అండర్ 17 బాస్కెట్ బాల్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు
Published Sun, Oct 16 2016 6:47 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM
రామచంద్రపురం:
అండర్ 17 జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడాప్రాంగణంలో నిర్వహించారు. బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి. స్టాలిన్ ఈపోటీలను ప్రారంభించారు. రాష్ట్ర అసోసియేషన్ కోశాధికారి గన్నమని చక్రవర్తి మాట్లాడుతూ ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు ముమ్మిడివరంలో జరిగే అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా బాలుర, బాలికల జట్ల ప్రాపబుల్స్‌ను ఎంపిక చేసినట్టు తెలిపారు. బాలుర, బాలికల జట్లకు 20 మంది చొప్పున ఎంపిక చేశామన్నారు. వీరికి ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తామన్నారు. శిక్షణానంతరం ఫైనల్ జట్టును ప్రకటిస్తామన్నారు. అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐ. భీమేష్, సంయుక్త కార్యదర్శి ఎం. ఉపేంద్ర, కోశాధికారి ఎన్‌వీవీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జీడీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement