విశాఖపట్నంలో సీతమ్మధార ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్‌లో ఈనెల 5 నుంచి 7 వరకు జరిగిన అంతర్ జిల్లాల యూత్ బాస్కెట్‌బాల్ పోటీల బాలుర విభాగంలో తూర్పుగోదావరి జట్టు విజేతగా నిలిచిందని జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS కార్యదర్శి ఎం.ఉపేంద్ర సోమవారం
యూత్ బాస్కెట్‌బాల్ విజేత ‘తూర్పు’
May 9 2017 12:36 AM | Updated on Sep 5 2017 10:42 AM
పిఠాపురం టౌ¯ŒS :
విశాఖపట్నంలో సీతమ్మధార ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్‌లో ఈనెల 5 నుంచి 7 వరకు జరిగిన అంతర్ జిల్లాల యూత్ బాస్కెట్‌బాల్ పోటీల బాలుర విభాగంలో తూర్పుగోదావరి జట్టు విజేతగా నిలిచిందని జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS కార్యదర్శి ఎం.ఉపేంద్ర సోమవారం తెలిపారు. ఆదివారం విశాఖపట్నం జట్టుతో హోరాహోరీగా జరిగిన ఫైనల్స్‌లో తూర్పు జట్టు 82–61 స్కోర్ తేడాతో విజయం సాధించిందన్నారు. కాగా బాలికల విభాగంలో మూడోస్థానం కోసం జరిగిన పోటీలో తూర్పుగోదావరి జట్టు పశ్చిమ గోదావరి జట్టుతో తలపడి 38–26 స్కోర్‌తో గెలుపొందిందన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను, శిక్షణ ఇచ్చిన కోచ్‌లు పి.శ్రీనివాసరావు, ఐ.భీమేష్, మేనేజర్లు బొజ్జా సతీష్, పి.రమాదేవిలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.మురళీధర్, ఆర్.ఐ.పి. టి.వి.ఎస్ రంగారావు, అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు గన్నమనేని చక్రవర్తి, కార్యదర్శి ఉపేంద్ర, కోశాధికారి ఎ¯ŒSవీవీ శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు కె.పురుషోత్తమరావు, యర్రా జగన్నాథరావు అభినందించారు.
Advertisement
Advertisement