విశాఖపట్నం,న్యూస్‌లైన్: చైనా నావికా దళానికి చెందిన రెండు నౌకలు శనివారం విశాఖలోని తూర్పు నావికా దళానికి చేరుకోనున్నాయి. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పీఎల్‌వీ నేవీకి చెందిన జింఘీ, వీఫింగ్ అనే ఈ రెండు నౌకలు రానున్నాయి. నౌకలతో పాటు వచ్చే చైనా నావికాదళాధికారులు ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అనిల్ చోప్రాతో భేటీ అవుతారు. అన ంతరం విశాఖలోని పలు యూనిట్లను సందర్శించనున్నారు.
ఈ సందర్భంగా ఈస్ట్రన్ ఫ్లీట్ జట్లతో పిఎల్‌ఎ నేవీ దళ సభ్యులు బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు అడనున్నారు. భారత్‌తో పాటు ఆసియన్ దేశాలైన మయన్మార్, ఇండోనేషియా, వియత్నాంలతో సత్సంబంధాలలో బాగంగా ఈ యుద్ధ నౌకలు విశాఖ వస్తున్నాయి. 20న విశాఖ నుంచి నౌకలు తిరుగు పయనం కానున్నాయి.
నేడు చైనా యుద్ధ్దనౌకల రాక
Published Sat, May 17 2014 12:45 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
Advertisement
Advertisement