టూటౌన్ : సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు మెదక్ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు వచ్చే నెల 2వ తేదిన నల్లగొండలోని సెయింట్ ఆల్ఫెన్సస్ స్కూల్‌లో ఎంపిక జరపనున్నారు. బాస్కెట్‌బాల్ అండర్–14 బాల బాలికల జట్లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కరెంట్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వయసు ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకోని రావాలని కోరారు. ఇతర వివరాల కొరకు 9848432182 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
సెప్టెంబర్ 2న బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
Published Tue, Aug 30 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM