సాక్షి, హైదరాబాద్: సీసీఓబీ ఆల్‌స్టార్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో బ్రహ్మపుత్ర జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. సిటీ కాలేజి బాస్కెట్‌బాల్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో బ్రహ్మపుత్ర 78–60తో కృష్ణపై గెలుపొందింది. విజేత జట్టు తరఫున బాషా, శివ చెరో 22 పాయిం ట్లతో చెలరేగారు. విషు 11 పాయింట్లు సాధించాడు. కృష్ణ తరఫున చంద్రహాస్ 27 పాయింట్లతో విజృంభించాడు.
అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో డీఎస్పీ విష్ణుమూర్తి, హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను, నగదు బహుమతులను అందజేశారు. విజేత జట్టుకు రూ. 12,000, రన్నరప్‌కు రూ.10,000 ప్రైజ్‌మనీగా లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment