IPL 2023: Tamannah and Rashmika Dance Goes Viral On social media - Sakshi
Sakshi News home page

IPL 2023 Opening Ceremony: అట్టహాసంగా ఐపీఎల్.. టాలీవుడ్ పాటలతో అదరగొట్టిన తమన్నా, రష్మిక

Published Fri, Mar 31 2023 7:27 PM | Last Updated on Fri, Mar 31 2023 7:53 PM

Tamannah and Rashmika Dance goes Viral At IPL-2023 - Sakshi

Photo Credit: IPL Twitter

ఐపీఎల్-2023 సందడి గుజరాత్‌లోని ఆహ్మదాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఆరంభ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మిల్కీ బ్యూటీ తమన్నా వేదికపై మెరిశారు. టాలీవుడ్ సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ స్టేడియాన్ని ఊర్రూతలూగించారు. 

'ఊ అంటావా మావ' అంటోన్న తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా ఐపీఎల్ వేదికపై అదరగొట్టింది. పుష్ప సినిమాలోని సూపర్ హిట్ సాంగ్‌ 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' అంటూ స్టేడియాన్ని హోరెత్తించింది. ఈ పాటకు అభిమానులు మొత్త స్టేడియంలో పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోయారు. 

నాటు నాటు సాంగ్‌తో రష్మిక మందన్నా

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఐపీఎల్ వేదికపై దుమ్మురేపింది. పుష్ప సినిమాలోని 'సామి సామి', శ్రీవల్లి పాటలతో సహా.. ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటు అంటూ స్టెప్పులతో అదరగొట్టింది. కాగా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్-2023 వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement