basketball league
-
బ్రహ్మపుత్ర జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: సీసీఓబీ ఆల్‌స్టార్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో బ్రహ్మపుత్ర జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. సిటీ కాలేజి బాస్కెట్‌బాల్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ఫైనల్లో బ్రహ్మపుత్ర 78–60తో కృష్ణపై గెలుపొందింది. విజేత జట్టు తరఫున బాషా, శివ చెరో 22 పాయిం ట్లతో చెలరేగారు. విషు 11 పాయింట్లు సాధించాడు. కృష్ణ తరఫున చంద్రహాస్ 27 పాయింట్లతో విజృంభించాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో డీఎస్పీ విష్ణుమూర్తి, హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను, నగదు బహుమతులను అందజేశారు. విజేత జట్టుకు రూ. 12,000, రన్నరప్‌కు రూ.10,000 ప్రైజ్‌మనీగా లభించాయి. -
చాంపియన్స్ ఓక్రిడ్జ్, ఫ్యూచర్ కిడ్స్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ స్కూల్ బాస్కెట్‌బాల్ లీగ్ (ఐఎస్బీఎల్)లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ జట్లు విజేతలుగా నిలిచాయి. హైదరాబాద్ బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) వేదికగా మంగళవారం జరిగిన బాలుర ఫైనల్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ జట్టు 73–53తో ఫ్యూచర్ కిడ్స్‌పై విజయం సాధించింది. విజేత జట్టు తరఫున శ్రీరామ్ 27 పాయింట్లతో చెలరేగిపోగా... ఆయుష్ 17, సత్య 13, రోహన్ 12 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ఫ్యూచర్ కిడ్స్ తరఫున అద్యాన్ 15, అఖిల్ 13, అనీశ్ 12 పాయింట్లు సాధించారు. బాలికల ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ జట్టు 50–18తో చిరెక్ పబ్లిక్ స్కూల్‌ను చిత్తు చేసి టైటిల్ ఎగరేసుకుపోయింది. విజేత జట్టు తరఫున మధుర 16, భావన 14, శ్రీయ 8 హిత 6 పాయింట్లు చేయగా... చిరెక్ జట్టు తరఫున ధాత్రి 5, శ్రీయ 4 పాయింట్లు సాధించారు. బాలుర విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో చిరెక్ పబ్లిక్ స్కూల్ 49–23తో రాకెల్‌ఫోర్డ్ ఇంటర్నేషనల్ జట్టుపై గెలిచింది. విజేత జట్టు తరఫున యశ్ 17, రామ్ 11 పాయింట్లు చేశారు. రాకెల్‌ఫోర్డ్ జట్టు తరఫున నాథన్ 16 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. బాలికల విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ 32–22తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)పై నెగ్గింది. విజేత జట్టు తరఫున నిధి 16, హిమజ 10 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో బాస్కెట్‌బాల్ కోచ్‌లు రవీందర్, నయీముద్దీన్లు విజేతలకు ట్రోఫీలు అందజేశారు. -
హైదరాబాద్ స్కైకి షాకిచ్చిన పుణే
పుణే: యూబీఏ ప్రొ బాస్కెట్‌బాల్ లీగ్‌లో హైదరాబాద్ స్కై జట్టుకు పుణే పెష్వాస్ చేతిలో పరాజయం ఎదురైంది. ఇక్కడి బాలేవడి స్టేడియంలో శనివారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో పుణే 109-99 స్కోరు తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ టోర్నీలో పుణే జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ వంద పైచిలుకు పాయింట్లు సాధించింది. పెష్వాస్ తరఫున నరేందర్ (27) చక్కని ప్రదర్శన కనబరిచాడు. స్కై జట్టులో మహిపాల్ (26), మహేశ్ (20) రాణించారు. మొత్తం నాలుగు క్వార్టర్లలోనూ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో తొలి క్వార్టర్‌ను పుణే 27-22తో ముగించింది. రెండో క్వార్టర్లో ఒకదశలో హైదరాబాద్ 39-38తో ఒక పాయింట్ ఆధిక్యంలో నిలిచినప్పటికీ... చివరకు పుణే 53-52తో ఆధిక్యంలోకి వచ్చింది. అనంతరం హైదరాబాద్ ఆటగాళ్లు మహిపాల్, మహేశ్ దూకుడుగా ఆడటంతో స్కై జట్టు 79-77తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. ఇక చివరి క్వార్టర్లో పెష్వాస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీంతో హైదరాబాద్ పరాజయం చవిచూసింది. -
ఎక్సైజ్ జట్టు గెలుపు
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా వార్షిక బాస్కెట్‌బాల్ లీగ్‌లో సెంట్రల్ ఎక్సైజ్ జట్టు 73-43 తేడాతో లయోలా అకాడమీపై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 43-24 పాయింట్లతో ఎక్సైజ్ జట్టు ముందంజలో ఉంది. వినయ్ యాదవ్ 19, శివారెడ్డి 14 పాయింట్లు సాధించి ఎక్సైజ్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. లయోలా అకాడమీ జట్టులో గ ణేశ్ (16), ఉదయ్ (9) ఆకట్టుకున్నారు. ఇతర మ్యాచ్‌ల వివరాలు రాయల్ రన్నర్స్ క్లబ్: 49 (మురళీ 18, చెన్నా 10), సంస్కృతి కాలేజ్: 26 (హైదర్ 22). బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ: 58 (అఖిల్ 22, అరవింద్ 12), సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్: 33 (ఆదిత్య 21, హర్ష 10). లయన్స్: 42 (లలిత్ 11, ప్రీత్రాజ్ 11, జానకిరామ్ 8), హెచ్‌పీఎస్ ఎ: 28 (నరేన్ 10, అశుతోష్ 5).