
క్రీడాపోటీల్లో గజరాజుల సందడి
శివమొగ్గ : సక్రబైలు అటవీప్రాంతంలో వన్యజీవి సప్తాహ సమారంభం కార్యక్రమంలో భాగంగా ఆదివారం అటవీశాఖ వన్యజీవి విభాగం, మహానగరపాలికె, జిల్లా పర్యాటకశాఖ అభివృద్ధి సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏనుగుల పండుగ (ఆనెహబ్బ) కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేబీ.ప్రసన్నకుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది ఏనుగులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు.
క్రికెట్, పుట్‌బాల్, బాస్కెట్‌బాల్, నృత్యం, చెరుకులు తినే పోటీలు, నీరుచిమ్మడం తదితర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. పోటీల్లో గీతా, గంగ, కపిల, సాగర, సూర్య, ఇందిరా, అమృత, అలె మొత్తం 8 ఏనుగులు పోటీల్లో పాల్గొన్నాయి. చిన్న ఏనుగులైన అమృత, అలె చేసిన గంగ్నమ్‌స్టైల్ పాటకు, చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో పాటలకు ఈ రెండు ఏనుగుల చేసిన నృత్యం ఆహుతులను అలరించింది. ఏనుగుల క్రీడాపోటీలను తిలకించడానికి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేశారు. ఈ సందర్భంగా అటవీశాఖ సీనియర్ అదికారి స్మితాబిజ్జూరు, మేయర్ ఖుర్షీదాభాను తదితరులు పాల్గొన్నారు.