతో తమిళనాడుపై విజయం సాధించింది. మూడు క్వార్టర్లు ముగిసే సరికి 5 పాయింట్లతో వెనుకబడి ఉన్న తెలంగాణ నాలుగో క్వార్టర్లో 10 పాయింట్ల ఆధిక్యం సాధించి విజయాన్నందుకోవడం విశేషం. తెలంగాణ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్లో రెండో స్థానంలో నిలిచిన విృత్తి రజత పతకాన్ని అందుకుంది. -
ఆల్‌రౌండర్ ఆర్కే రోజా (ఫొటోలు)
-
చీరకట్టులో బాస్కెట్ బాల్ ఆడిన సన్నీ లియోన్... వీడియో వైరల్
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంత ఇంత కాదు. ఆమె నెట్టింట ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు.. వైరల్ కావాల్సిందే. తాజాగా ఈ హాట్ బ్యూటీ చీరకట్టులో భర్తతో కలసి బాస్కెట్ బాల్ ఆడింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎరుపు రంగు చీరలో భర్త డేనియల్ వెబర్‌తో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతూ సందడి చేసింది. ఈ వీడియోని ఆమే స్వయంగా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. కుచ్ కుచ్ హోతా హై చిత్రంలోని యే లడ్కీ హై దివానా సాంగ్‌ను జతచేసింది. ఆ మధ్య ‘ఓ మై ఘోస్ట్’ కోసం సన్నీ వేసిన లుంగీ స్టెప్పులు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. సన్నీ ప్రస్తుతం ‘ఓ మై ఘోస్ట్’ మూవీతో పాటు.. ‘వీరమాదేవి’, ‘రంగీలా’, ‘షెరో’, ‘కోకకోలా’, ‘హెలెన్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
అందరిలో ఒకటే ఉత్కంఠ..ఆమె గోల్ వేయాలని ఐతే..
Basketball game in viral video: చాలా మంది తమ వైకల్యాన్ని ప్రతికూలమైన అంశంగా భావించకుండా తమ శక్తి యుక్తులతో విజేతలగా మారారు. అంతేందుకు ప్రతికూలంగా ఉన్నదాన్ని సైతం అనుకూలంగా మార్చుకుని ఎదురు నిలిచిని వాళ్లు ఉన్నారు. మేము డిసేబుల్డ్ కాదు డిఫరెంట్‌గా చేసేవాళ్లం అని చాటి చెప్పి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వారెందరో ఉన్నారు. అచ్చం ఆ కోవకే చెందిందే జూల్స్ హూగ్లాండ్ అనే ఏళ్ల అమ్మాయి. ఇంతకీ ఆమె ఏం చేసిందనే కదా! వివరాల్లోకెళ్తే...జూల్స్ హూగ్లాండ్ అనే 17 ఏళ్ల అమ్మాయి దివ్యాంగురాలు. అమెకు కళ్లు కనిపించావు. అయితే ఆమె బాస్కట్ బాల్ కోర్టులో గోల్ చేస్తున్నసమయంలో అక్కడున్న ప్రేక్షకులంతా చాలా నిశబ్దంగా ఉన్నారు. ఆమె గోల్ చేస్తుందా లేదా అన్నట్లుగా చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఆమె ఒక హూప్ సాయంతో గోల్ చేయాల్సిన లక్ష్యాన్ని విని, తదనంతరం గోల్ వేస్తుంది. అయితే అక్కడ ఉన్నవారందరిలో ఒకటే ఆత్రుత ఆమె ఎలా వేస్తుందా అని. కానీ ఇంతలో ఆమె బాస్కట్ బాల్ని చాలా కరెక్ట్‌గా గోల్ చేసింది. అంతే అక్కడున్నవారంతా ఒక్కసారిగా అరుపులు, కేకలతో సందడి చేశారు. యుఎస్‌లోని జీలాండ్ ఈస్ట్ హైస్కూల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) (చదవండి: ఉక్రెయిన్‌లో దయనీయ పరిస్థితి..!) -
ఆమె అలా తప్పించుకుంది
పారిపోవాలి. బతకాలి. తాలిబన్ల చేతికి చిక్కకూడదు. లక్షల మంది ఆకాంక్ష అఫ్గానిస్తాన్‌లో ఇప్పుడు. కాని అందరికీ వీలవుతుందా? సాధ్యమవుతుందా? తుపాకీ గొట్టాన్ని తప్పించుకోగలరా? అఫ్గానిస్తాన్ వీల్చైల్ బాస్కెట్‌బాల్ కెప్టెన్ నీలోఫర్ బయత్ అక్కడి నుంచి భర్తతో సహా స్పెయిన్‌కు తప్పించుకోగలిగింది. కాని దాని వెనుక ఒక సినిమా అంత కథ ఉంది. ఏమిటి అది? ఆగస్టు 14న కాబూల్ తాలిబన్ల హస్తగతం అయ్యింది. ఆగస్టు 20న నీలోఫర్ బయత్ స్పెయిన్‌కు చేరుకోగలిగింది. ఈ మధ్యలోని 5 రోజులే ఆమె పారిపోవడానికి సంబంధించిన ఒక ఉత్కంఠ కథ. స్పెయిన్‌లోని బిల్బావ్ నగరానికి చేరుకుని ఆమె తెరిపినపడి కాఫీ తాగుతూ కూచుంది కాని ఆమె చేతులు ఇంకా ఒణుకుతున్నాయి. గుండె అదురుతూనే ఉంది. కళ్లు ఉండి ఉండి కన్నీరు కారుస్తూనే ఉన్నాయి. ఆమె తన భర్తతో పాటు తప్పించుకోగలిగింది. కాని తన బంధువులు, అయినవారు కాబుల్‌లోనే ఉన్నారు. వారి గతి ఏమిటి? భర్తతో కలిసి స్పెయిన్ విమానాశ్రయంలో ... ఆమె చేసిన పని కాబూల్ తాలిబన్ల హస్తగతం అయిన వెంటనే నీలోఫర్ బయత్ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే దేశాన్ని విడిచి పెట్టడం. ఆమె అఫ్గానిస్తాన్‌లోని వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ టీమ్ కెప్టెన్. అంతేకాదు మహిళల హక్కుల గురించి, దివ్యాంగుల అవసరాల గురించి కూడా మాట్లాడుతుంది. కాబూల్‌లో ఆమె ఒక సెలబ్రిటీ. ఆమె భర్త రమేష్ కూడా దివ్యాంగుల బాస్కెట్‌బాల్ టీమ్‌లో ఆడతాడు. ఇద్దరూ ఎన్నో కలలు కన్నారు. గత దశాబ్ద కాలంలో కాబూల్‌లో దివ్యాంగుల క్రీడల ఉన్నతికి పని చేస్తున్నారు. ఇంకా చేయాలనుకున్నారు. ఇంతలోనే తాలిబన్లు వచ్చేశారు. ‘వాళ్లు కచ్చితంగా నా కోసం వెతుకుతారని నాకు తెలుసు. అప్పటికే నాలాంటి వారి కోసం ఇల్లిల్లు వెతుకుతున్నారు’ అని నీలోఫర్ బయత్ అంది. ‘వెంటనే మనం దేశం విడిచిపెట్టాలి అని నా భర్తతో చెప్పాను’ అందామె. ఆమె అంత భయపడటానికి కారణం ఆమె చిన్నప్పుడు తాలిబన్ల మొదటి పాలనలో ఒక మిస్సైల్ ఆమె ఇంటి మీద కూలింది. ఒక సోదరుడు మరణించాడు. ఆమె వీపు కాలిపోయి వెన్నుకు గాయమైంది. దాంతో దివ్యాంగురాలైంది. అలాగే భర్త కూడా ల్యాండ్‌మైన్ పేలడంతో దివ్యాంగుడయ్యాడు. ఆ అనుభవాలు చాలు అనుకుందామె. జర్నలిస్ట్ ప్రమేయంతో... నీలోఫర్ వెంటనే చాలా ఏళ్లుగా తనకు తెలిసిన స్పానిష్ జర్నలిస్టు ఆంటోనియో పంప్లెగాతో తన బాధ మొరపెట్టుకుంది. ఆ జర్నలిస్టు ఆమె గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. స్పెయిన్ పౌరులు ఆ పోస్టుకు స్పందించారు. స్పెయిన్ ప్రభుత్వం కాబూల్ కేంద్రంగా యూరోపియన్ యూనియన్ ఇన్స్టిట్యూషన్స్లో పని చేసిన తన దేశీయులను, అఫ్గాన్ పౌరులను తరలించే కార్యక్రమాలు చేస్తోంది. ఆ విమానాల్లోనే నీలోఫర్‌ను భర్తతో పాటు తీసుకురావడానికి అంగీకరించింది. స్పెయిన్‌లో భర్తతో నీలోఫర్ బయత్ ‘అది తెలిసిన వెంటనే నేనూ నా భర్త కాబూల్ ఎయిర్పోర్ట్ వైపు కదిలాం. కాని సులభమా ఆ పని? అప్పటికే తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌ను చుట్టుముట్టారు. వాళ్ల తుపాకులు గాల్లో కాల్పులు చేస్తున్నాయి. మరోవైపు ఇతర పౌరులు కూడా వెర్రెత్తి ఎయిర్‌పోర్ట్‌లో చొరబడాలని చూస్తున్నారు. అసలు ఎయిర్‌పోర్ట్‌లో ప్రవేశించగలమా? అనుకున్నాను. ఎయిర్పోర్ట్ బయట ఏ క్షణమైనా మేము చనిపోవచ్చు. ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టడానికి బయట మేము 9 సుదీర్ఘ గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా తాలిబన్లు మా లగేజ్‌ను మాతో తీసుకెళ్లనివ్వలేదు. కట్టుబట్టలతో లోపలికి వెళ్లాం’ అందామె. వొంటి మీద బట్టలతో ఐదు రోజులు ఒంటి మీద బట్టలతో కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లోకి చేరుకున్న నీలోఫర్ ఆమె భర్త రమేశ్ తమకు విమానంలో చోటు దక్కడం కోసం దాదాపు ఐదు రోజులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయారు. ‘దేశం విడిచిపెట్టడమే ఒక విషాదం. కట్టుబట్టలతో పరాయి దేశంలో దిగడం అంటే మళ్లీ జీవితాలను జీరో నుంచి మొదలెట్టడమే’ అందామె. ఎయిర్‌పోర్ట్‌లో అనుక్షణం ఆశనిరాశల భీతావహ క్షణాల తర్వాత వారికి స్పెయిన్ విమానం చోటు ఇచ్చింది. మొత్తం 105 పాసింజర్లతో అఫ్గాన్ శరణార్థుల కోసం స్పెయిన్ తన దక్షిణ భాగాన తెరిచిన మిలటరీ బేస్‌కు సురక్షితంగా చేరుకుంది. అక్కడి నుంచి ఆ దంపతులు బిల్బావ్ నగరానికి చేరుకున్నారు. ఊపిరి పోసిన ఆదరణ నీలోఫర్ బయత్ అదృష్టవంతురాలు. స్పెయిన్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ వెంటనే ఆమెకు బిల్బావ్ బాస్కెట్‌బాల్ టీమ్‌లో ఆడటానికి ఆహ్వానం పలికింది. భర్త రమేశ్‌కు కూడా పురుషుల టీమ్‌లో ఆడమని కోరింది. వారికి ఉపాధి దొరికినట్టే. కాని శరణార్థులుగా వారి జీవితం ఏం కానుంది? అఫ్గానిస్తాన్‌లో ఉండిపోయిన వాళ్ల బంధువుల జీవితాలు ఏం కానున్నాయి. ఇవన్నీ కాలమే తేల్చనుంది. మనిషి ఎంత ఆధునికుడైనా సాటి మనిషిని వేధించడంలో మృగ స్వభావం ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఆ మృగాన్ని మొదటే గుర్తించి ఆపకపోతే ఇవాళ అఫ్గానిస్తాన్ రేపు ఏదేశమో? -
16వసారి స్వర్ణం.. మళ్లీ వాళ్లే!
టోక్యో: ఒలింపిక్స్‌లో అమెరికా పురుషుల బాస్కెట్‌బాల్ టీమ్ మరోసారి మెరిసింది. శనివారం జరిగిన ఫైనల్లో అమెరికా 87–82తో ఫ్రాన్స్‌పై నెగ్గి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గత మూడు విశ్వక్రీడల్లోనూ (2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో) స్వర్ణం నెగ్గిన అమెరికా... తాజా ప్రదర్శనతో వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లోనూ పసిడి నెగ్గిన జట్టుగా నిలిచింది. ఓవరాల్‌గా అమెరికాకు ఇది 16వ ఒలింపిక్స్ స్వర్ణం. ఇందులో 1936–68 మధ్య జరిగిన ఏడు వరుస ఒలింపిక్స్‌ల్లోనూ అమెరికా పసిడి నెగ్గడం విశేషం. ఫైనల్ తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా... కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన అమెరికా విరామ సమయానికి 44–39తో ఆధిక్యంలో నిలిచింది. మూడో క్వార్టర్‌ను అమెరికా 27–24తో ముగించింది. ఇక చివరి క్వార్టర్లో పుంజుకున్న ఫ్రాన్స్ 19–16తో పైచేయి సాధించినా ఓటమి తప్పలేదు. దాంతో ఫ్రాన్స్ రజతంతో సరిపెట్టుకుంది. అమెరికన్ స్టార్ కెవిన్ డ్యురాంట్ 29 పాయింట్లు స్కోరు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 107–93తో స్లొవే నియాపై గెలుపొందింది. -
17 ఏళ్ల తర్వాత తొలి ఓటమి
టోక్యో: గత మూడు ఒలింపిక్స్ క్రీడల్లో అజేయంగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించిన అమెరికా పురుషుల బాస్కెట్‌బాల్ జట్టుకు టోక్యో ఒలింపిక్స్‌లో తొలి మ్యాచ్‌లోనూ అనూహ్య పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 83–76 పాయింట్ల తేడాతో అమెరికా జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. అమెరికా స్టార్ ప్లేయర్ కెవిన్ డురాంట్ మ్యాచ్‌లో మరో 16 నిమిషాలు ఉందనగా నాలుగో ఫౌల్ చేసి వైదొలగడం జట్టు విజయావకాశాలను ప్రభావితం చేసింది. డురాంట్ నిష్క్రమించాక ఫ్రాన్స్ ఆధిపత్యం చలాయించి చివరకు అమెరికాకు షాక్ ఇచ్చింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిపోయాక అమెరికా జట్టుకు ఒలింపిక్స్‌లో ఎదురైన తొలి ఓటమి ఇదే కావడం గమనార్హం. -
కంటతడి పెట్టించావురా బుడ్డోడా..
తోడబుట్టిన తోడు కురిపించే ప్రేమ, పంచే స్నేహితం, చూపే ఆప్యాయత, ఆదరణకు మరెవరూ సాటిరారనడంలో అతిశయోక్తి లేదు. అమ్మానాన్నల తర్వాత అంతటి ప్రేమ లభించేది తోబుట్టువుల దగ్గరే. కొట్టుకున్నా, తిట్టుకున్నా సరే అక్క/చెల్లి ఇబ్బందుల్లో ఉందంటే పరిగెత్తుకు వచ్చే సోదరులు ఎంతో మంది ఉంటారు. అలాంటి స్వచ్చమైన బంధానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచాడు ఓ బుడ్డోడు. దివ్యాంగురాలైన సోదరి కళ్లల్లో సంతోషం చూసేందుకు అతడు చేసిన పని నెటిజన్ల మనసు దోచుకుంటోంది.(‘ఉస్సెన్ బోల్ట్ కూడా నన్ను పట్టుకోలేడు’) బాస్కెట్‌బాల్ ప్లేయర్ రెక్స్ చాప్మన్ ట్విటర్లో షేర్ చేసిన వీడియోలో.. వీల్‌చెయిర్‌కే పరిమితమైన ఓ బాలిక బాస్కెట్లో బాల్ వేసేందుకు ప్రయత్నించింది. కానీ తనకు అది సాధ్యం కాకపోవడంతో ఎదురుగా ఉన్న ఆమె సోదరుడు.. బాస్కెట్‌ను దగ్గరగా తీసుకువచ్చాడు. అతికష్టం మీద ఆ బాలిక అందులో బాల్‌ను వేయగా.. చప్పట్లు కొడుతూ ఆ బుడ్డోడు తన సోదరిని ఉత్సాహపరిచాడు. 14 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటికే 20 లక్షల మందికి పైగా వీక్షించగా.. లైకులు, రీట్వీట్లతో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో సదరు పిల్లాడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ప్రతీ అక్కాచెల్లికి నీ లాంటి సోదరుడు ఉండాలి. తోబట్టువు మోముపై చిరునవ్వు కోసం నువ్వు పడిన తాపత్రయం కంటతడి పెట్టించింది. అయితే అవి ఆనంద భాష్పాలు. నువ్వు గ్రేట్’’ అంటూ చిన్నోడిని ఆశీర్వదిస్తున్నారు.(వైరల్.. ఆకతాయిలపై గేదె ప్రతీకారం!) -
గడియారం ముల్లు వెనక్కి తిరిగింది!
ఒలింపిక్స్ అంటే... విజేతలు, పతకాలే కాదు పౌరుషాలు ప్రతాపాలు కూడా కనిపిస్తాయి! పసిడి కాంతులే కాదు...పంతాలు ఉంటాయి. రికార్డు టైమింగ్లే కాదు చరిత్రకెక్కిన వివాదాలూ చోటు చేసుకుంటాయి. 1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో రెండు అగ్రరాజ్యాల (అమెరికా, సోవియట్ యూనియన్) మధ్య జరిగిన బాస్కెట్‌బాల్ ఫైనల్ ‘యుద్ధం’ ఓ అసాధారణ వివాదంగా మిగిలిపోయింది. అంతర్జాతీయ క్రీడల చరిత్రలోని వివాదాస్పద ఘట్టాలను పేర్కొంటే తొలి స్థానం ఈ ఫైనల్ మ్యాచ్‌కే దక్కుతుంది. పోయిన సమయం తిరిగి రాదంటారు. కానీ మ్యూనిక్ ఒలింపిక్స్‌లో సోవియట్ యూనియన్ బాస్కెట్‌బాల్ జట్టు విషయంలో అలా జరగలేదు. వడ్డించే వాళ్లు మనోళ్లయితే అన్నట్లుగా... అన్నీ కలిసిరావడంతో చివరి క్షణాల్లో సోవియట్ యూనియన్ జట్టు ఆటగాళ్లకు అనుకూల ఫలితం వచ్చింది. వారి ఖాతాలో స్వర్ణ పతకాలు చేరాయి. తమను కావాలనే ఓడించారని గట్టిగా నమ్మిన అమెరికా జట్టు ఆటగాళ్లు రజత పతకాలు స్వీకరించకుండానే వెళ్లిపోయారు. బాస్కెట్‌బాల్ అంటేనే ముందుగా గుర్తొచ్చే పేరు అమెరికానే. ఇప్పుడే కాదు... ఎప్పటి నుంచో ఈ క్రీడను శాసిస్తోంది ఆ దేశమే. పైగా అప్పట్లో ప్రత్యేకించి ఒలింపిక్స్ క్రీడల్లో అమెరికా బాస్కెట్‌బాల్ జట్టుకు ఎదురేలేదు. మూడు దశాబ్దాలకు పైగా ఓటమి అంటేనే తెలియదు. 1936 నుంచి 1972 ఫైనల్ ముందు వరకు 63 మ్యాచ్‌లాడినా... అన్నింటా గెలిచిన చరిత్ర అమెరికాది. అలాంటి జట్టు మ్యూనిక్‌లోనూ ఎప్పటిలాగే అజేయంగా ఫైనల్ చేరింది. సోవియట్ యూనియన్ (ఇప్పుడు రష్యా)తో హోరాహోరీగా తలపడింది. కానీ ఈ పోరులో అమెరికా వెనుకబడింది. మ్యాచ్ ముగిసేదశకు చేరగా అమెరికా 48–49 స్కోరుతో ఓటమికి చేరువైంది. అయితే చివరి క్షణాల్లో సోవియట్ ఆటగాడు తప్పిదం చేయడంతో అమెరికాకు రెండు ఫ్రీ త్రోలు లభించాయి. కొలిన్స్ వాటిని పాయింట్లుగా మలిచాడు. అమెరికా 50–49తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ ముగియడానికి మూడు సెకన్లు ఉన్నాయి. సోవియట్ ఆటగాళ్లు ఆట కొనసాగించగా రెండు సెకన్లు అయిపోయాయి. మరో సెకను మాత్రమే మిగిలిఉన్న దశలో సోవియట్ జట్టు టైమ్ అవుట్ (విరామం) కోరిందని చెబుతూ రిఫరీ ఆటను నిలిపేస్తాడు. టైమ్ అవుట్ తర్వాత సోవియట్ జట్టు ఆట కొనసాగించినా పాయింట్ సాధించడంలో విఫలమవుతుంది. గెలిచామనే సంబరాల్లో అమెరికా ఆటగాళ్లు మునిగిపోతారు. కానీ ఇక్కడే అంతా గందరగోళం చోటు చేసుకుంటుంది. అదనంగా మరో మూడు సెకన్ల ఆట జరుగుతుంది. విజేత తారుమారై అమెరికా పరాజిత అవుతుంది. తమకు అన్యాయం జరిగిందని అమెరికా ఆటగాళ్లు ఏకంగా బహుమతి ప్రదానోత్సవాన్నే బహిష్కరిస్తారు. ఆ మూడు సెకన్లలో... అమెరికా ఫ్రీ త్రోలు పూర్తయ్యాక సోవియట్ ఆటగాళ్లు ఆటను కొనసాగించిన సమయంలో మ్యాచ్ సమయాన్ని పర్యవేక్షించే అధికారి గడియారంలో మిగిలి ఉన్న సమయాన్ని సెట్ చేసుకోలేదని... అందుకే జరిగిన రెండు సెకన్ల ఆటను లెక్కలోకి తీసుకోకుండా సోవియట్ జట్టుకు ఒక సెకను బదులుగా మళ్లీ మూడు సెకన్లు ఇవ్వాల్సిందేనని మైదానంలోకి దూసుకొచ్చిన అప్పటి అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం (ఫిబా) సెక్రటరీ జనరల్ విలియమ్ జోన్స్ రిఫరీలను ఆదేశిస్తాడు. దాంతో రిఫరీ సోవియట్ జట్టుకు మూడు సెకన్ల సమయం ఇస్తాడు. ఆ మూడు సెకన్లలో ఏం ఒరుగుతుందిలే అనుకునేలోపే ఊహించని పరిణామం జరుగుతుంది. సోవియట్ ఆటగాడు ఇవాన్ ఈడెష్కో తమ కోర్టు వైపు నుంచి ఒంటిచేత్తో బంతిని దాదాపు 28 మీటర్ల దూరం విసురుతాడు. అమెరికా బాస్కెట్ వద్ద కాచుకున్న 20 ఏళ్ల అలెగ్జాండర్ బెలోవ్ ఆ బంతిని నేరుగా అందుకొని ఎంతో నేర్పుగా బాస్కెట్లోకి వేసేస్తాడు. ఇలా వెనక్కి తిప్పిన సమయంతోనే అనూహ్యంగా 2 పాయింట్లు సాధించిన సోవియట్ జట్టు 51–50తో అమెరికాను ఓడిస్తుంది. ఈ ఫలితంతో ఖిన్నులైన అమెరికా జట్టు తుది ఫలితంపై అప్పీల్ చేస్తుంది. తర్జనభర్జనల తర్వాత అర్ధరాత్రి దాటాక ఐదు దేశాల సభ్యులతో కూడిన జ్యూరీ 3–2తో సోవియట్ యూనియన్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తుంది. క్యూబా, హంగేరి, పోలాండ్ సభ్యులు సోవియట్ యూనియన్‌కు.. ఇటలీ, ప్యూర్టోరికో సభ్యులు అమెరికాకు ఓటు వేస్తారు. జ్యూరీ కూడా తమకు అన్యాయం చేసిందని భావించిన అమెరికా ఆటగాళ్లు రజత పతకాలు ముట్టమనే పంతానికి దిగుతారు. ఇప్పటికీ ఈ రజత పతకాలు స్విట్జర్లాండ్‌లోని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మ్యూజియంలో అలాగే ఉన్నాయి. వీలునామాలో రాసి... బంగారం చేజారి... వచ్చిన రజతాన్ని కాదన్న అమెరికన్లు ఆ నిరసనను ఏళ్లతరబడి అలాగే కొనసాగిస్తున్నారు. పరిస్థితులు సద్దుమణిగాక అయినా తీసుకుంటారనుకున్న నిర్వాహకులకు నిరాశే ఎదురైంది. రజతాలు స్వీకరించే ముచ్చటేలేదని కరాఖండిగా చెప్పేశారు. మ్యూనిక్ నుంచి స్వదేశానికి వచ్చేశాక కూడా అమెరికన్ల మనసు మారలేదుకదా... పంతం ఇంకాస్తా పెరిగింది. మరో దశకు చేరింది. ఎంతగా అంటే ఫైనల్ ఆడిన అమెరికా ఆటగాడు డేవిస్ తన వారసులు, వారి తర్వాత తరాల వారసులు కూడా ఈ పతకాలు స్వీకరించరాదని ఏకంగా ఓ వీలునామా రాశాడు. అమెరికా వైపు నుంచి ఇలాంటి పరిణామం చోటు చేసుకోగా... సోవియట్ యూనియన్ బాస్కెట్‌బాల్ వర్గాలను విషాదంలో ముంచెత్తే ఘటన జరిగింది. సోవియట్ జట్టును గెలిపించిన చివరి 2 పాయింట్ల షాట్ వేసిన 20 ఏళ్ల అలెగ్జాండర్ బెలోవ్ ఆరేళ్ల తర్వాత 26 ఏళ్లప్రాయంలోనే క్యాన్సర్‌తో చనిపోయాడు. ఖాళీగా రజత పతక పోడియం -
బ్రహ్మపుత్ర జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: సీసీఓబీ ఆల్‌స్టార్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో బ్రహ్మపుత్ర జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. సిటీ కాలేజి బాస్కెట్‌బాల్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ఫైనల్లో బ్రహ్మపుత్ర 78–60తో కృష్ణపై గెలుపొందింది. విజేత జట్టు తరఫున బాషా, శివ చెరో 22 పాయిం ట్లతో చెలరేగారు. విషు 11 పాయింట్లు సాధించాడు. కృష్ణ తరఫున చంద్రహాస్ 27 పాయింట్లతో విజృంభించాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో డీఎస్పీ విష్ణుమూర్తి, హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను, నగదు బహుమతులను అందజేశారు. విజేత జట్టుకు రూ. 12,000, రన్నరప్‌కు రూ.10,000 ప్రైజ్‌మనీగా లభించాయి. -
విజేత కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ జట్టు
సాక్షి, హైదరాబాద్: శామ్యూల్ వసంత్ కుమార్ స్మారక బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. బేగంపేట్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కాలేజి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో కస్టమ్స్ జట్టు 78–66తో ఎయిర్ బార్న్ క్లబ్‌పై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 37–32తో ఆధిక్యంలో ఉన్న కస్టమ్స్ జట్టు చివరి వరకు అదే జోరును కొనసాగించి మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను కైవసం చేసుకుంది. విజేత జట్టు తరఫున చంద్రహాస్ 24 పాయింట్లతో చెలరేగగా, విజయ్ కుమార్ (13) అతనికి చక్కని సహకారం అందించాడు. ఎయిర్‌బార్న్ తరఫున నరేశ్ (20), టోని (23) చివరి వరకు పోరాడారు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో ఎయిర్‌బార్న్ క్లబ్ 65– 64తో సికింద్రాబాద్ వైఎంసీఏ జట్టుపై గెలుపొందింది. ఎయిర్‌బార్న్ జట్టులో నరేశ్ (23), అభిలాష్ (13), జాక్ (10)... వైఎంసీఏ తరఫున డెన్నిస్ సెహగల్ (12), ముస్తఫా (14), వరుణ్ (14) రాణించారు. మరో సెమీస్‌లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ 90–73తో ఈగల్స్‌ను ఓడించింది. కస్టమ్స్ జట్టులో వినయ్ యాదవ్ (18), విజయ్ కుమార్ (20), చంద్రహాస్ (19)... ఈగల్స్ తరఫున అమన్ (30), దత్త (15), రోహన్ (17) ఆకట్టుకున్నారు. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం కార్యదర్శి టి. శేష్ నారాయణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో సుచిత్ర అకాడమీ చైర్మన్ కె. ప్రవీణ్ రాజు పాల్గొన్నారు. -
పంజాబ్ కుర్రాడు.. ప్రపంచ రికార్డు!
న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన 25 ఏళ్ల సందీప్‌సింగ్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. నోట్లో ఓ టూత్‌బ్రష్ పెట్టుకొని దానిపై వేగంగా తిరుగుతున్న బాస్కెట్ బాల్‌ను 53 సెకన్లపాటు నిలిపాడు. దీంతో ‘టూత్‌బ్రష్‌పై ఎక్కువ సమయంపాటు బాస్కెట్‌బాల్‌ను తిప్పిన’ రికార్డు సందీప్‌సింగ్ పేరుమీద నమోదైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సందీప్‌సింగ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ముందుగా ఓ బాస్కెట్‌బాల్‌ను తీసుకొని దానిని ఓ టూత్‌బ్రష్‌పై పెట్టి వేగంగా తిప్పాడు. ఆ తర్వాత టూత్‌బ్రష్‌ను తిరుగుతున్న బాల్‌తో పాటు నోట్లో పెట్టుకున్నాడు. అలా దానిని 53 సెకన్ల 62 నానో సెకన్లపాటు నిలిపాడు. ఇప్పటివరకు ఎవరూ ఇంతసేపు టూత్‌బ్రష్‌పై బాస్కెట్‌బాల్‌ను నోట్లో పెట్టుకొని నిలపలేదని చెప్పాడు. అయితే దీనిని గిన్నిస్ రికార్డు నిర్వాహకులు ధ్రువీకరించారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే సందీప్ ప్రయత్నంపై అతడి సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అందివచ్చిన అవకాశాలతో ఉన్నతంగా ఎదగండి
నిజామాబాద్ స్పోర్ట్స్ (నిజామాబాద్ అర్బన్): క్రీడాకారులు నిరంతరం సాధన చేస్తూ అందివచ్చిన అవకాశాలతో ఉన్నతంగా ఎదగాలని బాస్కెట్‌బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాజేందర్‌రెడ్డి సూచించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణలో భాగంగా శుక్రవారం పాలిటెక్నిక్ మైదానంలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు నిత్యం ప్రాక్టీస్ చేస్తూ రాణించాలన్నారు. అనంతరం అథ్లెటిక్స్‌లో రాణించిన క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. బాలికల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణిగా అఖిల, బాలుర విభాగంలో బాల్‌రాజ్ ట్రోఫీలు అందుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్, జిల్లా కన్వీనర్ లక్ష్మీనారాయణభరద్వాజ్, యూత్ కన్వీనర్ రేహాన్, పులి జైపాల్, మహిళా కన్వీనర్ అపర్ణ, పీడీ సాయగౌడ్, పీఈటీలు సుమన్, నరేశ్, నాగరాజు, మూర్తి, రమేశ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
యూత్ బాస్కెట్‌బాల్ విజేత ‘తూర్పు’
పిఠాపురం టౌ¯ŒS : విశాఖపట్నంలో సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఈనెల 5 నుంచి 7 వరకు జరిగిన అంతర్ జిల్లాల యూత్ బాస్కెట్‌బాల్ పోటీల బాలుర విభాగంలో తూర్పుగోదావరి జట్టు విజేతగా నిలిచిందని జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS కార్యదర్శి ఎం.ఉపేంద్ర సోమవారం తెలిపారు. ఆదివారం విశాఖపట్నం జట్టుతో హోరాహోరీగా జరిగిన ఫైనల్స్‌లో తూర్పు జట్టు 82–61 స్కోర్ తేడాతో విజయం సాధించిందన్నారు. కాగా బాలికల విభాగంలో మూడోస్థానం కోసం జరిగిన పోటీలో తూర్పుగోదావరి జట్టు పశ్చిమ గోదావరి జట్టుతో తలపడి 38–26 స్కోర్‌తో గెలుపొందిందన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను, శిక్షణ ఇచ్చిన కోచ్‌లు పి.శ్రీనివాసరావు, ఐ.భీమేష్, మేనేజర్లు బొజ్జా సతీష్, పి.రమాదేవిలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.మురళీధర్, ఆర్.ఐ.పి. టి.వి.ఎస్ రంగారావు, అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు గన్నమనేని చక్రవర్తి, కార్యదర్శి ఉపేంద్ర, కోశాధికారి ఎ¯ŒSవీవీ శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు కె.పురుషోత్తమరావు, యర్రా జగన్నాథరావు అభినందించారు. -
అండర్–19 బాస్కెట్‌బాల్ రాష్ట్ర జట్ల ఎంపిక
రామచంద్రపురం : స్కూల్‌గేమ్స్ ఫెడరేష¯Œ¯ŒS అండర్ –19 బాలుర, బాలికల బాస్కెట్‌బాల్ రాష్ట్ర జట్లను పోటీల అబ్జర్వర్, పీడీ సీతాపతి, జిల్లా కార్యదర్శి వై.తాతబ్బాయి శనివారం ప్రకటించారు. స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడాప్రాంగణంలో మూడురోజులు నిర్వహించిన అంతర్ జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారిని రాష్ట్ర జట్లకు ఎంపిక చేశామని, ఈ నెల 9 నుంచి నూజివీడులో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ఈ జట్లు ఆడతాయన్నారు. రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి, పీడీలు జంపన రఘురాం, గెడా శ్రీనివాసు తదితరులు ఎంపికల్లో పాల్గొన్నారు. బాలుర జట్టు నాగదుర్గాప్రసాద్, సాయిపవ¯ŒSకుమార్, మణికంఠ, అశోక్‌సాయికుమార్, రామరాజు (తూర్పుగోదావరి), కె.రోహిత్‌సాయి, సురేష్, భాస్కర అవినాష్ (గుంటూరు), ఎస్కే అబ్దుల్‌నాగూర్, రామ్‌గోపాల్( కృష్ణా), ఇమ్రాన్, హర్షంత్‌కుమార్,(చిత్తూరు), డీఎస్ నిషాంక్ గుప్తా (అనంతపురం), ఆదిత్యరెడ్డి(పశ్చిమగోదావరి), రేవంత్‌కుమార్(విశాఖ), కె.సాయికుమార్, ఉల్లాస్ (కడప), నాగవంశీ(కర్నూల్). బాలికల జట్టు పద్మావతి, సుకన్య, ప్రమీల, యమున (అనంతపురం), కె.దీప్తిప్రియ, ఎస్.కె.జహరాసుహానా, దుర్గ, శ్వేత (తూర్పు గోదావరి), ఎస్కే సుష్మాభాను అఖిల్( చిత్తూరు), పూర్ణ, మాధురి (పశ్చిమగోదావరి), హిమబిందు, ప్రియాంక (కృష్ణా), నందిత, నిరోషా(విశాఖ), ఐ.డి.భారతి(కర్నూల్), మహేశ్వరి(నెల్లూరు). -
ముగిసిన బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు
► విజేతగా గోపీ గురు బుల్లెట్స్ ► రన్నరప్‌గా రఘురాం టైగర్స్ ► బాలికల విజేతగా శ్రీకాకుళం బాస్కెట్‌బాల్ జట్టు శ్రీకాకుళం న్యూకాలనీ: రెజిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ఎంహెచ్ స్కూల్లో జరుగుతున్న శ్రీకాకుళం మాజీ కౌన్సిలర్ మైలపల్లి రాములు(ఇక్కయ్య), పైడమ్మ దంపతుల స్మారక జిల్లాస్థారుు బాస్కెట్‌బాల్ ఛాంపియన్షిప్ -2016 పోటీలు శుక్రవారంతో ముగిశారుు. ముగింపు కార్యక్రమానికి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్, జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి, అంతర్జాతీయ వెటరన్ అథ్లెట్ ఎండి కాసీంఖాన్‌లు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టీఎంఎస్ ప్రకాష్, కార్యనిర్వహణ కార్యదర్శి జి.అర్జున్‌రావురెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుందరరావు, ప్రిన్సిపాల్ పి.నాగభూషణరావు, మైలపల్లి రాంబాబు, బాలమురళీకృష్ణ, బి.శ్యామ్‌సుందర్, విజయ్‌భాస్కర్, పాఠశాల హెచ్ఎం దేవదత్తానంద్, భాగ్యచంద్ర, సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఎం.రామారావు, పి.రమణమూర్తి, అర్జున్‌రెడ్డి, పిట్టా ప్రసాద్, పి.మురళిలు రిఫరీలుగా వ్యవహరించారు. అంతకుముందు డీఎస్పీ భార్గవనాయుడు ఫైనల్ మ్యాచ్‌ను ప్రారంభించారు. టోర్నీ విజేతగా గోపీ గురు బుల్లెట్స్.. రెండు రోజుల పాటు జరిగిన జిల్లాస్థారుు బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీని శ్రీకాకుళం గోపీ గురు బెల్లెట్స్ జట్టు దక్కించుకుంది. రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో శ్రీకాకుళం రఘురాం టైగర్స్ జట్టుపై 56-46 తేడాతో విజయం సాధించి విజేతగా నిలిచింది. సీనియర్స్ విభాగంలో బెస్ట్ స్కోరర్‌గా సీనియర్ కోచ్ జి.అర్జున్‌రావురెడ్డి, బెస్ట్ ప్లేయర్‌గా ఎస్.కోటేశ్వరరావు, అప్‌కమింగ్ ప్లేయర్‌గా అశోక్‌లు ప్రత్యేక టైటిళ్లను సాధించారు. ఇక జిల్లాలో మొట్టమొదటి సారిగా బాలికల జట్లు ప్రాతినిధ్యం వహించిన ఈ పోటీల్లో శ్రీకాకుళం బాస్కెట్‌బాల్ జట్టు విజేతగా నిలవగా, కె.ఆర్.స్టేడియం అథ్లెటిక్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. అండర్-14 బాలురు విభాగంలో శ్రీకాకుళం బ్లాక్స్ జూనియర్స్ విజేతగా నిలివగా, శ్రీకాకుళం బ్లూస్ జూనియర్స్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. -
జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీకి జిల్లా జట్లు
ముమ్మిడివరం : బాస్కెట్‌బాల్ నేషనల్ టోర్నమెంట్‌కు బా లురు, బాలికలను ఎంపిక చేసినట్లు ఏపీ రాష్ట్ర బాస్కెట్ బా ల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెంకల రామనాయుడు, ఇన్చార్జి కార్యదర్శి చక్రవర్తి, జాతీయ క్రీడా కారుడు నడిం పల్లి అప్పలరాజు తెలిపారు. ఈ జట్లు కర్నాటక రాష్ట్రం హాసన్‌లో ఈనెల 19 నుంచి జరి గే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడతాయన్నా రు. ఆ పోటీల్లో ప్రతిభ కనపరిచినవారు దేశం తరఫున ఆడతారన్నారు. శిక్షణ పొందిన క్రీడాకారులకు ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు స్పోర్ట్స్ కిట్లు అందజేశారు. జట్లకు ఎంపికయిన విద్యార్థులు గురువారం హాసన్ బయలుదేరారు. బాలికల జట్టు : ఎస్కే చాందిని(గుంటూరు), ఎం.ఈశ్తర్ రాణి(గుంటూరు), సీఎస్ఎస్ సుస్మిత, ఎ.జాస్మిన్ (తూర్పుగోదావరి), ఆర్.శ్వేత, వి.సాత్విక (కృష్ణా), బి.ప్రమీల(అనంతపురం), డి.నెహ్రామృత(విశాఖ), కె.హిమబిందు(కర్నూలు), సి.శ్వేతామాధురి(పశ్చిమగోదావరి), జి.అఖిల(చిత్తూరు), పి.ఉమామహేశ్వరి(గుంటూరు), ఎన్.పద్మావతి(అనంతపురం). బాలుర జట్టు : వి.నాగదుర్గా ప్రసాద్, ఎ.సాయిపవన్ కుమార్, ఎస్వీవీ సాయి కృష్ణ, ఎన్.రవితేజ, ఎం.మణికం ఠ, కె.అవినాష్, (తూర్పుగోదావరి), వి.సాయిగణేష్, ఎస్.సచిన్ (విశాఖ), వై.సాయికృష్, పి.భాస్కర్ (గుంటూరు), ఎ.సాయికుమార్(అనంతపురం), ఎం.విశాల్(చిత్తూరు), కె.కె.రెడ్డి(పశ్చిమగోదావరి), జె.ఆకాష్(కృష్ణా). ఫుట్‌బాల్ టోర్నీలో జిల్లాకు రెండోస్థానం భానుగుడి(కాకినాడ) : చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఈ నెల 10నుంచి 15వరకు నిర్వహించిన జసిద్దిన్ మెమోరియల్ సౌత్ ఇండియా ఫుట్‌బాల్ ఇన్విటేషన్ టోర్నమెం ట్లో జిల్లాజట్టు రెండోస్థానం సాధించినట్లు క్రీడాభివృద్ధి అధికారి పి.మురళీధర్ గురువారం ఓ ప్రకటనలో తెలి పారు. జట్టు తలపడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలుపొం ది ఫైనల్‌కు చేరిందని, ఫైనల్లో స్పోట్స అథారిటీ ఆఫ్ ఇండియా కర్నూల్ జట్టుతో పోటీపడి పెనాల్టీ షూటౌట్ లో 03–04 స్కోరుతో రెండవ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. క్రీడాకారులను, శిక్షకులను అభినందించారు. -
హోరాహోరీగా బాస్కెట్‌బాల్ పోటీలు
గుంటూరు స్పోర్ట్స్: డీఎస్ఆర్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్దానిక బ్రహ్మనందరెడ్డి స్డేడియంలో జరుగుతున్న 3వ దొండపాటి శ్రీనివాసరావు మెమోరియల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. పురుషుల విభాగంలో డీఎస్ఆర్ ఫ్రెండ్స్ క్లబ్, జీఎస్సీ గుంటూరు, యాదవ హైస్కూల్, వి.వి.ఐ.టి, నంబూరు, ఏఎన్‌యూ, పొలీస్ పెరేడ్ జట్టు, జె.కె.సి కళాశాల, ఏసీ కళాశాల జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. మహిళాల విభాగంలో ఏఎన్‌యూ జట్టు, జీఎస్సీ గుంటూరు, నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్, ఎన్టీఆర్ స్టేడియం జట్లు సూపర్ లీగ్ దశకు చేరుకున్నాయి. బుధవారం పురుషుల, మహిళ విభాగాలలో సెమి ఫైనల్స్, ఫైనల్స్ మ్యాచులు జరుగుతాయని డీఎస్ఆర్ క్లబ్ ప్రధాన కార్యదర్శి టీ.గురునాధం తెలిపారు. అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని చెప్పారు. -
బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్ : డీఎస్ఆర్ ఫ్రండ్స్ క్లబ్ ఆ«ధ్వర్యంలో 3వ దొండపాటి శ్రీనివాసరావు మెమోరియల్ మహిళల, పురుషుల బాస్కెట్ బాల్ జిల్లా స్దాయి టోర్నమెంట్ సోమవారం బ్రహ్మనందరెడ్డి స్టేడియంలో ప్రారంభమైంది. టోర్నమెంట్లో 16 పురుషుల, 6మహిళల జట్లు పాల్గొన్నాయి. ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకోని బాస్కెట్ బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఆకుల బాలకష్ణ క్రీడాకారులకు బూట్లను పంపిణీ చేశారు. వీఆర్ హైస్కూల్ డైరెక్టర్ వి.వెంకటేశ్వరరావు, ఆర్.భాస్కర్ రావు, పి.రవిశంకర్, టీ.గురునాధం, ఎం.రమేష్ బాబు, బాస్కెట్ బాల్ శిక్షకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు. -
బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్ : డీఎస్ఆర్ ఫ్రండ్స్ క్లబ్ ఆ«ధ్వర్యంలో 3వ దొండపాటి శ్రీనివాసరావు మెమోరియల్ మహిళల, పురుషుల బాస్కెట్ బాల్ జిల్లా స్దాయి టోర్నమెంట్ సోమవారం బ్రహ్మనందరెడ్డి స్టేడియంలో ప్రారంభమైంది. టోర్నమెంట్లో 16 పురుషుల, 6మహిళల జట్లు పాల్గొన్నాయి. ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకోని బాస్కెట్ బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఆకుల బాలకష్ణ క్రీడాకారులకు బూట్లను పంపిణీ చేశారు. వీఆర్ హైస్కూల్ డైరెక్టర్ వి.వెంకటేశ్వరరావు, ఆర్.భాస్కర్ రావు, పి.రవిశంకర్, టీ.గురునాధం, ఎం.రమేష్ బాబు, బాస్కెట్ బాల్ శిక్షకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు. -
అండర్ 17 బాస్కెట్ బాల్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు
రామచంద్రపురం: అండర్ 17 జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడాప్రాంగణంలో నిర్వహించారు. బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి. స్టాలిన్ ఈపోటీలను ప్రారంభించారు. రాష్ట్ర అసోసియేషన్ కోశాధికారి గన్నమని చక్రవర్తి మాట్లాడుతూ ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు ముమ్మిడివరంలో జరిగే అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా బాలుర, బాలికల జట్ల ప్రాపబుల్స్ను ఎంపిక చేసినట్టు తెలిపారు. బాలుర, బాలికల జట్లకు 20 మంది చొప్పున ఎంపిక చేశామన్నారు. వీరికి ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తామన్నారు. శిక్షణానంతరం ఫైనల్ జట్టును ప్రకటిస్తామన్నారు. అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐ. భీమేష్, సంయుక్త కార్యదర్శి ఎం. ఉపేంద్ర, కోశాధికారి ఎన్వీవీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జీడీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవాలి
జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జాకీర్ మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీలో జిల్లా జట్లు విజేతగా నిలవాలని జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జాకీర్ అడ్వకేట్ అన్నారు. హైదరాబాద్ జింఖానా మైదానంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు వరకు జరగనున్నS సబ్‌జూనియర్ రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్లు తరలివెళ్లాయి. ఈ సందర్భంగా ఆయన జిల్లా జట్లను అభినందించారు. ఏకాగ్రత, సమష్టిగా ఆడి విజేతగా నిలవాలని కోరారు. జిల్లాలో బాస్కెట్‌బాల్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యం ప్రదర్శించే క్రీడాకారులకు తమవంతు సహకారం ఉంటుందని వెల్లడించారు. ఈనెల 5న స్థానిక స్టేడియంలో సెలక్షన్ నిర్వహించి జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మీర్ అర్షద్ అలీ, డీఎస్ఏ కోచ్ ఖలీల్ పాల్గొన్నారు. బాలుర జట్టు: అఫ్రోజ్ అలీ, ఆది శేషవ్, ప్రశాంత్, సయ్యద్ ఆసిఫ్, ఎండీ ఆమేర్, ఉదయ్‌కుమార్, శివప్రసాద్, సాయిదీపక్, రోహిత్‌కుమార్, నవీన్‌కుమార్, రాంగోపాల్, శ్రీనివాస్. కోచ్, మేనేజర్లు ఎండీ ఖలీల్, మహేష్‌కుమార్. బాలికల జట్టు: ఆర్షిత, ప్రియాంక, స్వర్ణలత, తేజస్విని, రిషితారెడ్డి, సుష్మ, శ్రీలత, వందన, సంధ్యారాణి, భవాని, తనుజ, భువనేశ్వరి, హరిణి రెడ్డి, కోచ్, మేనేజర్లు శైలజ, అరవింద్. -
బాస్కెట్‌బాల్‌పోటిల్లో లోకేష్‌కు స్వర్ణం
బాలాజీచెరువు( కాకినాడ) : జాతీయ బాస్కెట్ బాల్ పోటీల్లో తమ విద్యార్థి గొల్లపల్లి లోకేష్ (బీసీఏ) ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించినట్టు ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాల కో–ఆర్డినేటర్ బీఈవీఎల్ నాయుడు బుధవారం తెలిపారు. ఆగస్టు 26 నుంచి 29వ తేదీ వరకూ తమిళనాడులో జరిగిన 6వ జాతీయ బాస్కెట్‌బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడిన లోకేష్ ప్రథమ స్థానం సాధించాడన్నారు. లోకేష్‌ను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి, కార్యదర్శి కృష్ణదీపక్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ సి.సత్యనారాయణ, ఫిజికల్ డైరెక్టర్ డి.ప్రసాద్ తదితరులు అభినందించారు. -
సెప్టెంబర్ 2న బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
టూటౌన్ : సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు మెదక్ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు వచ్చే నెల 2వ తేదిన నల్లగొండలోని సెయింట్ ఆల్ఫెన్సస్ స్కూల్లో ఎంపిక జరపనున్నారు. బాస్కెట్‌బాల్ అండర్–14 బాల బాలికల జట్లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కరెంట్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వయసు ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకోని రావాలని కోరారు. ఇతర వివరాల కొరకు 9848432182 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. -
27 నుంచి రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు
మార్టేరు, (పెనుమంట్ర) : క్రీడా గ్రామంగా పేరొందిన మార్టేరులో స్వర్గీయ పడాల ప్రహ్లాదరెడ్డి మెమోరియల్ రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ పోటీలను నిర్వహించనున్నారు. గ్రామంలోని వేణుగోపాల స్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. -
బాస్కెట్‌బాల్ పోటీలకు ఎ.కోడూరు విద్యార్థి
కె.కోటపాడు: రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ జట్టుకు ఎ.కోడూరు జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి యడ్ల ప్రసాద్ ఎంపికయ్యాడు. ఈనెల 21న విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీ గ్రౌండ్స్‌లో జరిగిన అండర్ 17 విభాగం రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుల ఎంపికలో ప్రసాద్ మంచి ప్రతిభ కనబర్చాడు. దీంతో రాష్ట్రస్థాయి జట్టులో పాల్గొననున్నాడు. ప్రసాద్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.అనురాధ, పీఈటీ కె.చిట్టిప్రసాద్, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు. -
బాస్కెట్ బాల్ విజేత ఎస్సార్పీ జట్టు
రన్నరప్‌గా కొత్తగూడెం, కార్పొరేట్ జట్టు ముగిసిన కంపెనీ స్థాయి పోటీలు రెబ్బెన(ఆదిలాబాద్) : బెల్లంపల్లి ఏరియా పరిధి గోలేటి టౌన్‌షిప్‌లోని శ్రీ భీమన్న స్టేడియంలో జరిగిన సింగరేణి కంపెనీ స్థాయి బాస్కెల్ బాల్ పోటీల్లో శ్రీరాంపూర్ జట్టు విజయం సాధించింది. వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల నుంచి ఆరు జట్లు పాల్గొన్నాయి. పోటీలు మంగళవారం, బుధవారం రెండు రోజులపాటు కొనసాగాల్సి ఉండగా వర్షం కారణంగా మంగళవారం రాత్రే పూర్తి చేశారు. పూల్–ఏ, పూల్–బీ విభాగాల్లో పోటీలు కొనసాగగా ఫైనల్లో కొత్తగూడెం, కార్పొరేట్ జట్టు, శ్రీరాంపూర్(ఎస్సార్పీ) జట్టు తలపడ్డా యి. కొత్తగూడెం జట్టు 15 పాయింట్లు సాధించగా శ్రీరాంపూర్ జట్టు 16 పాయింట్లు సాధించి ఒక పాయింట్ తేడాతో విజయం సాధించింది. విన్నర్, రన్నర్ జట్లకు ఏరియా జనరల్ మేనేజర్ కె.రవిశంకర్, ఎస్వోటూ జీఎం కొండయ్య బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ గౌరవ కార్యదర్శి రాజేశ్వర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సదాశివ్, ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యద ర్శి ఎస్.తిరుపతి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ, క్రీడాకారులు కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌కు షాకిచ్చిన చెన్నై
► యూబీఏ ప్రొ బాస్కెట్‌బాల్ లీగ్ పుణే: యూబీఏ ప్రొ బాస్కెట్‌బాల్ లీగ్‌లో హైదరాబాద్ స్కై జట్టు 93-107 స్కోరు తేడాతో చెన్నై స్లామ్ చేతిలో పరాజయం చవిచూసింది. ఇక్కడి బాలేవడి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన ఈ లీగ్ పోరులో చెన్నై ఆటగాళ్లు అదరగొట్టారు. క్రమం తప్పకుండా పాయింట్లు చేయడంలో సఫలమయ్యారు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి చెన్నై 64-54తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ద్వితీయార్ధంలోనూ చెన్నై జోరును హైదరాబాద్ ఆటగాళ్లు అడ్డుకోలేకపోయారు. స్లామ్ జట్టు తరఫున జైరామ్ (31) అద్భుతంగా రాణించాడు. మిగతా వారిలో గోపాల్ 21, రామ్ 14 పాయింట్లు చేశారు. హైదరాబాద్ జట్టులో థామస్ (25), మహేశ్ (25) పోరాడారు. మహిపాల్ 17 పాయింట్లు సాధించాడు. -
ఉత్సాహంగా బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ శిక్షణ
అనంతపురం స్పోర్ట్స్ : స్పెయిన్ బాస్కెట్‌బాల్,ఫుట్‌బాల్ క్రీడాకారుల ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ ఆదివారం ఉత్సాహంగా సాగింది. యూఈఎస్సీ,క్యూబాస్కెట్ సెంట్కుగాట్ బృందం ఇండోర్, ఎస్ఎస్బీఎన్ కళాశాలలో బాస్కెట్‌బాల్, సెయింట్ కుగాట్ ఫుట్‌బాల్ క్లబ్ ఆర్డీటీ స్టేడియంలో ఇస్తున్న ఫుట్‌బాల్ శిక్షణ రెండో రోజుకు చేరింది. క్రీడాకారులకు బేసిక్స్ తెలియజేశారు. ఆటలో మెలకువలకంటే నిబంధనలు, ఏకాగ్రత, ఫిట్‌నెస్‌పై సూచనలు, సలహాలు అందజేశారు. ఈ శిబిరంలో బాస్కెట్‌బాల్ కోచ్ ఓరియల్ ఆంత్రాస్, ఫుట్‌బాల్ క్లబ్ కోఆర్డినేటర్ జామగార్సియ పాల్గొన్నారు. -
మూడో స్థానంలో భారత్
డోపింగ్ నిబంధనల ఉల్లంఘన దేశాల జాబితా వెల్లడి న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రీడాపోటీల్లో నిలకడగా రాణించలేకపోతున్నా.... డోపింగ్ నిబంధనల ఉల్లంఘనలో మాత్రం మనోళ్లు ఘనులే అని నిరూపించుకున్నారు. 2014లో డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించిన (ఏడీఆర్‌వీ) జాబితాలో 96 కేసులతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. వివిధ జాతీయ సంస్థలు పంపిన నివేదికల ఆధారంగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఈ జాబితాను రూపొందించింది. రష్యా (148), ఇటలీ (123) తొలి రెండు స్థానాల్లో ఉండగా, టాప్-10 వరుసగా బెల్జియం (91), ఫ్రాన్స్ (91), టర్కీ (73), ఆస్ట్రేలియా (49), చైనా (49), బ్రెజిల్ (46), దక్షిణ కొరి యా (43)లు ఉన్నాయి. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా డోపింగ్‌లో పట్టుబడ్డ అథ్లెట్లను హెచ్చరించినా లేదా అనర్హత వేటు వేసినా... ఏడీఆర్‌వీ కేసుగా నమోదు చేస్తారు. భారత్‌లో 96 కేసులు నమోదు కాగా ఇందులో నాలుగు నాన్ ఎనలైటికల్ కేసులు ఉన్నాయి. ఓవరాల్‌గా పోటీల సందర్భంగా 79 (56 పురుషుల, 23 మహిళలు), పోటీలు లేనప్పుడు 13 (9 పురుషులు, 4 మహిళలు) నమోదయ్యాయి. డోప్ ఉల్లంఘనులు అత్యధికంగా అథ్లెటిక్స్ (29), పవర్‌లిఫ్టింగ్ (23), వెయిట్ లిఫ్టింగ్ (22)లో ఉండగా... బాస్కెట్‌బాల్ (3), జూడో (3), తైక్వాండో (3), రెజ్లింగ్ (3), ఉషు (3), బాక్సింగ్ (2)లో తక్కువ సంఖ్యలో ఉన్నారు. -
నాడు అశాంతి... నేడు అభివృద్ధి!
అంగోలా అభివృద్ధిపథంలో దూసుకుపోవడానికి అవసరమైన వనరులు ఉన్నప్పటికీ అశాంతి కారణంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండాల్సి వచ్చింది అంగోలా. ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈ దేశం సుదీర్ఘకాలం పాటు పోర్చుగీసువారి వలస దేశంగా ఉంది. తమ ప్రయోజనాల కోసం ఈ భూభాగాన్ని వాడుకో వడం తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు పోర్చు గీసు పాలకులు. పదిహేడు, పద్దెనిమిది శతాబ్దాల్లో అంగోలా ... పోర్చుగీసు పాలకులకు ‘బానిసలు విరివిగా దొరికే ప్రాంతం’గానే ఉండిపోయింది. ఇక్కడి నుంచి బానిసలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. తరువాతి కాలంలో ఈ బానిస వ్యాపారం రద్దయిపోయినప్పటికీ... తిరుగుబాటు ఉద్యమాలు వెల్లువెత్తాయి. గెరిల్లా యుద్ధం మొదలైంది. చిత్రమేమిటంటే, పోర్చుగీసు రాజ్యంపై సాయుధపోరాటానికి దిగిన వివిధ దళాల మధ్య ఐక్యత లేకపోగా ఒకరిపై ఒకరు దాడులకు దిగేవాళ్లు. ఈ అనైక్యత తరువాతి కాలంలో దేశంలో సామాజిక అశాంతికి దారి తీసింది. పోర్చుగల్ నుంచి 1975లో స్వాతంత్య్రం పొందింది అంగోలా. స్వాతంత్య్రం వచ్చిన మాటేగానీ శాంతి లేదు. దేశంలో అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చింది. రాజ్యాధికారం కోసం ‘పీపుల్స్ మూవ్ మెంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ అంగోలా’, ‘నేష నల్ యూనియన్ ఫర్ ది టోటల్ ఇండిపెండెన్స్ ఆఫ్ అంగోలా’ల మధ్య పోరు మొదలైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే సంతోషాన్ని ఈ పోరు మాయం చేసింది. దేశం అతలా కుతలం అయింది. దేశంలో శాంతిని నెలకొల్ప డానికి 1991లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ అది 1992లో విఫలమైంది. తిరిగి 1994లో కాల్పల విరమణ ఒప్పందం కుదిరింది. 1998లో ఈ ఒప్పదం విఫలమైంది. చాలాకాలం పాటు కొనసాగిన అంతర్యుద్ధం 2002లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం భారీగా జరిగింది. అయినప్ప టికీ వెనక్కి తగ్గకుండా యుద్ధశిథిలాల్లో నుంచి లేచి తనను తాను పునర్నిర్మించుకుంటూ కొత్త అడుగులు వేసింది. 2010లో దేశంలో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. పాలనాపరంగా చెప్పాలంటే... అంగోలా 8 ప్రావిన్సులుగా, 163 మున్సిపాలిటీలుగా విభజితమైంది. చాలాకాలం పాటు వలస దేశంగా ఉండడం వల్ల అంగోలా కళాసంస్కృతులపై పోర్చుగీసు ప్రభావం కనిపిస్తుంది. అంగోలా, నమీబియా సరిహద్దుల్లో ఉన్న రౌకెనా జలపాతం ప్రకృతి అందాలకు ప్రతిబింబం. విస్తారమైన ఖనిజ సంపద, పెట్రోలియం నిల్వలు ఉండటంతో తన ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు అంగోలా అంటే అశాంతి. ఇప్పుడు మాత్రం అభివృద్ధి! టాప్ టెన్ 1. అంగోలాలో ఆదరణ ఉన్న క్రీడ బాస్కెట్‌బాల్. 2. అంగోలాలో సుంబే సంగీతం ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ‘సుంబే మ్యూజిక్ ఫెస్టివల్’ ఘనంగా జరుగుతుంది. 3. ప్రధాన భాష పోర్చుగీస్ అయినా బంటు, కికోంగో మొదలైన ఆఫ్రికన్ భాషలు కూడా మాట్లాడతారు. 4. చమురు, వజ్రాలు ప్రధాన ఆర్థిక వనరు. 5. చైనాకు ఎగుమతి అయ్యే చమురులో అత్యధిక భాగం అంగోలా నుంచే ఎగుమతి అవుతుంది. 6. అంగోలాలో అతి ఎత్తయిన పర్వతం... సెర్రా మౌంటెన్. దీని ఎత్తు 2,306 మీటర్లు. 7. అంగోలా రాజధాని లువాండాను ‘ప్యారిస్ ఆఫ్ ఆఫ్రికా’ అని పిలుస్తుంటారు. 8. అంగోలాలో మరణాల రేటు ఎక్కువ. 9. ‘డ్రెడ్లాక్ హెయిర్ స్టయిల్’ ఇక్కడే పుట్టింది. 10. అంగోలా అందాలరాశి లైలా లోపెజ్ 2011లో ‘మిస్ యూనివర్స్’ కిరీటాన్ని గెలుచుకుంది. దేశం : అంగోలా రాజధాని : లువాండా అధికార భాష : పోర్చుగీస్ కరెన్సీ : క్వాంజా జనాభా : 2 కోట్ల 43 లక్షల 83 వేలు (సుమారుగా) -
బై బై ‘బ్లాక్ మంబా’
లాస్ ఏంజిల్స్: నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) స్టార్ ఆటగాడు కోబ్ బ్రయాంట్ తన రెండు దశాబ్దాల అద్భుత కెరీర్‌కు ముగింపు పలికాడు. తన కెరీర్ ఆద్యంతం లాస్ ఏంజిల్స్ లేకర్స్ జట్టుకే ఆడిన 37 ఏళ్ల కోబ్ తన అసమాన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించాడు. బుధవారం రాత్రి స్టేపుల్స్ సెంటర్స్‌లో ఉతా జాజ్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌లోనూ సత్తా చూపిస్తూ ఏకంగా 60 పాయింట్లు సాధించాడు. ఇది ఏ ఆటగాడి చివరి మ్యాచ్‌లోనైనా రికార్డు స్కోరు. దీంతో లేకర్స్ 101-96 తేడాతో నెగ్గింది. బ్లాక్ మంబా అనే ముద్దుపేరుతో పిలుచుకునే ఈ స్టార్ చివరి ఆటను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. బాస్కెట్‌బాల్ చరిత్రలోనే జత టిక్కెట్లకు అత్యధిక రేటు (రూ.18 లక్షల 30 వేలు) పలికింది. మరోవైపు హాలీవుడ్ స్టార్స్‌తో పాటు ఇతర క్రీడా దిగ్గజాలు కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించారు. -
వేధింపులు తట్టుకోలేక...
న్యూఢిల్లీ: వేధింపులను తట్టుకోలేక జాతీయస్థాయి వర్ధమాన క్రీడాకారిణి అర్జు ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థి, బంధువు కూడా అయిన దీపేశ్ శంకర్ అనే యువకుడి వేధింపులను భరించలేక ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ ఇంటి దీపం, క్రీడాజ్యోతి ఆరిపోయిందని అర్జు కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. అర్జు తల్లిదండ్రులిద్దరూ ఉన్నతోద్యోగులు. అన్న శివం డాక్టర్ వృత్తిలో వున్నాడు. చిన్నప్పటినుంచి ఆమెకు బాస్కెట్ బాల్ అంటే ప్రాణం. ఈ నేపథ్యంలో పాఠశాల స్థాయిలోనే కెప్టెన్‌గా ఎదిగింది. ఇటీవల గుజరాత్ లో జరిగిన జాతీయ బాస్కెట్ బాల్ పోటీల్లో తన జట్టును రెండవ స్థానంలో నిలిపింది. భవిష్యత్తు మరింత ఎత్తుకు ఎదగాలని కలలు కంది. కానీ ఓ మృగాడి రూపంలో విధి ఆమెతో ఆడుకుంది. అర్జును తరచూ వేధించే దీపేశ్ శుక్రవారం ఇంటికి వచ్చి మరీ గొడవ పడ్డాడు. సోదరుడు శివం అడ్డుకోవడంతో ఇద్దరి మధ్యా తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో శివం ఫిర్యాదు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంతో తీవ్ర మానసిక వేదనకు గురైన అర్జు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. -
‘గ్రౌండ్’వర్క్ పూర్తి
సీఎస్ఏ సౌత్ ఇండియా స్పోర్ట్సమీట్కు ఖమ్మంలోని గుట్టలబజార్ సెయింట్ జోసెఫ్ పాఠశాల క్రీడా మైదానం ముస్తాబవుతోంది. ఈనెల 21,22,23 తేదీల్లో జరుగనున్న ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన 17 ఉన్నత పాఠశాలలు, 11 ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 1,500 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. వీరికి పాఠశాలలోనే భోజనం, వసతి కల్పించనున్నారు. ఈ పోటీలు ఆరు అంశాల్లో జరగనున్నాయి. సీనియర్ బాలబాలికలు, జూనియర్ బాలబాలికలు విభాగంలో నిర్వహించనున్నారు. సీనియర్ బాలబాలికల విభాగంలో బాస్కెట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయి. సీనియర్ బాలుర విభాగంలో కబడ్డీ, బాలికల విభాగంలో త్రోబాల్ పోటీలు నిర్వహిస్తారు. జూనియర్ బాలబాలికల విభాగంలో ఖోఖో, అథ్లెటిక్స్‌లోని 100మీ, 200మీ పరుగుపందెం పోటీలు జరుగుతాయి. బాలురకు మాత్రమే కబడ్డీ పోటీలు నిర్విహ స్తారు. ఈ టోర్నీకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పాఠశాల ఉపాధ్యాయురాలు రెవరెండ్ సిస్టర్ ఎన్.నక్షత్రం, ముఖ్య పర్యవేక్షకులుగా పాఠశాల సీనియర్ పీఈటీ శివారెడ్డి వ్యవహరిస్తున్నారు. -
క్రీడాపోటీల్లో గజరాజుల సందడి
శివమొగ్గ : సక్రబైలు అటవీప్రాంతంలో వన్యజీవి సప్తాహ సమారంభం కార్యక్రమంలో భాగంగా ఆదివారం అటవీశాఖ వన్యజీవి విభాగం, మహానగరపాలికె, జిల్లా పర్యాటకశాఖ అభివృద్ధి సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏనుగుల పండుగ (ఆనెహబ్బ) కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేబీ.ప్రసన్నకుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది ఏనుగులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. క్రికెట్, పుట్‌బాల్, బాస్కెట్‌బాల్, నృత్యం, చెరుకులు తినే పోటీలు, నీరుచిమ్మడం తదితర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. పోటీల్లో గీతా, గంగ, కపిల, సాగర, సూర్య, ఇందిరా, అమృత, అలె మొత్తం 8 ఏనుగులు పోటీల్లో పాల్గొన్నాయి. చిన్న ఏనుగులైన అమృత, అలె చేసిన గంగ్నమ్స్టైల్ పాటకు, చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో పాటలకు ఈ రెండు ఏనుగుల చేసిన నృత్యం ఆహుతులను అలరించింది. ఏనుగుల క్రీడాపోటీలను తిలకించడానికి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేశారు. ఈ సందర్భంగా అటవీశాఖ సీనియర్ అదికారి స్మితాబిజ్జూరు, మేయర్ ఖుర్షీదాభాను తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ జట్లకే టైటిల్స్
అంతర్ జిల్లా సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నీ ఎల్బీ స్టేడియం: తెలంగాణ అంతర్ జిల్లా సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ బాలబాలికల జట్లు టైటిల్స్ నెగ్గాయి. నల్లగొండలో ఇటీవల జరిగిన ఈ పోటీల్లో హైదరాబాద్ బాలికల జట్టు 28-14 పాయింట్ల తేడాతో ఫైనల్లో ఖమ్మంపై నెగ్గింది. తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి హైదరాబాద్ 12-8తో ఆధిక్యాన్ని సాధించింది. ధర్తీ దేవి రెడ్డి, భావన చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. బాలుర విభాగం ఫైనల్లో హైదరాబాద్ 37-18తో అవలీలగా వరంగల్‌పై ఘనవిజయం సాధించింది. వెంకట్, దినేష్‌లు చక్కటి ప్రతిభను కనబర్చారు. -
స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకున్నాను!
- అపూర్వి చండేలా, షూటర్ చిన్నప్పటి నుంచి ఆటలు అంటే చాలా ఇష్టం. బాస్కెట్ బాల్ బాగా ఆడేదాన్ని. స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకునేదాన్ని. అభినవ్ బింద్రా ఒలింపిక్ గోల్డ్ గెలుచుకున్న తరువాత అది చాలామందిలో స్ఫూర్తి నింపింది. అందులో నేను కూడా ఒకరిని. షూటర్ కావాలనుకోవడానికి ఇదే కారణం. నా తల్లిదండ్రులు తమ కోరికలను నా మీద ఎప్పుడూ రుద్దలేదు. అభిరుచికి తగిన స్వేచ్ఛను ఇచ్చారు. కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకోవడానికి ఆ ప్రోత్సాహమే వెన్నుదన్నుగా నిలచింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలుచుకోవడం నా జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పింది. అది మాటలకు అందని అద్భుత భావన. నా ఫస్ట్ నేషనల్ టైటిల్‌ను 2012లో గెలుచుకున్నాను. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం నా లక్ష్యం... ఒలింపిక్స్‌లో క్వాలిఫై కావడం. రోజూ యోగా, ధ్యానం చేస్తాను. చాలా దూరం పరుగెడతాను. ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఏమాత్రం వీలున్నా కొత్త ప్రదేశాలు చూడడానికి ప్రాధాన్యత ఇస్తాను. -
నేడు చైనా యుద్ధ్దనౌకల రాక
విశాఖపట్నం,న్యూస్‌లైన్: చైనా నావికా దళానికి చెందిన రెండు నౌకలు శనివారం విశాఖలోని తూర్పు నావికా దళానికి చేరుకోనున్నాయి. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పీఎల్వీ నేవీకి చెందిన జింఘీ, వీఫింగ్ అనే ఈ రెండు నౌకలు రానున్నాయి. నౌకలతో పాటు వచ్చే చైనా నావికాదళాధికారులు ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అనిల్ చోప్రాతో భేటీ అవుతారు. అన ంతరం విశాఖలోని పలు యూనిట్లను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఈస్ట్రన్ ఫ్లీట్ జట్లతో పిఎల్ఎ నేవీ దళ సభ్యులు బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు అడనున్నారు. భారత్‌తో పాటు ఆసియన్ దేశాలైన మయన్మార్, ఇండోనేషియా, వియత్నాంలతో సత్సంబంధాలలో బాగంగా ఈ యుద్ధ నౌకలు విశాఖ వస్తున్నాయి. 20న విశాఖ నుంచి నౌకలు తిరుగు పయనం కానున్నాయి. -
‘డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్’
-
ఆంధ్రప్రదేశ్ ఓటమి
న్యూఢిల్లీ: జాతీయ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ పురుషుల జట్టు 31-87 తేడాతో రాజస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో నిహాల్ యాదవ్ 8, బాజిద్ బాషా 6 పాయింట్లతో రాణించినా.. ఏపీ జట్టు నాలుగు క్వార్టర్లనూ కోల్పోయింది. రాజస్థాన్ వరుసగా 21-16, 24-2, 13-4, 29-9 తేడాతో ఆధిక్యం ప్రదర్శించింది. మరో మ్యాచ్‌లో ఇండియన్ రైల్వేస్ జట్టు 80-58 తేడాతో ఛత్తీస్‌గఢ్‌ను ఓడించింది. మహిళల విభాగంలో మహారాష్ట్ర 60-56 తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై, పంజాబ్ 79-59తో తమిళనాడుపై, కర్ణాటక 75-67తో పశ్చిమ బెంగాల్‌పై గెలుపొందాయి. -
క్రీడా పోటీల్లో ప్రతిభ చూపాలి
వరంగల్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొనే విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపితే భవిష్యత్‌లో మంచి అవకాశాలుంటాయని అండర్-19 ఎస్జీఎఫ్ఐ ప్రెసిడెంట్, డీవీఈఓ (జిల్లా వృత్తి విద్యాధికారి) రాజేంద్రప్రసాద్ అన్నారు. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం ఆయనబాస్కెట్బాల్, నెట్‌బాల్ సెలక్షన్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఎదుగుదలకు బీజం పడుతుందని... దాన్ని అందిపుచ్చుకున్న వారే భవిష్యత్‌లో విజయాలు సాధిస్తారన్నారు. ఎంపికైన జట్లు నవంబర్ 8, 9, 10వ తేదీల్లో ఖమ్మం, చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. కార్యక్రమంలో అండర్-19 ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రామ్మూర్తి, డిప్యూటీ డీవీఈఓ రమణారావు, ఫిజికల్ డెరైక్టర్లు అశోక్‌కుమార్, అనూప్‌కుమార్, రాజిరెడ్డి, రామన్న, రమేష్, ఐలయ్య, శ్రీనివాస్, చార్లీ, జితేందర్‌నాథ్, రోహిణిదేవి, శ్రీదేవి, రవి, కుమార్ పాల్గొన్నారు. కాగా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో బాస్కెట్‌బాల్ బాలుర జట్టు కోచ్‌గా పీడీ రామన్న, మేనేజర్‌గా కుమా ర్... బాలికల జట్టుకు కోచ్‌గా శ్రీదేవి, మేనేజర్ గా శారద... నెట్‌బాల్ బాలుర జట్టుకు కోచ్‌గా ఐలయ్య... బాలికల జట్టుకు కోచ్‌గా రమేష్, మేనేజర్‌గా ఐలయ్య వ్యవహరించనున్నారు. ఎంపికైన జట్ల వివరాలు బాస్కెట్‌బాల్ (బాలురు) : అశోక్, రాజేష్, సందీప్, శ్రీధర్, నాగేం దర్, సాదీక్, అనిల్‌కుమార్, మనోజ్,అబ్దుల్, నరేష్, కిరణ్‌కుమార్, మునీర్, పవన్, రాజశేఖర్ బాలికలు : పుష్ప, రమ్యశ్రీ, కళ్యాణి, స్రవంతి, దీపిక, సంకీర్తన, మానస, శ్రీకన్య, మానస, కళ్యాణి, నన్యశ్రీ, మమత, మనీషా, రమ్య, ప్రియాంక నెట్‌బాల్ (బాలురు) : మహేందర్, రంజిత్, ప్రవీణ్, సురేష్, రామక్రిష్ణ, కుమార్, రఘుపతి, హరీష్, నవీన్, పాషా, శివాజి, రాజు, రాకేష్, ప్రేమ్‌సాగర్, రాజు బాలికలు : అపర్ణ, అనూష, స్వప్న, స్నేహా రాణి, మానస, విజయ, పావని,అనూష, శకుం తల, అనూషజ్యోతి, కృష్ణవేణి, దీపిక, రమ్య -
ముగిసిన ఆటలు..ఆకట్టుకున్న ‘ఔట్రీచ్’
కేఎంసీ, న్యూస్‌లైన్ : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఈ నెల 17వ తేదీ నుంచి మెడికోలు నిర్వహిస్తున్న ఉత్కర్ష్-2013 కార్యక్రమంలో సోమవారంతో ఆటల పోటీలు ముగిశాయి. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, జావెలిన్ త్రో, డిస్కస్‌త్రో, షాట్‌పుట్, బాస్కెట్‌బాల్, షటిల్, బాల్‌బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఆటల్లో ఫైనల్స్ జరిగాయి. దాదాపు అన్ని విభాగాల్లోనూ రీగన్స్ బ్యాచ్ ఆధిపత్యం ప్రదర్శించింది. మెడికోల బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ నవ్వుల్లో ముంచెత్తింది. కళాశాల ప్రాంగణంలో అరేలియన్ బ్యాచ్ డిజైన్ చేసిన ఉత్కర్ష్-2013 లోగో అందరినీ ఆకట్టుకుంది. మ్యూజియం సందర్శన స్కూల్ ఔట్రీచ్ ప్రోగ్రాంలో భాగంగా మెడికోలు ఎంపిక చేసిన 30 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 200మంది విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి సోమవారం కేఎంసీకి చేరుకుని అనాటమీ, ఫోరెన్సిక్ మ్యూజియంలను సందర్శించారు. మెడికోలు వివరించిన పలు వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంచందర్దరక్, సంబంధిత విభాగాల హెచ్ఓడీలు మానవ శరీర అవయలవాలను చూ పిస్తూ వాటి ప్రయోజనాలను, అవి పనిచేసే విధానాన్ని విద్యార్థులకు తెలిపారు. అనంతరం ఫోరెన్సిస్ విభాగంలో మెడికోలు విద్యార్థులకు పలు ఆసక్తికరమైన అంశాలను వివరిం చారు. వేలిముద్రలు కనుగొనే విధానం, ఐడెం టిఫిటికేషన్, డెత్, బర్త్ సర్టిఫికెట్ల జారీ తదితర అంశాలను క్షుణ్ణంగా వివరించారు. అనంతరం మెడికోలు విద్యార్థులకు ఫ్రీ హెల్త్ చెకప్ చేశా రు. ఔట్రీచ్ ప్రోగ్రాంలో భాగంగా అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎన్ఆర్ఐ భవన్లో కళాశాల ప్రిన్సిపాల్ ప్రశంసా పత్రాలు, నగదు బహుమతి అందించారు. -
సెమీఫైనల్లో సెయింట్ ఆండ్రూస్
జింఖానా, న్యూస్‌లైన్: డాక్టర్ ఇమాన్యుయల్ స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నీలో ఆతిథ్య సెయింట్ ఆండ్రూస్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బోయిన్‌పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్ గ్రౌండ్లో సోమవారం ఉత్కంఠభరితంగా జరిగిన బాలుర విభాగం క్వార్టర్ఫైనల్లో సెయింట్ ఆండ్రూస్ జట్టు 39-36తో మెరిడియన్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై విజయం సాధించింది. మొదటి అర్ధభాగంలో మెరిడియన్ జట్టు 21-16తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలోనూ మెరిడియన్ ఆటగాళ్లు కదం తొక్కడంతో ఆండ్రూస్‌పై ఆధిక్యతను చాటింది. ఆండ్రూస్ తరఫున జియాన్ 19, జోయెల్ 8, జాషువా 8 పాయింట్లు చేశారు. మెరిడియన్ జట్టులో సాద్ (14) రాణించాడు. ఇరు జట్ల స్కోరు 29-29తో సమం కావడంతో అదనపు సమయం ఆడించారు. ఇందులోనూ మెరిడియన్ ఆటగాళ్లు సత్తాచాటడంతో 36-35తో ఆండ్రూస్‌పై గెలిచే స్థితిలో నిలిచింది. అయితే చివరి నిమిషంలో జియాన్, జాషువా చెరో 2 పాయింట్లు చేయడంతో ఆండ్రూస్ 39-36తో గెలుపొందింది. మిగతా క్వార్టర్స్ పోటీల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 23-4తో డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 18-0తో సెయింట్ మైకేల్స్ స్కూల్‌పై, చిరెక్ పబ్లిక్ స్కూల్ 18-12తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించాయి. బాలికల విభాగంలో చిరెక్ పబ్లిక్ స్కూల్ 27-7తో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌పై గెలిచింది. చిరెక్ జట్టులో సంహిత (10), నటాష (5), హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టులో రష్మిత (2) రాణించారు. మిగతా క్వార్టర్స్ పోటీల్లో హోలీ ఫ్యామిలీ హైస్కూల్ 14-3తో సెయింట్ ఆండ్రూస్ స్కూల్‌పై, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ 18-2తో సెయింట్ పాయ్స్ గర్ల్స్ హైస్కూల్‌పై, సెయింట్ ఆంథోనీస్ గర్ల్స్ హైస్కూల్ 11-10తో ఇండస్ వరల్డ్ స్కూల్‌పై విజయం సాధించాయి.