ఎక్సైజ్ జట్టు గెలుపు | Exercise team wins team wins | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ జట్టు గెలుపు

Published Wed, Oct 16 2013 11:57 PM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

Exercise  team wins team wins

జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా వార్షిక బాస్కెట్‌బాల్ లీగ్‌లో సెంట్రల్ ఎక్సైజ్ జట్టు 73-43 తేడాతో లయోలా అకాడమీపై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 43-24 పాయింట్లతో ఎక్సైజ్ జట్టు ముందంజలో ఉంది. వినయ్ యాదవ్ 19, శివారెడ్డి 14 పాయింట్లు సాధించి ఎక్సైజ్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. లయోలా అకాడమీ జట్టులో గ ణేశ్ (16), ఉదయ్ (9) ఆకట్టుకున్నారు.
 
 ఇతర మ్యాచ్‌ల వివరాలు
 రాయల్ రన్నర్స్ క్లబ్: 49 (మురళీ 18, చెన్నా 10), సంస్కృతి కాలేజ్: 26 (హైదర్ 22).
 బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ: 58 (అఖిల్ 22, అరవింద్ 12), సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్: 33 (ఆదిత్య 21, హర్ష 10).
 లయన్స్: 42 (లలిత్ 11, ప్రీత్‌రాజ్ 11, జానకిరామ్ 8), హెచ్‌పీఎస్ ఎ: 28 (నరేన్ 10, అశుతోష్ 5).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement